కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లను డ్యామ్‌లుగా ఏ ప్రాతిపదికన పరిగణించారు
2019లో బరాజ్‌లు పూర్తయితే 2021లో వాటిని గుర్తించడం వెనక ఆంతర్యమేంటి?
రాష్ట్ర డ్యామ్‌ల భద్రత సంస్థ మాజీ ఎస్‌ఈ మురళీకృష్ణకు పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నలు
ఆయన అమెరికాలో ఉండటంతో వర్చువల్‌గా సాగిన క్రాస్ ఎగ్జామినేషన్
సాక్షి, హైదరాబాద్: ‘వరదనీటి మళ్లింపు కోసం ని ర్మించే బరాజ్‌లను నీటినిల్వ డ్యామ్‌లుగా ఏ ప్రాతి పదికన పరిగణించారు? 2019లో బరాజ్‌లు పూర్త యితే 2021లో వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద 2023 జూలైలో కాళేశ్వరం బరాజ్‌లను డ్యామ్ లుగా గుర్తించడం వెనక అంతర్యం ఏమిటి?’ అని రాష్ట్ర డ్యామ్‌ల భద్రత సంస్థ (ఎస్డీఎస్‌ఓ) మాజీ ఎస్‌ఈ మురళీకృష్ణను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం అమెరికాలో ఉన్న మురళీకృష్ణను వర్చువల్‌గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.
చట్టంలో ఉన్నందునే పరిగణించాం..
‘డ్యామ్‌ల రక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మీరు అఫిడవిట్లో పేర్కొన్నదంతా వాస్తవమే నా? మీ బాధ్యతలేంటి?’ అని కమిషన్ మురళీకృష్ణ ను ప్రశ్నించింది. అందుకు ఆయన బదులిస్తూ 2021 డిసెంబర్ 30న నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ను నోటిఫై చేశారని పేర్కొన్నారు. 15 మీటర్ల ఎత్తు కలిగి, నీటిని నిల్వ చేసే జలాశయాలతోపాటు 10 మీటర్లకు మించి ఎత్తున్న చెక్ డ్యామ్‌లను కూడా డ్యామ్‌లుగా పరిగణించాలని చట్టంలో ఉందని మురళీకృష్ణ తెలియజేశారు.
దీనిపై కమిషన్ స్పంది స్తూ ‘నీటిని మళ్లించడానికే బరాజ్‌లు కడతారు.. మరి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను డ్యామ్‌లుగా ఎలా పరిగణించారు? అని మళ్లీ ప్రశ్నించింది. చట్ట ప్రకారం స్పెసిఫైడ్ డ్యామ్‌లుగా బరాజ్‌లను నోటి ఫై చేశారని మురళీకృష్ణ వివరించారు. డ్యామ్‌ల రక్ష ణ చట్టం అమలు కోసం క్షేత్రస్థాయిలో అధికారుల తో చర్చించామని.. ఆయా డ్యామ్‌లను సమగ్రంగా పరిశీలించి నోటిఫై చేయించామని తెలిపారు.
బరా జ్‌లు ఎప్పుడు పూర్తయ్యాయని కమిషన్ ప్రశ్నించ గా 2023లో స్పెసిఫైడ్ డ్యామ్‌లుగా నోటిపై చేశామ న్నారు. 2021లో చట్టం వస్తే 2019లోనే బరాజ్ పూ ర్తవడం వాస్తవమా? కాదా? అని కమిషన్ అడగ్గా వాస్తవమేనని చెప్పారు. పదేపదే విజ్ఞప్తుల అనంత రం స్పెసిఫైడ్ డ్యామ్‌ల జాబితాలో బరాజ్‌లను చేర్చారని బదులిచ్చారు.
2019లో మేడిగడ్డలో వర దలు వచ్చాయని, తొలుత సుందిళ్ల, అన్నారంలో బుంగలు ఏర్పడ్డాయని, ఆ తర్వాత మేడిగడ్డ దెబ్బ తిందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయి తే బరాజ్‌ల అధికారులు ఈ విషయాన్ని నివేదించలేదని మురళీకృష్ణ వెల్లడించారు.
రెండో వారంలో మళ్లీ విచారణ
నాలుగో విడత క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన జస్టిస్ చంద్రఘోష్.. మంగళవారం సాయంత్రం కోల్‌కతా తిరిగి వెళ్లనున్నారు. అనంతరం రెండో వారంలో తిరిగి హైదరాబాద్ వచ్చి ఐదో దఫా విచా రణలో ఈఎన్సీలు, మాజీ ఈఎన్సీలను ప్రశ్నించ నున్నారు. ఆ తర్వాత ఐఏఎస్‌లను విచారించే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment