తెనాలి రూరల్: విజయవాడ-గూడూరు, విజయవాడ విశాఖపట్నం మధ్య త్వరలో మూడో రైల్వే లైన్ ఏర్పాటు కానుందని విజయవాడ అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ కె.వేణుగోపాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి సర్వే, ఇతర పనులు పూర్తయ్యాయని చెప్పారు. తెనాలి రైల్వే స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ... రత్నాచల్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను తెనాలి వరకు పొడిగించే విషయమై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే నిర్ణయం వెలువడవచ్చన్నారు.
తెనాలి రైల్వే స్టేషన్‌లో లక్ష లీటర్ల కెపాసిటీ ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు, ప్లాట్‌ఫామ్‌లపై పూర్తి స్థాయి షెడ్డులను నిర్మించనున్నామని తెలియజేశారు. ప్రయాణికులు పట్టాలు దాటకుండా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట స్టేషన్ మేనేజర్ సీహెచ్ డేనియల్‌రాజు పలువురు ఇతర అధికారులు ఉన్నారు.
విజయవాడ-గూడూరు మధ్య త్వరలో మూడో లైన్
Published Sat, Jan 9 2016 7:04 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM
Advertisement