the railway station
-
పదిరోజులైనా.. పట్టించుకోరా..?
మోర్తాడ్ : ఇటీవల కురిసిన వర్షాలకు మొండివాగు ఉధృతంగా ప్రవహించడంతో రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారిలో మొండివాగుపై నిర్మించిన వంతెన కూలిపోయింది.. వంతెన కూలి పది రోజులు కావస్తున్నా రైల్వే అధికారులు చర్యలు చేపట్ట లేదు. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.. వంతెన నిర్మాణంలో అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో చిన్నపాటి వాగు ప్రవాహానికే కూలిపోయిందని స్థానికులు అంటున్నారు. వంతెన నిర్మించే సమయంలో పిల్లర్లు వేసి స్లాబ్ వేయకుండా రింగులను ఏర్పాటు చేసి వాటిపై సిమెంట్ బిల్లలు మాత్రమే వేశారు. మొండి వాగు ఉధృతికి వంతెనపై ఏర్పాటు చేసిన సిమెంట్ బిల్లలు కుప్పకూలాయి. వంతెన పూర్తిగా కూలడంతో రైల్వే స్టేషన్‌కు వెళ్లేదారి మూతపడింది. రైల్వే స్టేషన్, లైన్ ప్రారంభించకపోవడంతో ఈ ప్రాంతంలో అంతగా రద్దీ ఉండదు. అయితే రైల్వేస్టేషన్ పరిసరాల్లో పంటపొలాలు ఉండడంతో రైతులు, కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాలంటే ఈ వంతెన మీదుగానే వెళ్లాలి. అంతేకాక రైల్వే స్టేషన్లో చిన్న చిన్న పనులు కొనసాగుతున్నాయి. అధికారులు, కూలీలు, కాంట్రాక్టర్లు కూడా వెళ్లడానికి దారిలేకుండా పోయింది. పంట పొలాలకు వెళ్లడానికి వేరే మార్గం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయించాలని పలువురు కోరుతున్నారు. -
8న లిఫ్ట్‌లను ప్రారంభిస్తాం
చంద్రశేఖర్‌కాలనీ : నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లోని రెండు లిఫ్ట్‌లను ఈనెల 8న ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్(డీఆర్ఎం) అరుణాసింగ్ తెలిపారు. ఆమె శుక్రవారం రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని ఒకటో, మూటో ప్లాట్ ఫాంల వద్ద వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం నిర్మించిన రెండు లిఫ్ట్‌ల పనులను డీఆర్ఎం పరిశీలించారు. పనులు నాణ్యత ప్రమాణాలతో ఉండాలని రైల్వే ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు విచ్చేస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. లిఫ్ట్‌కు సమీపంలో ఎల్ఈడీలు ఏర్పాటు చేయాలని, లిఫ్ట్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బెంచీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా లిఫ్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రైల్వే ఇంజినీరింగ్, ఇతర విభాగాల అధికారులను ఆదేశించారు. అనంతరం రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ ప్రస్తుతం ప్రయాణికుల కోసం లిఫ్ట్‌లను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవిత 50 శాతం నిధులను సమకూరిస్తే త్వరలో ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఇన్చార్జి స్టేషన్ మేనేజర్ సయ్యద్ జావెద్ హుస్సేన్, స్టేషన్ సీసీఐ గిరిరాజ్, రైల్వే స్టేషన్ ఎస్సై డి.సాయినాథ్, హైదరాబాద్ నుంచి వచ్చిన రైల్వే సీనియర్ డివిజనల్ ఇంజినీర్ యోగేశ్ కుమార్ సక్సేనా, నిజామాబాద్ ఏడీఈ సుధీర్కుమార్వర్మ, స్టేషన్ బుకింగ్ సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణం తదితరులు పాల్గొన్నారు. -
పొంచిఉన్న ప్రమాదం
ఏడాది గడచినా అమలుకు నోచని హామీ భయాందోళనలో ప్రజలు వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట– శ్రీనివాస్‌నగర్ రైల్వే స్టేషన్లో మరో ప్రమాదం ముంచుకురానుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం ఈ స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు లేకపోవడంతో ఓప్రైవేటు స్కూల్ బస్సును రైలు ఢీకొనగా 16 మంది చిన్నారులు బలయ్యారు. ఈ దుర్ఘటన యావత్ భారతాన్ని కలచి వేసింది. దీంతో రైల్వే శాఖ అధికారులు కళ్లు తెరచి గేట్లు ఏర్పాటు చేశారు. అప్పట్లోనే రైల్వే స్టేషన్లో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని గ్రామస్తులు కోరారు. స్పందించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఏడాది క్రితం రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ. 4కోట్ల ప్రతిపాదనలు చేశామని, రైల్వే శాఖ అ«ధికారుల సమావేశంలో ప్రతిపాదనల లేఖను అందజేశామన్నారు. దీంతో స్పందించిన వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మ్యాచింగ్ గ్రాంట్‌ను ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారని గత ఏడాది ఎంపీ తెలిపారు. టెండర్లు ఆహ్వానించి రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఇచ్చిన హామీ ఏడాది గడుస్తున్నా జాడ లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతిరోజు వందలాది మంది, ముఖ్యంగా విద్యార్థులు పట్టాల పైనుండి నడుస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. స్టేషన్ దిగువ భాగంలోనే పాఠశాలలు ఉన్నందున విద్యార్థులకు ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందోనని పలువురు ఆందోళనకు గురవుతున్నారు. రైల్వే శాఖ అధికారులు స్పందించి బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో బాలుడి మృతి
ఆథోని మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదస్థితిలో ఓ బాలుడు రైలు కిందపడి మృతిచెందాడు. మృతుడు ఆథోని మండలం ఇస్వి గ్రామానికి చెందిన రాఘవరెడ్డి(14)గా గుర్తించారు. మూడు రోజుల క్రితం ఇంట్లో అదృశ్యమైన బాలుడు రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేటు కేంద్రాల్లో రైలు టికెట్ల విక్రయం!
జనవరి నుంచి అందుబాటులోకి రైల్వే శాఖ వినూత్న ప్రయోగం అందిన దరఖాస్తులు 47... వాటిలో ఎంపికైనవి 21 హైదరాబాద్‌లో 5 చోట్ల మాత్రమే ఏర్పాటు హైదరాబాద్: రైలు టికెట్ కొనాలంటే ఇక రైల్వే స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్లలో విక్రయించే టికెట్లనే ఇక ప్రైవేటు కేంద్రాల్లో కూడా పొందొచ్చు. ఈ మేరకు రైల్వే శాఖ కొత్తగా ప్రతిపాదించిన ‘యాత్రీ టికెట్ సువిధ కేంద్రాలు (వైటీఎస్‌కే)’ జనవరి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు రైల్వే స్టేషన్లు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో రైల్వేశాఖ ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా మాత్రమే సాధారణ రైల్వే టికెట్లు అందుబాటులో ఉంటున్నాయి. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు ఆన్లైన్ ద్వారా ఈ-టికెట్లు విక్రయిస్తున్నాయి. ఇప్పుడు రైల్వే కౌంటర్లలో అమ్మే టికెట్లను ప్రైవేటు సంస్థలు కూడా విక్రయించేలా కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం త్వరలో అమల్లోకి వస్తోంది. ప్రయాణికులు సుల భంగా టికెట్లు పొందాలనే ఉద్దేశంతో రూపకల్పన చేసిన ఈ కొత్త విధానానికి భారీ స్పం దన ఉంటుందని రైల్వే శాఖ భావిం చినా... వాస్తవానికి అది అంత గా విజయవంతమయ్యే సూచనలు కనిపించడం లేదు. వైటీఎస్‌కే ప్రతిపాదనకు ప్రైవేటు సంస్థలు పోటీపడి దరఖాస్తు చేసుకుంటాయనుకున్న రైల్వే శాఖకు షాక్ ఇస్తూ అత్యల్ప సంఖ్యలోనే సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పుడు కేవలం 21 సంస్థలకు అనుమతి లభించింది. హైదరాబాద్‌లో ఐదు చోట్ల మాత్రమే ఇవి ఏర్పాటు కానుండటం విశేషం. భవిష్యత్తులో వీటికి స్పందన ఉంటుందని అధికారులు ఆశిస్తున్నారు. పనితీరు ఇలా... గత ఐదేళ్లుగా ఈ-టికెటింగ్ అనుభవం ఉన్న సంస్థల నుంచి వైటీఎస్‌కే కోసం రైల్వేశాఖ గత ఆగస్టులో దరఖాస్తులు ఆహ్వానించింది. తాను టికెట్లు అమ్మేందుకు వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను ప్రైవేటు సంస్థల చేతిలో పెట్టే కీలక నిర్ణయం అయినందున... ఈ కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.ఐదు లక్షలు, అడ్వాన్స్ డిపాజిట్‌గా మరో రూ.5 లక్షలు, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాలనే నిబంధనలు విధించింది. దీంతో కేవలం 47 దరఖాస్తులు మాత్రమే అందగా.. వాటిని పరిశీలించి 21 సంస్థలను రైల్వేశాఖ ఎంపిక చేసింది. తాను ముందుగా నిబంధనల్లో పేర్కొన్న ఫీజులను చెల్లించాల్సిందిగా ఆయా సంస్థలకు లేఖలు రాసింది. అవి ఆ మొత్తాన్ని చెల్లించగానే టికె ట్లు విక్రయించే కేంద్రాలు ఏర్పాటవుతాయి. కంప్యూటర్ టెర్మినల్స్, టికెట్ ప్రింటర్లు, మోడెమ్స్లాంటి వాటిని రైల్వే సమకూర్చనుండగా, ఏజెన్సీలు డేటా కమ్యూనికేషన్ చానల్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులపై భారం ఇలా... మనం నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ కొంటే నిర్ధారిత టికెట్ రుసుము మినహా అదనంగా ఎలాంటి చార్జీలు ఉండవు. కానీ అదే టికెట్‌ను వైటీఎస్‌కే కౌంటర్లో కొంటే... ఒక్కో స్లీపర్ క్లాస్ టికెట్‌పై రూ.30, ఇతర ఉన్నత శ్రేణి తరగతులకు సంబంధించిన వాటిపై రూ.40 చొప్పున సర్వీస్ చార్జీ పడుతుంది. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలోని ప్రైవేటు ఈ-టికెట్ కౌంటర్లలో ఒక్కో టికెట్ పై రూ.15 నుంచి రూ.20 వరకు మాత్రమే చార్జ్ చేస్తున్నారు. వెరసి వైటీఎస్‌కే కౌంటర్లు ప్రయాణికులపై భారాన్ని మోపబోతున్నాయి. దీంతో ప్రయాణికుల స్పందన అంతంత మా త్రంగానే ఉంటుందని ఊహించిన సంస్థలు వాటిని పొందేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. -
