comission
-
‘మేడిగడ్డ’ ఎప్పుడు దెబ్బతింది?
సాక్షి, హైదరాబాద్: ‘వరదనీటి మళ్లింపు కోసం ని ర్మించే బరాజ్‌లను నీటినిల్వ డ్యామ్‌లుగా ఏ ప్రాతి పదికన పరిగణించారు? 2019లో బరాజ్‌లు పూర్త యితే 2021లో వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద 2023 జూలైలో కాళేశ్వరం బరాజ్‌లను డ్యామ్ లుగా గుర్తించడం వెనక అంతర్యం ఏమిటి?’ అని రాష్ట్ర డ్యామ్‌ల భద్రత సంస్థ (ఎస్డీఎస్ఓ) మాజీ ఎస్ఈ మురళీకృష్ణను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది.కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం అమెరికాలో ఉన్న మురళీకృష్ణను వర్చువల్‌గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.చట్టంలో ఉన్నందునే పరిగణించాం..‘డ్యామ్‌ల రక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మీరు అఫిడవిట్లో పేర్కొన్నదంతా వాస్తవమే నా? మీ బాధ్యతలేంటి?’ అని కమిషన్ మురళీకృష్ణ ను ప్రశ్నించింది. అందుకు ఆయన బదులిస్తూ 2021 డిసెంబర్ 30న నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ను నోటిఫై చేశారని పేర్కొన్నారు. 15 మీటర్ల ఎత్తు కలిగి, నీటిని నిల్వ చేసే జలాశయాలతోపాటు 10 మీటర్లకు మించి ఎత్తున్న చెక్ డ్యామ్‌లను కూడా డ్యామ్‌లుగా పరిగణించాలని చట్టంలో ఉందని మురళీకృష్ణ తెలియజేశారు. దీనిపై కమిషన్ స్పంది స్తూ ‘నీటిని మళ్లించడానికే బరాజ్‌లు కడతారు.. మరి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను డ్యామ్‌లుగా ఎలా పరిగణించారు? అని మళ్లీ ప్రశ్నించింది. చట్ట ప్రకారం స్పెసిఫైడ్ డ్యామ్‌లుగా బరాజ్‌లను నోటి ఫై చేశారని మురళీకృష్ణ వివరించారు. డ్యామ్‌ల రక్ష ణ చట్టం అమలు కోసం క్షేత్రస్థాయిలో అధికారుల తో చర్చించామని.. ఆయా డ్యామ్‌లను సమగ్రంగా పరిశీలించి నోటిఫై చేయించామని తెలిపారు.బరా జ్లు ఎప్పుడు పూర్తయ్యాయని కమిషన్ ప్రశ్నించ గా 2023లో స్పెసిఫైడ్ డ్యామ్‌లుగా నోటిపై చేశామ న్నారు. 2021లో చట్టం వస్తే 2019లోనే బరాజ్ పూ ర్తవడం వాస్తవమా? కాదా? అని కమిషన్ అడగ్గా వాస్తవమేనని చెప్పారు. పదేపదే విజ్ఞప్తుల అనంత రం స్పెసిఫైడ్ డ్యామ్‌ల జాబితాలో బరాజ్‌లను చేర్చారని బదులిచ్చారు. 2019లో మేడిగడ్డలో వర దలు వచ్చాయని, తొలుత సుందిళ్ల, అన్నారంలో బుంగలు ఏర్పడ్డాయని, ఆ తర్వాత మేడిగడ్డ దెబ్బ తిందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయి తే బరాజ్‌ల అధికారులు ఈ విషయాన్ని నివేదించలేదని మురళీకృష్ణ వెల్లడించారు.రెండో వారంలో మళ్లీ విచారణనాలుగో విడత క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన జస్టిస్ చంద్రఘోష్.. మంగళవారం సాయంత్రం కోల్‌కతా తిరిగి వెళ్లనున్నారు. అనంతరం రెండో వారంలో తిరిగి హైదరాబాద్ వచ్చి ఐదో దఫా విచా రణలో ఈఎన్సీలు, మాజీ ఈఎన్సీలను ప్రశ్నించ నున్నారు. ఆ తర్వాత ఐఏఎస్‌లను విచారించే అవకాశాలున్నాయి. -
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: ‘తప్పుడు అఫిడవిట్ దాఖలు చేస్తారా? అన్నీ నిజాలే చెప్తాను.. అని ప్రమాణం చేసి అబద్ధాలు ఎలా ఆడతారు ? క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలా..’అని సుందిళ్ల బరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) గంగం వేణుబాబుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా మంగళవారం 16 మంది నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. అఫిడవిట్లో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలేనా? సుందిళ్ల బరాజ్ బ్లాక్–2ఏ డిజైన్, డ్రాయింగ్స్ ఉన్నాయా? ..అని విచారణ ప్రారంభంలో ఈఈ గంగం వేణుబాబును కమిషన్ ప్రశ్నించింది. బరాజ్‌లో నిర్మించిన ఇతర బ్లాకుల డిజైన్లు, డ్రాయింగ్స్ ఆధారంగా బ్లాక్–2ఏను నిర్మించాలని నాటి రామగుండం సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశించారని వేణుబాబు బదులిచ్చారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈ ఆమోదించిన డిజైన్లతోనే బ్లాక్–2ఏ కట్టామని అఫిడవిట్లో మీరు పొందుపరిచిన అంశం అబద్ధమా? ఆమోదిత డ్రాయింగ్స్ లేకుండానే బ్లాక్–2ఏ నిర్మించారా? అఫిడవిట్లో అబద్ధాలు ఎలా చెప్తారు? అని ఈ సందర్భంగా ఆయనపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పొరపాటైంది.. అఫిడవిట్లో పొందుపరిచిన అంశం వాస్తవం కాదు’అని వేణుబాబు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. మీరు ఒక ఇంజనీర్ ? బాధ్యత లేదా? ఏ బ్లాకును కట్టాకా దాని డిజైన్ల ఆధారంగా ఏయే బ్లాకులు కట్టారు? బ్లాక్ –1, 2 కట్టిన తర్వాత బ్లాక్–2ఏ కట్టారా? అని కమిషన్ నిలదీయగా, సమాధానం ఇవ్వలేక వేణుబాబు ఇబ్బందిపడ్డారు. తప్పుడు అఫిడవిట్ ఇవ్వడం నేరం.. క్రిమినల్ కేసు పెట్టాలా? అని కమిషన్ మందలించింది. బ్లాక్–2, 3ల నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారని తదుపరిగా కమిషన్ ప్రశ్నించగా, వేణుబాబు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు. తేదీలు తెలియకపోతే కనీసం ఏ సంవత్సరమో తెలపాలని కమిషన్ కోరగా, 2016 నిర్మాణం ప్రారంభమైందని బదులిచ్చారు. బ్లాక్–2, 3, 2ఏల నిర్మాణం 2017లో ప్రారంభించినట్టు రికార్డుల్లో ఉందని మళ్లీ కమిషన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈఎన్సీ ఆదేశాలతోనే బ్లాక్–2ఏ నిర్మాణం సుందిళ్ల బరాజ్ బ్లాక్–2ఏకి సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ లేవని రిటైర్డ్ డీఈఈ బండారి భద్రయ్య వెల్లడించారు. బ్లాక్–2, బ్లాక్–3 మధ్య దూరం పెరగడంతో అదనంగా బ్లాక్–2ఏ నిర్మించాల్సి వచి్చందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. డ్రాయింగ్స్ లేకుండానే ఇతర బ్లాకులను ఎలా కట్టారో బాక్–2ఏను సైతం అదే తరహాలో కట్టాలని రామగుండం మాజీ సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశించారని తెలియజేశారు. డ్రాయింగ్స్ లేకుండా ఎలా కట్టారు? అని కమిషన్ నిలదీయగా, ఆయన పైవిధంగా బదులిచ్చారు. సుందిళ్ల బరాజ్ పూర్తయినట్టు తాను ధ్రువీకరణ పత్రం జారీ చేశానని మరో డీఈఈ సునీత కమిషన్‌కు వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తనకు సంబంధం లేదని చొప్పదండి ఈఈ శ్రీధర్ బదులిచ్చారు. సుందిళ్ల పునరుద్ధరణ పూర్తి అఫిడవిట్లో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలేనా? నిజం తప్ప మరేమీ చెప్పను.. అని చేసిన ప్రమాణానికి అర్థం తెలుసా? అని రామగుండం ఎస్ఈ సత్యరాజుచంద్రను కమిషన్ ప్రశ్నించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర సిఫారసుల ఆధారంగా సుందిళ్ల బరాజ్‌కు అత్యవసర మరమ్మతులను నిర్మాణ సంస్థ నవయుగ సొంత ఖర్చులతో చేపట్టిందని, బ్లాక్–8కి ఎదురుగా ఉన్న కాంక్రీట్ బ్లాకుల పునరుద్ధరణ తప్ప మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయని ఏఈఈ చెన్న అశోక్‌కుమార్ తెలిపారు. ఏ రోజు పనిని అదేరోజు పరిశీలించి ప్లేస్మెంట్ రిజిస్టర్లో నమోదు చేసి సంతకాలు చేశారా? అని ఏఈఈ హరితను కమిషన్ అడగ్గా, అవును అని ఆమె బదులిచ్చారు. క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరైన మిగిలిన ఇంజనీర్లు బరాజ్‌ల నిర్మాణంతో తమకు సంబంధం లేదని బదులిచ్చారు. -
‘కాఫర్ డ్యామ్’ నిర్లక్ష్యం పాక్షికంగా నిజమే!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తయ్యాక కాఫర్ డ్యామ్, షీట్‌పైల్స్‌ను పూర్తిగా తొలగించకపోవడంతో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి బరాజ్ దెబ్బతిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వ్యాఖ్యానించింది. ఇందుకు నీటిపారుదల శాఖ, నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం కారణం కాదా? అని అధికారులను ప్రశ్నించగా ‘పాక్షికంగా నిజమే’నని కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం సీఈ కె.సుధాకర్‌రెడ్డి అంగీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా శనివారం ఆయన్ను కమిషన్ సుదీర్ఘంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఒప్పందం ప్రకారం బరాజ్ కట్టాక నిర్మాణ సంస్థ కాఫర్ డ్యామ్‌ను ఎందుకు పూర్తిగా తొలగించలేదని నిలదీసింది. ఈ పనుల వ్యయాన్ని తొలి సవరణ అంచనాల్లో రూ. 61.21 కోట్లకు పెంచారని.. ఆ డబ్బును మిగుల్చుకోవాలని ఉద్దేశపూర్వకంగానే ఒప్పందాన్ని ఉల్లంఘించారని తప్పుబట్టింది. 2019లో వచ్చిన వరదలతో దెబ్బతిన్న మేడిగడ్డ బరాజ్‌ను నిర్మాణ సంస్థ నిర్వహించలేదని సుధాకర్‌రెడ్డి బదులిచ్చారు. 2020 వరదల్లో బరాజ్ దిగువన కాంక్రీట్ దిమ్మెలు కొట్టుకుపోగా పునరుద్ధరించాలని నిర్మాణ సంస్థను కోరారా? అని కమిషన్ ప్రశ్నించగా అప్పట్లో తానక్కడ లేనని బదులిచ్చారు. బరాజ్‌ల నిర్మాణం జరిగి అవి వినియోగంలోకి వచ్చినట్లు ధ్రువీకరించుకున్నాకే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లపై కౌంటర్ సంతకం చేశానని సమర్థించుకున్నారు. ఈ సర్టిఫికెట్ల జారీకి విధివిధానాలేవి లేవని ఆయన తెలపగా, కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విధివిధానాలు లేకున్నా రబ్బర్ స్టాంపులాగా సర్టిఫికెట్ల జారీకి మీ అంతరాత్మ ఎలా ఒప్పుకుందంటూ నిలదీసింది. మిమ్మల్ని మీరు ఇరకాటంలో పడేసుకుంటున్నారని మండిపడింది. సికెంట్ పైల్స్‌పైనే కమిషన్ గురి.. దేశంలో జలాశయాల నిర్మాణంలో సికెంట్ పైల్స్ వినియోగించరని, అలాంటిది మేడిగడ్డ బరాజ్‌కు ఎందుకు వాడారని కమిషన్ ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, వాటి డిజైన్లను సీఈ సీడీఓ ఇచ్చారని సుధాకర్‌రెడ్డి తెలియజేశారు. బరాజ్ కుంగిపోవడానికి మరో కారణంగా పునాదుల కింద సికెంట్ పైల్స్‌ను నిట్టనిలువుగా, క్రమబద్ధంగా నిర్మించలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ పేర్కొన్న విషయాన్ని కమిషన్ గుర్తుచేయగా ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన బదులిచ్చారు. సీఈ సీడీఓ డయాఫ్రమ్ వాల్ డిజైన్లు ఇచ్చినా దానికంటే తక్కువ వ్యవధి, వ్యయంతో నిర్మించవచ్చనే సికెంట్ పైల్స్‌కు మొగ్గు చూపినట్టు తెలిపారు. డీవాటరింగ్‌కు అంచనాల కంటే 49.6 శాతం అధిక చెల్లింపులను నిబంధనల ప్రకారమే చేశామని సుధాకర్ రెడ్డి తెలియజేశారు. టెండర్లు లేకుండానే డీపీఆర్ తయారీనా? టెండర్లు లేకుండానే నామినేషన్‌పై కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించినట్టు సుదాకర్‌రెడ్డి తెలిపారు. టెండర్లు పిలవొద్దని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా క్షేత్రస్థాయి పరీక్షల రికార్డులను వ్యాప్కోస్‌కు ఇవ్వాలని నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారని సుధాకర్‌రెడ్డి వివరించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు మరో ప్రశ్నకు బదులిచ్చారు. -
లోపాలు తేలినా.. నష్ట నివారణ చర్యలు తీసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో లోపాలపై 2021 అక్టోబర్, నవంబర్లలో తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇచ్చినా.. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేంద్రరావు ఆరోపించారు. బరాజ్‌ల ఎగువన, దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపో యాయని, దిగువన వేరింగ్ కోట్ దెబ్బతిన్నదని నివేదికలలో తెలిపామని వివరించారు. ప్రాజెక్టుల ఈఈలు, ఎస్ఈలు, సీఈలు దీనికి బాధ్యులని.. బరాజ్‌లలో లోపాలున్నట్టు ఎన్నడూ నల్లా వెంకటేశ్వర్లు తమకు నివేదిక సమర్పించలేదని పేర్కొ న్నారు.కాళేశ్వరం బరాజ్‌లపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం బి.నాగేంద్రరావును మూడున్నర గంటలకుపైగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 120కిపైగా ప్రశ్నలు వేసింది. నిర్వహణ, పర్యవేక్షణ (ఓఅండ్ఎం) విభా గానికి క్షేత్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ లేదని.. క్షేత్ర స్థాయి అధికారులకు ప్రాజెక్టుల నిర్వహణపై ఎప్ప టికప్పుడు ఆదేశాలిస్తామని ఈ సందర్భంగా కమి షన్‌కు నాగేంద్రరావు వివరించారు. తమ తనిఖీల నివేదికలను కమిషన్‌కు అందజేశారు. డిఫెక్ట్ లయ బిలిటీ పీరియడ్‌లో బరాజ్‌లకు రక్షణ చర్యలు తీసు కోవాలని.. వర్షాకాలానికి ముందు, తర్వాత, మధ్య లో పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించాలని తాము కోరినా రామగుండం ఈఎన్సీ చేయలేదని వివరించారు. ఐఎస్ కోడ్, కేంద్ర జలసంఘం మా న్యువల్స్ను కూడా పాటించలేదని ఆరోపించారు. బరాజ్‌ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసినట్టు నల్లా వెంకటేశ్వర్లు నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. గేట్ల నిర్వహణలో ఆపరేషన్ ప్రోటోకాల్ పాటించినట్టు సమాచారం లేదని.. వరద ఉధృతితో దిగువన రక్షణ పనులు దెబ్బతినడానికి అది ఒక కారణం కావొచ్చని తెలిపారు. మరమ్మతులు చేయడం కోసం బరాజ్ లలో నీటి నిల్వలను తగ్గించాలని నిర్మాణ సంస్థలు కోరినా పట్టించుకోలేదా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఈ దిశగా తమ కార్యాలయం ఆదేశాలేమీ ఇవ్వలేదని, అయితే నిల్వలను పెంచాలని నల్లా వెంకటేశ్వర్లు మౌఖిక ఆదేశాలిచ్చారని నాగేంద్రరావు వివరించారు.ఈఎన్సీ పోస్టు అలంకారానికా?‘బరాజ్‌ల వైఫల్యానికి నిర్వహణ వైఫల్యం ఓ కారణం కాదా? ఈఎన్సీ (ఓఅండ్ఎం) పోస్టు ఎందుకు ఉంది? అలంకారానికా?’ అని కమిషన్ నిలదీయగా.. నిర్వహణ బాధ్యత క్షేత్రస్థాయి సీఈలదేనని నాగేంద్రరావు బదులిచ్చారు. నిర్వహ ణ మాన్యువల్స్, సర్క్యులర్లు జారీచేసి వాటిని పాటించాలని కోరడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. నిరంతర నిల్వలతో బరాజ్‌ల ఎగువ భాగంలో మరమ్మతులు సాధ్యం కాలేదని, దిగువన అవకాశమున్నా మరమ్మతులు చేయలేదని వివరించారు. అయితే ‘నీటి నిల్వ అవసరాలకు బరాజ్‌లు పనికిరావని ఐఎస్ కోడ్‌లో ఉన్న విషయం మీకు తెలియదా? నిల్వ చేయాలని ఆదేశించినది ఎవరు? నిల్వలతోనే పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి బరాజ్‌లు దెబ్బతిన్నాయా?’ అని కమిషన్ ప్రశ్నించగా.. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే నీళ్లు నిల్వ చేశా రని నాగేంద్రరావు వివరించారు. నిల్వలతో ఇసుక కొట్టుకుపోయి దెబ్బతినే అవకాశాలుంటాయని అంగీకరించారు. మూడు బరాజ్‌ల పనులు సంపూర్ణంగా పూర్తయ్యాయా? అని కమిషన్ ప్రశ్నించగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పనులు పూర్తయ్యా యని, మేడిగడ్డ బరాజ్‌లో నిబంధనల ప్రకారం పనులు జరగలేదని నాగేంద్రరావు తెలిపారు.నాణ్యతా పరీక్షలకు మనస్సాక్షి అంగీకరించలేదా?‘వరదల అనంతరం బరాజ్‌ల పరిస్థితి ఏమిటి? ఏమైనా దెబ్బతిన్నాయా? నిర్మాణం సరిగ్గా జరిగిందా? లేదా? అని పరిశీలించాలని మీ మనస్సాక్షి అంగీకరించలేదా?’ అని క్వాలిటీ కంట్రోల్ రిటైర్డ్ సీఈ అజయ్‌కుమార్‌ను పీసీ ఘోష్ కమిషన్ నిలదీసింది. అయితే నిర్మాణ దశలో, బిల్లుల చెల్లింపుల సమయంలోనే నాణ్యతా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తామని, నిర్మాణం పూర్తయిన తర్వాత అవసరం ఉండదని అజయ్‌కుమార్ బదులిచ్చారు. ఇక అసంపూర్తి పనులను పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు నోటీసులిచ్చామని కమిషన్‌కు మాజీ ఈఈ సర్దార్ వివరించారు. గురువారం కమిషన్ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుకు రెండోసారి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. -
జాక్‌పాట్ దగా..!
పండ్లు, కూరగాయల రైతులకు మార్కెట్లో రుసుం రద్దుచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4న ఉత్తర్వులు జారీచేశారు. మార్కెట్ యార్డులు, చెక్‌పోస్టుల్లో కమీషన్ ఏజెంట్ల వ్యవస్థను రద్దుచేశారు. ఇందుకు సంబంధించి జీఓ ఎంఎస్ నంబర్ 58ను తీసుకువచ్చారు. మదనపల్లె మార్కెట్లో ఏమాత్రం మార్పు రాలేదు. సీఎం ఆదేశాలు బేఖాతర్ చేస్తూ ఇష్టారాజ్యంగా కమీషన్ల వసూళ్లకు పాల్పడుతూ జాక్‌పాట్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. సాక్షి, మదనపల్లె టౌన్ : అన్నదాతకు ఆసరాగా నిలవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు దళారులకే అండగా నిలుస్తున్నారు. దీంతో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దళారీలతో అధికారుల కుమ్మక్కై ఈ–వేలానికి మంగళం పలికి జాక్‌పాట్ విధానాన్నే నేటికీ కొనసాగిస్తున్నారు. దీంతో రోజుకు రైతులు లక్షల్లో నష్టపోతుండగా ప్రభుత్వ ఆదాయానికి వేలల్లో గండిపడుతోంది. రాష్ట్రంలోనే అతి పెద్ద మార్కెట్‌గా పేరుపొందిన మదనపల్లె టమాట మార్కెట్ యార్డుకు సరాసరిన 400 టన్నుల టమాటాలు వస్తున్నాయి. ప్రస్తుతం పది కిలోల టమాటాలు రూ.380 నుంచి రూ.400 వరకు ధర పలుకుతున్నాయి. ఇలా రోజుకు 4 లక్షల కిలోల టమాటాలు మార్కెట్‌కు వస్తున్నాయి. వాటికి ప్రస్తుత ధరతో పోల్చుకుంటే రూ.1.52 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారంలో జాక్‌పాట్, కమీషన్ విధానంతో సుమారు రైతులకు దాదాపు రూ.7.23 లక్షల మేర నష్టం కలుగుతోంది. ఈ లెక్కన మార్కెట్ అధికారులు నెలవారీ చూపించే వ్యాపార లావాదేవీల్లో నామమాత్రపు వ్యాపారం చేస్తున్నట్లు తప్పుడు నివేదికలు చూపుతున్నారనే సమాచారం ఉంది. మార్కెట్లో దాదాపు 100కు పైగా మండీల యజమానులు ఉన్నారు. ఒక కమీషన్ మండీ ఏజెంట్ నెలకు రూ.50 లక్షల వ్యాపారం నిర్వహిస్తే రూ.10 లక్షలు మాత్రమే చేస్తున్నట్లు అధికారులకు నివేదికలు పంపుతున్నారు. మార్కెట్ యార్డుకు సెస్, వ్యాపార కమీషన్ల ద్వారా సంవత్సరానికి రూ.1.90 కోట్లు వరకు ఆదాయం చేకూరుతోంది. మార్కెట్ యార్డులో రైతులకు, వ్యాపారికి నేరుగా ఎటువంటి సంబంధాలు ఉండవు. రైతు తీసుకొచ్చిన సరుకు కమీషన్ ఏజెంట్ ద్వారా విక్రయాలు జరుగుతాయి. కమీషన్ ఏజెంట్లు వ్యాపారుల మధ్య ముందుగానే వ్యాపారలావాదేవీల ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రైతు, వ్యాపారికి కమీషన్ ఏజెంటే మధ్యవర్తిగా వ్యవహరించి టమాటాలను జాక్‌పాట్, కమీషన్ పద్ధతిలో బహిరంగ వేలం నిర్వహిస్తాడు. వ్యాపారి నుంచి నగదును తీసుకుని తన కమీషన్ మినహా మిగిలిన మొత్తాన్ని రైతుకు అందజేస్తాడు. సీఎం ఉత్తర్వులు బేఖాతర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత వారం రైతులు పండించే పంటలకు కమీషన్ రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిబంధనలను ఇక్కడి అధికారులు మాత్రం ఖాతరు చేయడంలేదు. వ్యాపారులు, మండీల నిర్వాహకులతో కుమ్మక్కై యథేచ్ఛగా రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. మోసం జరుగుతోంది ఇలా.. రైతులు తీసుకువచ్చిన టమాటాలను తనకు ఇష్టమొచ్చిన కమీషన్ మండీల్లో విక్రయించేందుకు సంబంధిత కమీషన్ ఏజెంట్‌తో వ్యాపారి ముందుగానే ఒప్పందం కుదర్చుకుంటారు. ఉదాహరణకు మండీకి ఓ రైతు 50 క్రేట్లు టమాటాలు తీసుకెళ్తే కమీషన్ ఏజెంటు 10 క్రేట్లకు ఒక క్రేట్ (35 కేజీలు) జాక్‌పాట్ కింద తీసుకుంటాడు. క్రేట్‌కు లెక్కప్రకారం 30 కేజీలు భర్తీ చేయాల్సివుండగా అదనంగా ఐదు కిలోలు మండీ వ్యాపారులు తీసుకుంటున్నారు. 50 క్రేట్లకు గాను ఐదు క్రేట్లు జాక్‌పాట్ కింద ఉచితంగా తీసుకుంటాడు. వంద క్రేట్లకు పది క్రేట్లు బలవంతంగా రైతుల నుంచి కమీషన్ మండీల నిర్వాహకులు తీసుకుంటారు. వీటిని వాస్తవిక లెక్కల్లో చూపరు. ఈ కాయలు అమ్మగా వచ్చిన మొత్తాన్ని వ్యాపారి, అధికారులతోపాటు మండీల నిర్వాహకులు పంచుకుంటారు. తరుగు పేరుతో మెలిక ఒక క్రేట్ టమాటాలను రూ.500 వేలం పాటలో పాడితే రైతుకు డబ్బులు ఇచ్చే బిల్లులో తరుగు పేరుతో మెలిక పెట్టి రూ.10 నుంచి 20 తగ్గించి రూ.480 మాత్రమే అందజేస్తున్నారు. బిల్లు ఇచ్చే సమయంలో ప్రభుత్వం నాలుగు శాతం కమీషన్ తీసుకోవాలని నిబంధనలు ఉన్నా ఏజెంట్లు దీన్ని 10 నుంచి 30 శాతానికి పైగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలా వసూలు అయిన దాంట్లో మండీ ఓనర్‌కు క్రేట్ల బాడుగ పేరుతో రూ.5 నుంచి 10 రూపాయలు, దింపే కూలీలకు లెస్ పేరుతో మరో రూ.5, నూటికి రూ.10 కమీషన్, వ్యాపారికి రిటర్న్ కమీషన్ తీసేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇలా చివరగా 100కి రూ.10 కమీషన్ పట్టుకుంటూ డబ్బులు ఇచ్చే సమయంలో కాయలు నాణ్యత లేవనో, తరుగు ఉందనో ధరల్లో కోత విధిస్తున్నారు. ఈ నింబ«ంధనలన్నీ పట్టించుకోకుండా అధికారులు గాలికి వదిలివేయడంతో కమీషన్ మండీల నిర్వాహకులకు, వ్యాపారులకు వరంగా మారింది. అంతా చట్టవిరుద్ధం మదనపల్లె టమాటా మార్కెట్లో ఈ–వేలం పద్ధతిలో టమాటాలను రైతుల నుంచి మండీల నిర్వాహకులు, వ్యాపారులు మార్కెట్ అధికారులు కలసి ముందుగానే రైతులతో సమావేశమై ఆన్లైన్ విధానంతో ధరలు నిర్ణయిస్తారు. నాణ్యతను బట్టి ధరలు పలుకుతాయి. ఇలా చేయడం వల్ల రైతులు ఎక్కువ శాతం కమీషన్ నష్టపోకుండా ఉంటారు. జాక్‌పాట్ లేకుంటే రైతులకు మంచి లాభాలు ఉంటాయి. నష్టాలు ఉండవు. అయితే ఇక్కడంతా చట్టవిరుద్ధం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు మార్కెట్లోని మండీలకు తీసుకువచ్చిన టమాటాలను ఈనాం పద్ధతిలో వేలం వేస్తున్నామని మార్కెట్ అధికారులు రికార్డుల్లో నమోదుచేస్తూ బహిరంగ వేలం ద్వారా క్రయ, విక్రయాలు నిర్వహిస్తూ రైతులను బహిరంగంగానే మోసం చేస్తున్నారు. మార్కెట్ అధికారులే దగ్గరుండి మరీ రైతులను ఏమార్చి నష్టపరస్తున్నారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తా పదిహేను రోజులు గడువిచ్చాం.. ట్రేడర్ లైసెన్సులు పొందాలి. నోటీసులు ఇచ్చి రద్దుపరచినట్లు తెలియజేశాం. కమీషన్ తీసుకోకూడదని చెప్పాం. అన్ని మార్కెట్లలో వ్యాపారులు మాట్లాడుకుంటున్నారు. మార్కెట్ యార్డులో జాట్‌పాట్ పద్ధతి లేకుండా చేస్తా. ఇందుకోసం త్వరలో టమాటా రైతులతో సమావేశం ఏర్పాటుచేస్తాం. రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. అధిక కమీషన్ వసూలుచేసే వారిపై కఠిన చర్యలకు ఉన్నతాధికారులకు నివేధిస్తాం. – జగదీష్, మార్కెట్ ఇన్చార్జి సెక్రటరీ, మదనపల్లె -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
సాక్షి, పెద్దపల్లిరూరల్ : గౌరవ వేతనం చెల్లించడంతోపాటు పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని రేషన్‌డీలర్లు జిల్లా కేంద్రంలో శుక్రవారం భిక్షాటన చేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి వెం కటేశం మాట్లా డుతూ... కేంద్ర ప్రభుత్వం 2015 అక్టోబర్ నుంచి పెంచిన కమీషన్, పాత బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యంచేయడం తగదన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఈ విషయమై ప్రభుత్వానికి విన్నవించుకున్నా... ఇప్పటికి ఫలితం లేదని వాపోయారు. బకాయి ఉన్న 400 కోట్ల రూపాయల కమీషన్‌ను వెంటనే చెల్లించి ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న బియ్యం పంపిణీతో తమకు అందే కమీషన్ రేటు సరిపోవడంలేదన్నారు. నెలాఖరులోగా ప్రభుత్వం స్పందించకుంటే వచ్చేనెల ఒకటి నుంచి సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం నాయకులు మద్దెల నర్సయ్య, ఎలబోతారం శంకరయ్య, అడిచెర్ల రమేశ్, నంబయ్య, పెర్క లింగయ్య, కిషన్‌రెడ్డి, జయప్రద, పద్మ, సరస్వతీ, భారతీ, శ్రీనివాస్, ప్రభంజన్‌రెడ్డి, తోట శ్రీనివాస్, సత్యం, సాదిక్‌పాషా పాల్గొన్నారు. -
