సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర విద్యుత్ మంత్రి నత్తం విశ్వనాథన్ అనుచరుడు అన్బునాథన్ ఇంట్లో అధికారులు జరిపిన సోదాలో రూ. 5 కోట్లు పట్టుబడ్డాయి. అన్బునాథన్ ఇల్లు, గిడ్డంగిపై శుక్రవారం జరిపిని తనిఖీల్లో రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఒకేచోట ఇంత పెద్ద మొత్తం పట్టుబడడం ఇదే ప్రథమం.
కరూరు సమీపం అయ్యంపాళంలో ఉన్న గిడ్డంగిలో భారీ మొత్తంలో నగదు దాచి ఉంచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సమాచారం అందింది. కరూర్ జిల్లా ఎస్పీ, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు చేశారు. అన్బునాథన్ ఇంట్లో అర్ధరాత్రి వరకు ఈ తనిఖీలు చేపట్టగా రూ.5 కోట్లు పట్టుబడ్డాయి.
మంత్రి అనుచరుని ఇంట్లో 5 కోట్లు స్వాధీనం
Published Sun, Apr 24 2016 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM
Advertisement