కరెంటు తీగకాటేసింది
తెగిన విద్యుత్ తీగ నలుగురు కూలీల దుర్మరణం వారంతా వలస కూలీలు.. మధ్యప్రదేశ్ నుంచి పొట్ట కూటికోసం నగరానికి వచ్చారు. తల్లిదండ్రులను చూసేందుకు స్వగ్రామాలకు చేరుకోవాలని రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. కొద్దిసేపు ఆగితే రెలైక్కి సొంతూరికి వెళ్లిపోయేవారు. కానీ విధి వక్రించింది. కరెంటుతీగ యమపాశమై వారిని కాటేసింది. విధి ఆడిన సర్కస్‌లో వారు విగత జీవులయ్యారు. సోమవారం రాత్రి నాంపల్లిలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం కండువా జిల్లా మచోలి ప్రాంతానికి చెందిన కొందరు యువకులు నగరంలోని జెమినీ సర్కస్‌లో పని చేసేందుకు వచ్చారు. తల్లిదండ్రులను చూసేందుకు స్వగ్రామాలకు వెళ్లాలని సోమవారం సాయంత్రం నాంపల్లి రైల్వేస్టేషన్‌కు బయలుదేరేందుకు సికింద్రాబాద్‌లో 8ఎ నంబర్ బస్సు ఎక్కారు. హజ్ హౌస్ దగ్గర రాత్రి 7.10కి దిగారు. అక్కడి నుంచి నాంపల్లి స్టేషన్‌కు నడుచుకుంటు వెళ్తున్న సమయంలో నే ఒక్కసారిగా భారీ వర్షం, గాలులు వీచాయి. దీంతో అక్కడే ఉన్న బస్టాప్‌లోకి వీరు వెళ్లారు. ఇదే బస్టాప్‌లో ఏర్పాటైన హోటల్ నిర్వాహకులు తీసుకున్న అక్రమ విద్యుత్ వైరు ఒకటి ఊడి కింద పడింది. ఈ వైర్ బారికేడ్లపై పడింది. ఈ బారికేడ్లను పట్టుకుని ఉన్న యువకులు ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. ఆహాకారాలు మిన్నంటాయి. పక్కనే ఉన్న వందలామంది హజ్ యాత్రికులు పరుగుదీశారు. గాయపడ్డ వారిని సమీపంలోని మెడ్విన్, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రికి వెళ్లేలోపు రూపేంద్ర, రింకేష్, కౌసల్ మృతి చెందారు. ఉస్మానియాలో సుషీల్ కుమార్‌యాదవ్ మృతి చెందాడు. మణీష్, నగీన్ తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్నారు. డిప్యూటీ సీఎం సందర్శన... తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ మాజీద్ హుస్సేన్, ఎమ్మెల్యేలు పాషాఖాద్రి, జాఫర్‌మెరాజ్ హుస్సేన్, ఎమ్మెల్సీలు సలీం, షబ్బీర్‌అలీ, సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ, బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్, గ్రేటర్ టీడీపీ అధికార ప్రతినిధి ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్ మెడ్విన్ ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ ఈ సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. మృతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఎక్స్‌గ్రేషియా అందేలా చూస్తానన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి మృతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, శాసనసభ పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్, గ్రేటర్ టీడీపీ అధికార ప్రతినిధి ఎం.ఆనంద్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించడంతో పాటు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్‌శాఖ, జీహెచ్ఎంసీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. తప్పు మాది కాదు... తెలంగాణ రాష్ర్ట టీ ఎస్సీపీడీసీఎల్ సీఎండీ, మేనేజింగ్ డెరైక్టర్ రఘుమారెడ్డి, ఆపరేషన్ డెరైక్టర్ నాగేందర్, హైదరాబాద్ జిల్లా చీఫ్ జనరల్ మేనేజర్ సతీష్, ఎస్సీ కృష్ణయ్య, డీఈ మురళీకృష్ణ సంఘటన స్థలాన్ని సందర్శించారు. హజ్‌హౌస్ తోరణాలకు కట్టిన వైరు లోపలి నుంచి తెగి బస్టాప్పైన పడినందునే నలుగురు మృత్యువాత పడినట్టు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఎస్ఈ కృష్ణయ్య సాక్షితో మాట్లాడుతూ హజ్‌హౌస్ లోపల వైరు తెగి బస్టాప్పైన పడిందని, కాంట్రాక్టర్‌దే తప్పన్నారు.