మరుగుదొడ్లనూ వదల్లేదు
సాక్షి, అమరావతి : పోలవరం కాంట్రాక్టుల్లో కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు మరుగుదొడ్లనూ విడిచిపెట్టటం లేదు. అక్కడ అంచనాలు పెంచి దండుకుంటుండగా... ఇక్కడ స్వచ్ఛంద సంస్థల ముసుగులో కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి కాజేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అసలు కాంట్రాక్టరు వ్యవస్థకే చోటు లేదు. నిర్మించుకున్న లబ్ధిదారుడికే నేరుగా బిల్లులు చెల్లించాలి. అయితే అధికార పార్టీ నేతలు స్వచ్ఛంద సంస్థల పేరుతో వీటిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్నవారికి కొత్తవి మంజూరు చేసి బిల్లులు చేసుకోవడం, ఒకే ఇంట్లో ఇద్దరి పేర్లతో రెండు మంజూరు చేయించడం, ఒకటే కట్టి రెండింటికి బిల్లులు చేసుకోవటం, అసలు కట్టకుండానే డబ్బులు డ్రా చేయటం లాంటి అక్రమాలకు పాల్పడుతు న్నారు. చాలా మంది పేదలు నిర్మాణ పనులన్నీ స్వయంగా చేపడుతున్నారు. అయితే కాంట్రాక్టర్లుగా మారిన అధికార పార్టీ నేతలు సిమెంట్, ఇసుక లాంటివి ఇచ్చి బిల్లు మాత్రం మొత్తం వారే తీసుకుంటున్నారు. స్వచ్ఛ భారత్ పథకంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం భారీగా నిధులు అందజేస్తోంది. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి విడుదల చేసిన నిధుల్లో రూ.600 కోట్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తిన అధికార పార్టీ నేతలు వెనకేసుకున్నట్లు అంచనా. రూ.600 కోట్లు దొడ్డి దారిన స్వాహా! స్వచ్ఛ భారత్‌లో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో గత మూడేళ్లలో 12.57 లక్షల మరుగుదొడ్లు కట్టినట్లు రికార్డుల్లో చూపించి రూ.1,813 కోట్లు బిల్లులు చేసుకున్నారు. నిర్మాణంలో ఉన్న మరో 2.92 లక్షల దొడ్లకు రూ.158 కోట్లు ఖర్చయిందని చెబుతున్నారు. పథకం కింద ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల చొప్పున చెల్లిస్తోంది. ఇందులో కేంద్రం రూ.7200, రాష్ట్ర ప్రభుత్వం రూ.4800 ఇస్తున్నాయి. కేంద్రం సూచించినట్లుగా పెద్ద సైజులో మరుగుదొడ్డికి కట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.మూడు వేలు కలిపి మొత్తం రూ. 15 వేలు ఇస్తోంది. రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం గత మూడేళ్లలో రూ.992 కోట్లు విడుదల చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.838 కోట్లు కలిపి మొత్తం రూ.1,830 కోట్లను విడుదల చేసింది. ఇందులో మూడో వంతు అంటే రూ.600 కోట్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తిన అధికారపార్టీ నేతల జేబుల్లోకే చేరినట్లు అంచనా. ఈ కమీషన్లు కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి నేతల వరకూ పంచుకుంటున్నారు. పంచాయతీ తీర్మానం పేరుతో పంపకాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ టీడీపీ నేతలు మరుగుదొడ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారు. చాలా చోట్ల లబ్ధిదారులకు అసలు మరుగుదొడ్డి మంజూరు అయినట్టు కూడా తెలియకపోవటం గమనార్హం. వారి పేరుతో చెల్లింపులు మాత్రం జరిగిపోయాయి. గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా అదేమీ లేకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి తాము చెప్పిన పేర్లతో మంజూరు చేయించారు. అవన్నీ తామే నిర్మిస్తామంటూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్లు పంపటంతో అధికారులు నేరుగా వారికే బిల్లులు చెల్లిస్తున్నారు. పదేళ్ల క్రితం కట్టిన వాటికీ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించిన పశ్చిమ గోదావరిలోని నల్లజర్ల మండలం చీపిరిగూడెంకు గత మూడేళ్లలో రూ. 55.95 లక్షలు మంజూరు కాగా అందులో రూ. 37.20 లక్షలు గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ నేతల ఖాతాల్లోనే జమ అయ్యాయి. గ్రామ సర్పంచి చెల్లు ఎస్ఎస్ వరలక్ష్మి (బ్యాంకు ఖాతా నెంబరు 558938779, ఇండియన్ బ్యాంకు, నల్లజర్ల) రూ. 13.20 లక్షలు, తలంశెట్టి చినవెంకటేశ్వర్లు( బ్యాంకు ఖాతా నెంబరు 20269213265, ఎస్బీఐ, నల్లజర్ల) రూ. 12 లక్షలు, కూసంపూడి వెంకటేశ్వరరావు (బ్యాంకు ఖాతా నెంబరు 20162344981, ఎస్బీఐ నల్లజర్ల) రూ. 12 లక్షలు డ్రా చేసుకున్నారు. సర్పంచి వరలక్ష్మి ఇంట్లో ఎప్పుడో పదేళ్ల కిందట నిర్మించుకున్న పాత మరుగుదొడ్డికి కొత్తగా నిర్మించినట్టు బిల్లులు చెల్లించారు. ఒకే ఇంటికి చెందిన మామ కోడళ్లు చెల్లు వెంకటేశ్వర్లు, శిరీష పేరిట రెండింటిని మంజూరు చేయించి ఒక బిల్లు తాలూకు డబ్బులు నేతలే కాజేశారు. సూరమ్మ అనే వృద్ధురాలికి మంజూరైన మరుగు దొడ్డిని ఆమె ఇంట్లో కాకుండా మరోచోటకట్టారు. అదే ఊరిలో మరుగుదొడ్డి మంజూరు కాక నిర్మాణం మధ్యలో వదిలేసుకున్న వారూ ఉన్నారు. ఇద్దరు టీడీపీ నేతల ఖాతాల్లోకి రూ. 63.60 లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలోనే నల్లజర్ల మండలం తెలికిచెర్ల గ్రామానికి రూ. 102.30 లక్షలు విడుదల కాగా అందులో రూ. 63.60 లక్షలు ఇద్దరు టీడీపీ నేతల ఖాతాల్లోకే చేరాయి. గ్రామానికి చెందిన కామన విజయకుమార్ (బ్యాంకు ఖాతా నెంబరు 62206957261, ఎస్బీహెచ్, నల్లజర్ల) రూ. 49.95 లక్షలు, బండి సుబ్బారావు (బ్యాంకు ఖాతా నెంబరు 702101000059021, ఆంధ్రాబ్యాంకు, నల్లజర్ల) రూ. 13.65 లక్షలు డ్రా చేసుకున్నారు. పాత మరుగుదొడ్లకూ నిధులు మంజూరు చేయించుకున్నారు. కొందరు లబ్ధిదారులకు మాత్రం రూ. ఆరు వేల చొప్పున ఇచ్చారు. అబ్బూరులో దొడ్లపై సర్పంచి శిలా ఫలకాలు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరుకు గత మూడేళ్లలో 482 మరుగుదొడ్ల మంజూరు కాగా అవన్నీ తానే కట్టినట్లు సర్పంచి కట్టా రమేష్ రూ. 72.81 లక్షలు తన ఖాతాలో జమ చేసుకున్నారు. ప్రతి మరుగుదొడ్డిపైనా ఆయన పేరుతో శిలాఫలకాలు సైతం ఏర్పాటు చేసుకోవటం గమనార్హం. అబ్బూరులో గద్దె వెంకట్రావు అనే వ్యక్తి మరుగుదొడ్డి గుంట నిర్మాణం చేపట్టి సిమెంట్ రేకులు సొంతంగా కొనుగోలు చేసుకున్నారు. ఆయనకు రావాల్సిన బిల్లు రమేష్ ఖాతాకే జమ అయింది. అక్కడ ఎస్టీ కాలనీలో 55 దాకా ఇళ్లు ఉంటే 68 మరుగుదొడ్లు నిర్మించినట్టు బిల్లులు చూపుతున్నారు. ఆరు లక్షల దొడ్లకు కేంద్రం కోత మరుగుదొడ్ల నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకోవటంతో రాష్ట్రానికి ఆరు లక్షల మరుగుదొడ్లను కేంద్రం కోత విధించింది. 2012 బేస్ లైన్ సర్వే ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 71.20 లక్షల నివాసాలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఉన్నవి పోగా ఏపీలో ఇంకా 28.20 లక్షల ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందజేసి నిధులు కోరింది. అయితే ఇప్పటికే మంజూరు చేసినవి పోనూ వీటి సంఖ్య 22.60 లక్షలకు మించి ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 6 లక్షల మరుగుదొడ్లకు కోత విధిస్తున్నట్లు రాష్ట్రానికి సమాచారమిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం చీపిరిగూడెంలో భీమడోలు ఏసమ్మ (లబ్ధిదారురాలి నెంబరు 30958020) పేరుతో బిల్లులు మంజూరైనట్లు రికార్డుల్లో ఉన్నా డబ్బులు అమెకు చేరలేదు. డబ్బులేక ఆమె కుటుంబం మధ్యలోనే నిర్మాణాన్ని ఆపేసింది. ప్రభుత్వం మాత్రం ఆ గ్రామాన్ని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్లలో ముంగర సత్తెమ్మకు పథకం మంజూరైందని టీడీపీ నేత చెప్పటంతో ఆమె కుమారుడు వెంకటేశ్వర్లు అప్పు చేసి మరుగుదొడ్డి కట్టుకున్నాడు. పనులు పూర్తయ్యాక బిల్లు కోసం ఆ ఊరి నేత వద్దకు వెళ్లగా మంజూరు కాలేదని చెబుతున్నారు. కానీ సత్తెమ్మ (30941761 లబ్ధిదారుడి నెంబరు)కు ఏడాది కిందటే బిల్లులు చెల్లింపులు పూర్తయినట్టు అన్లైన్ డేటాలో ఉంది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడులో పాత మరుగుదొడ్డికి బిల్లు మంజూరు చేయలేదని స్థానిక టీడీపీ నేత ఒకరు ఏడాది క్రితం ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడిపై దాడి చేశారు. ‘గ్రామంలో 78 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వాటిల్లో 50 మరుగుదొడ్లను టీడీపీ నాయకులే నిర్మించారు. మిగిలిన వాటిల్లో కొన్ని గతంలో నిర్మించినవి కాగా మరికొన్ని అసలు కట్టకుండానే బిల్లులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి పట్ల, నాపై బెదిరింపులకు దిగారు. వారి మాట వినకపోవటంతో టీడీపీ నాయకులు గ్రామసభలో దాడి చేసి గాయపరిచారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అధికారులపై ఒత్తిడి తెచ్చి నన్ను ఉద్యోగం నుంచి కూడా తొలగించారు’’ అని ఫీల్డ్ అసిస్టెంట్ యనమాల ఎడ్వర్డ్ ‘సాక్షి’కి తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణానికి నాలుగేళ్లుగా విడుదలైన నిధులు(రూ. కోట్లలో) రాష్ట్ర నిధులు - 838.16 కేంద్ర నిధులు - 992.06 మొత్తం - 1830.22 స్వాహా చేసింది - 600 గుంటూరు జిల్లాలో గంపగుత్తగా మరుగుదొడ్ల నిర్మాణ కాంట్రాక్టు పనులు చేసిన సర్పంచి కట్టా రమేష్ ప్రతి దొడ్డిపైనా తన పేరుతో వేసుకున్న శిలాఫలకం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా ప్రకటించిన గుంటూరు జిల్లా అబ్బూరులో ఇప్పటికీ మరుగుదొడ్డి లేని ఓ ఇల్లు పశ్చిమ గోదావరి జిల్లా చీపిరిగూడెం గ్రామంలో ప్రభుత్వ పథకంలో సమర్త మరియమ్మ ఇంట్లో గ్రామ సర్పంచే నిర్మించారు. మూడు నెలలకే రోడ్డుపైన అది ఉందని కూల్చిన వేసిన వైనం. ఛీపిరిగూడెం గ్రామంలో ఈమె పేరుతో మరుగుదొడ్డి మంజూరు అయింది. అయితే ఊళ్లో ఇంకొక చోట ఎక్కడో నిర్మించినట్టు నేతలు చెప్పడం డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న వృద్ద మహిళ. -
