మోడల్ స్కూల్‌ను పరిశీలించిన డీఈవో
కారేపల్లి: ఖమ్మం జిల్లాలోని మోడల్ స్కూల్‌ను జిల్లా విద్యా శాఖాధికారి (డీఈవో) రాజేష్ బుధవారం సందర్శించారు. కారేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులతో డీఈవో మాట్లాడుతూ... టీచర్ల బోధనా విధానంపై ప్రశ్నలు అడిగారు. వసతిగృహాన్ని సందర్శించిన అనంతరం పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలోని పాఠశాలలకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని సిబ్బందికి డీఈవో సూచించారు.