హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులో చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనుల పురోగతిపై శనివారం రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుమారు రూ.1,355 కోట్ల వ్యయంతో 124 ఎకరాల విస్తీర్ణంలో 15,660 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఈ కాలనీ... దేశంలోనే అతిపెద్ద డబుల్ బెడ్‌రూం గృహల కాలనీగా చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు. దాదాపు మున్సిపాలిటీగా ఉన్న ఈ కాలనీలో అంతర్గత రహదారులు, వీధి దీపాలు, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, పార్కులు, ప్లేగ్రౌండ్‌లు, పోలీసు స్టేషన్, పెట్రోల్ బంక్, విద్య సంస్థలు, కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా మొట్టమొదటి హౌజింగ్ కాలనీగా గుర్తిపు పొందిందన్నారు. ఈ గృహాల్లో 9, 10 ,11 అంతస్తుల్లో 117 బ్లాకుల్లో అత్యంత ఆధునిక శీర్‌వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ ఫామ్ పద్దతిలో నిర్మాణం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment