Tamil Nadu Assembly polls
-
ఫేస్బుక్లో ఓటింగ్ వీడియో ఆప్‌లోడ్ చేయడంతో..
చెన్నై: తమిళనాడులోని గోబిచెట్టిపాళయంలో ఓటేయడాన్ని సెల్ఫోన్లో వీడియో తీసి ఓ యువకుడు ఫేస్బుక్లో పోస్టుచేశాడు. రాష్ట్రంలో మంగళవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్ బూత్‌లోకి సెల్ఫోన్లు తీసుకువెళ్లేందుకు ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. దీంతో పోలింగ్ బూత్ ముందు భద్రతా పనుల్లో ఉన్న పోలీసులు ఓటర్లతో సెల్ఫోన్లు తీసుకువెళ్లరాదంటూ హెచ్చరికలు చేశారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను లెక్కచేయకుండా గోబిచెట్టిపాళయంకు చెందిన ఓ యువకుడు సెల్‌ఫోన్‌తో వెళ్లి తాను ఓటేయడాన్ని వీడియో తీశాడు. అనంతరం తాను తీసిన వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. దీంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు -
ఓటు వేయని సూర్య
తమిళసినిమా: నూరు శాతం ఓట్లు నమోదు కావాలి.అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ ప్రచారం చేసిన నటుడు సూర్య తన ఓటును వృథా చేయడం విమర్శలకు దారి తీసింది. సోమవారం జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలహాసన్ విదేశాల్లో తన షూటింగ్‌ను కూడా రద్దు చేసుకుని ఓటు వేశారు.ఇక ఓటు వేస్తారో లేదో అని పరిశ్రమ వర్గాల్లో చర్చకు తావిచ్చిన నటుడు అజిత్ కూడా ఉదయాన్నే సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఎన్నికల అధికారులు నిర్వహించిన ఓటు యొక్క అవశ్యకతను వివరించే ప్రచార చిత్రాలలో నటించి అందురూ ఓటు వేయండి, నూరు శాతం పోలింగ్ నమోదు కావాలి అంటూ ప్రచారం చేసిన నటుడు సూర్య ఓటు వేయకుండా తన చిత్ర ప్రచారం కోసం అమెరికా వెళ్లడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.ఎన్నికల కమీషన్ ఓటర్ల పట్టికలో ఓటర్ల పేర్లను సరిగా నమోదు చేయడంలోనూ,ఓటర్ల ఫోటోలను సక్రమంగా పొందుపరచడంలోనూ దృష్టి సారించకుంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసి సినీ తారలతో ఓటింగ్‌పై అవగాహనా ప్రచార చిత్రాలను రూపొందించి టీవీ.చానళ్లలో ప్రచారం చేయడానికే అధిక ప్రాముఖ్యత నిచ్చారు.అలా ప్రచార చిత్రాలలో నటించిన నటుల్లో సూర్య ఒకరు. అలాంటి ఆయన తన ఓటు హక్కును ఉపయోగించుకోకుండా తన చిత్ర ప్రచారం కోసం అమెరికాలో కూర్చున్నారు.దీని గురించి ఆయన వివరణ రూపంలో ఒక ప్రకటన విడుదల చూస్తూ తాను ఓటింగ్ రోజుకు చెన్నైకి తిరి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అయినా అనివార్యకారణాల వల్ల చెన్నైకి చేరుకోలేక పోయాననీ,ఆన్లైన్ లాంటి ఇతర సోర్సెస్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ప్రయత్నం సఫలం కాలేదనీ పేర్కొన్నారు. తాను అందరికీ ఓటు వేయమని చెప్పి తాను ఓటు వేయనందుకు తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తనకు పార్టీల గురించి తెలియని ఒక నిరుపేద నటి డబ్బు కోసం డీఎంకే,అన్నాడీఎంకే పార్టీలకు సంబంధించిన ప్రచార చిత్రాలలో నటిస్తే విమర్శలు గుప్పించిన వారు ఒక ప్రముఖ నటుడు తన ఓటును దుర్వినియోగం చేయడంపై మాట్లాడరా అన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.ఇకపై ఎన్నికల కమీషన్ తారలతో అవగాహనా ప్రచార చిత్రాలు చేయడం మానుకోవాలనే గొంతు వినిపిస్తోంది. -
స్టార్స్ ఎట్రాక్షన్
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ రోజున తారలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్, లోకనాయకుడు కమలహాసన్ అందరి కన్నా ముందుగా ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. ఇక, ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు మంచి చేయాలన్న ఆకాంక్షను తారలు వ్యక్తం చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నటీ నటులు ఉదయాన్నే తమ తమ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బా రులు తీరారు. కొందరు అయితే, క్యూలో నిలబడి తామూ సాధారణ వ్యక్తులమే అని చాటుకున్నారు. మరి కొందరికి అభిమానుల తాకిడి పెరగడంతో నేరుగా పోలింగ్ బూతుల్లోకి దూ సుకెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజ నీ కాంత్ స్టెల్లా మేరిస్ కళాశాల పోలింగ్ కేంద్రానికి ఉదయం ఏడు గంటలకే వచ్చేశారు.