విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు | Actions will be taken if the duties are neglected | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

Published Sun, Jul 16 2023 2:16 AM | Last Updated on Sun, Jul 16 2023 2:16 AM

Actions will be taken if the duties are neglected - Sakshi

జగిత్యాల: పేదలకు మెరుగైన వైద్యం అందించాలంటే వైద్యులు సమయపాలన పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశా రు. డాక్టర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లోనే ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం జగిత్యాల జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.   

సూపరింటెండెంట్‌ సహా పత్తాలేని పలువురు 
మంత్రి వచ్చిన సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాములు విధుల్లో లేరు. దీంతో విచారణకు మంత్రి ఆదేశించారు. ఇక స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకుండానే మంత్రి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు నేరుగా ఆస్పత్రికి చేరుకున్నారు. దాదాపు గంటన్నర పాటు వార్డుల్లో కలియ తిరిగారు.

ఆ సమయంలో గైనకాలజిస్ట్‌ అరుణశ్రీ లీవ్‌ పెట్టకుండా వెళ్లిపోవడం, పీడియాట్రిక్‌లోని ఇద్దరు ప్రొఫెసర్లు విధుల్లో లేకపోవడం, అనస్తీషి యా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతోపా టు, ఆప్తాల్మజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సుజాత లీవ్‌కు దరఖాస్తు చేయకుండా వెళ్లిపోవడంపై మంత్రి ఆ గ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే బాధ్యులకు మెమో జారీచేయాలని డీఎంఏ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు. కాగా, ‘వైద్యులు ఉన్నా.. లేనట్లే’శీర్షికన ఈనెల 7న ‘సాక్షి’కథనం ప్రచురించింది. స్పందించిన మంత్రి.. ఇటీవల జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఆస్పత్రిలోని వైద్యులతో నేరుగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఆకస్మికంగా తనిఖీకి వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement