8న లిఫ్ట్‌లను ప్రారంభిస్తాం
Published Sat, Aug 6 2016 1:45 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
చంద్రశేఖర్‌కాలనీ : నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లోని రెండు లిఫ్ట్‌లను ఈనెల 8న ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్(డీఆర్‌ఎం) అరుణాసింగ్ తెలిపారు. ఆమె శుక్రవారం రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని ఒకటో, మూటో ప్లాట్ ఫాంల వద్ద వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం నిర్మించిన రెండు లిఫ్ట్‌ల పనులను డీఆర్‌ఎం పరిశీలించారు. పనులు నాణ్యత ప్రమాణాలతో ఉండాలని రైల్వే ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు విచ్చేస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. లిఫ్ట్‌కు సమీపంలో ఎల్‌ఈడీలు ఏర్పాటు చేయాలని, లిఫ్ట్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బెంచీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా లిఫ్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రైల్వే ఇంజినీరింగ్, ఇతర విభాగాల అధికారులను ఆదేశించారు. అనంతరం రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ ప్రస్తుతం ప్రయాణికుల కోసం లిఫ్ట్‌లను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవిత 50 శాతం నిధులను సమకూరిస్తే త్వరలో ఎస్కలేటర్‌లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఇన్‌చార్జి స్టేషన్ మేనేజర్ సయ్యద్ జావెద్ హుస్సేన్, స్టేషన్ సీసీఐ గిరిరాజ్, రైల్వే స్టేషన్ ఎస్సై డి.సాయినాథ్, హైదరాబాద్ నుంచి వచ్చిన రైల్వే సీనియర్ డివిజనల్ ఇంజినీర్ యోగేశ్ కుమార్ సక్సేనా, నిజామాబాద్ ఏడీఈ సుధీర్‌కుమార్‌వర్మ, స్టేషన్ బుకింగ్ సూపర్‌వైజర్ సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణం తదితరులు పాల్గొన్నారు.
Advertisement