కొత్త జిల్లాలపై లీగల్ కమిషన్ నియమించాలి
తండ్రీ కొడుకుల కుట్రల్ని భగ్నం చేస్తాం శంషాబాద్ జిల్లాను రద్దు చేయండి సిరిసిల్ల జిల్లా ఇవ్వండి మంత్రి కేటీఆర్ క్యాట్‌వాక్ చేస్తున్నారు జిల్లా కోసం బహిరంగ సభ పెట్టండి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, విధివిధానాలపై సిట్టింగ్ జడ్జితో లీగల్ కమిషన్ నియమించాలని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరుగుతున్న జిల్లా సాధన ఉద్యమానికి ఆయన మంగళవారం సంఘీభావం తెలిపారు. సిరిసిల్ల ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర మంత్రి అయి సమంతతో క్యాట్‌వాక్ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో తండ్రీ కొడుకుల కుట్రలను కళ్లు తెరిచి భగ్నం చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో కోట్ల ముడుపులు దండుకున్నారని ఆరోపించారు. సిరిసిల్ల ప్రజలు జిల్లా కోసం ఉద్యమిస్తుంటే ప్రజల పక్షాన ఉండి జిల్లా ఏర్పాటు చేయాల్సిన మంత్రి పోరాడే బిడ్డలపై లాఠీఛార్జి చేయించడం ఏమిటని ప్రశ్నించారు. అధికార మదంతో కళ్లు మూసుకుపోయి మహిళలపై లాఠీచార్జి చేశారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ బంధువులకు శంషాబాద్‌లో వందల ఎకరాలున్నాయని జిల్లా చేస్తున్నారని ఆరోపించారు. శంషాబాద్‌ను రద్దు చేసి సిరిసిల్లను జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కావాలని అక్కడ ఎవరూ అడుగడం లేదన్నారు. సిరిసిల్ల ప్రజలకు టీడీపీ పార్టీ అండగా ఉంటుందని, జిల్లా కోసం సిరిసిల్లలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పార్టీల వారితో సభ నిర్వహించాలని సూచించారు. సిరిసిల్ల జిల్లా కోసం శాసనసభలో గళం విప్పుతానని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా ఇవ్వకుంటే టీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ చైర్మన్ దరువు ఎల్లన్న, జిల్లా సాధన జేఏసీ నేతలు రమాకాంత్‌రావు, కత్తెర దేవదాస్, అన్నమనేని నర్సింగరావు, మహేశ్‌గౌడ్, జక్కుల యాదగిరి, ఆడెపు రవీందర్, బుస్సా వేణు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం
ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ బిఉప్పులూరు(కొలిమిగుండ్ల): పాణ్యం మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో దారుణ హత్యకు గురైన ధారా ఓబులేసు, లక్ష్మయ్య కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ హామీ ఇచ్చారు. కోర్టు వాయిదాకు వచ్చి వెళుతుండగా మంగళవారం అన్నదమ్ములిద్దరు హత్యకు గురైన విషయం తెలిసిందే. పోస్ట్‌మార్టం అనంతరం బుధవారం మృతదేహాలను స్వగ్రామం బి.ఉప్పులూరుకు తీసుకొచ్చారు. కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్,ఎస్పీ ఆకే రవికృష్ణతో కలిసి చైర్మన్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. దోషులను ఎప్పటిలోగా పట్టుకుంటురో చెప్పాలని ఎస్పీని చైర్మన్ కోరారు. పథకం ప్రకారం జరిగిన ఈ హత్యను పోలీసులు ముందుగానే పసిగట్టలేకపోయారా అని అసహనం వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీ వాసులకు గట్టి భద్రత కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.6.50 లక్షలు అందించాలని కలెక్టర్‌ను కోరారు. ఓబులేసు, లక్ష్మయ్య భార్యలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జంట హత్యను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోందని కలెక్టర్ విజయ్‌మోహన్ చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టిగా వ్యవహరిస్తామని తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులను నాలుగు రోజుల్లో అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ సుధాకరరెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వినోద్‌కుమార్, ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల, శిరివెళ్ల, ఆళ్లగడ్డ సీఐలు పీటీ కేశవరెడ్డి, ప్రభాకరరెడ్డి, ఓబులేసుతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, ఎస్సీ, ఎస్టీ సెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.