ఆయన రాకతో అక్కడ హడావుడి, మీడియా హంగా మా బయలు దేరింది. ఏడు గంటల పది నిమిషాలకు తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన శర వేగంగా తన వాహనం ఎక్కేశారు. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక సంకేతాన్ని ఇచ్చే కథానాయకుడు ఈ సారి మీడియా గుచ్చి గుచ్చి ప్ర శ్నించినా తన దైన శైలిలో చిరునవ్వులు చింది స్తూ , చివరగా ఎవరు అధికారంలోకి వస్తారో తనకు తెలియదంటూ ముందుకు సాగారు. ఆళ్వార్ పేటలోని పోలింగ్ కేంద్రానికి ఏడున్నర గంటలకు నటి గౌతమి, తన కుమార్తె అక్షరతో కలిసి లోక నాయకుడు కమల హాసన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనం అనుకున్నది జరగవంటూ ఎవరు అధికారంలోకి వస్తా రో అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అంద రూ ఓటు హక్కును వినియోగించుకుంటే, ప్రజా స్వామ్యానికి ఆయుష్షు మరింతగా పెరిగి నట్టు అని, మంచి వాళ్లు అధికారంలోకి రావాలంటూ ముందుకు సాగారు. వేళచ్చేరిలోని పోలింగ్ కేంద్రంలో తన సతీమణి,నటి షాలినీ తో కలిసి నటుడు అజిత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే ఆయన క్యూలో నిలబడి మరి తానూ సామాన్యుడినే అని చాటుకున్నారు. నీలాంకరైలోని పోలింగ్ కేంద్రంలో ఇళయదళపతి విజయ్ రాగానే, అభిమానుల తాకిడి పెరిగింది. పోలీసు భద్రత నడుమ ఆయన లోనికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీ నగర్ హిందీ ప్రచారసభ ఆవరణలోని పోలింగ్ కేంద్రంలో నటుడు కార్తీ, ఆయన తండ్రి శివకుమార్ ఓటు వేశారు. శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎవరు అధికారంలో కి వచ్చినా సరే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలని విన్నవించారు. అన్నదాతల సంక్షేమార్థం చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా కార్తీ విన్నవించారు. వలసరవాక్కంలోని నటు డు శివ కార్తికేయన్, సైదాపేటలో నటి మీనా, అన్నానగర్‌లో నటుడు విశాల్, ఆర్య, టి నగర్లో నటుడు టి రాజేందర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వలసర వాక్కంలో నటి రంభ, దర్శకుడు హరి, ఆళ్వార్ పేటలోనటుడు సిద్ధార్థ్, నటి త్రిష, టీనగర్లో దర్శకులు భారతీ రాజా, శంకర్, ఇక, నటి రాధిక, కుటుంబ సమేతంగా నటుడు ప్రభు, స్నేహ, ప్రసన్న దంపతులు,హాస్యనటుడు వివేక్, రచయిత వైరముత్తు, నటుడు ఎస్వీ శేఖర్, లత రజనీ కాంత్, సౌందర్య రజనీ కాంత్, ఐశ్వర్య రాజేష్, లారెన్స్‌లతో పాటుగా చెన్నై నగరంలో ఉన్న నటీ నటులు , సహాయ నటులు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక, మదురైలో జోరు వాన కురుస్తున్నా గొడుగు చేత బట్టినటుడు శశికుమార్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాలిగ్రామంలో ఓటు వేసినానంతరం రంభ మీడియాతో మాట్లాడుతూ మంచి వాళ్లు అధికారంలోకి రావాలని, ప్రజలకు మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు. హాస్యనటుడు వడి వేలు మాట్లాడుతూ, మీడియా ప్రశ్నల న్నింటికీ దాట వేత ధోరణి అనుసరించారు. ఎవరు అధికారంలోకి వస్తారో అన్నది గందరగోళమేనని, ప్రజలకు మంచి చేసే వాళ్లెవరో ప్రజలకు తెలుసునని, అందరూ ఓటు వేద్దామని ముగించారు. -
మంత్రి అనుచరుని ఇంట్లో 5 కోట్లు స్వాధీనం
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర విద్యుత్ మంత్రి నత్తం విశ్వనాథన్ అనుచరుడు అన్బునాథన్ ఇంట్లో అధికారులు జరిపిన సోదాలో రూ. 5 కోట్లు పట్టుబడ్డాయి. అన్బునాథన్ ఇల్లు, గిడ్డంగిపై శుక్రవారం జరిపిని తనిఖీల్లో రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఒకేచోట ఇంత పెద్ద మొత్తం పట్టుబడడం ఇదే ప్రథమం. కరూరు సమీపం అయ్యంపాళంలో ఉన్న గిడ్డంగిలో భారీ మొత్తంలో నగదు దాచి ఉంచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సమాచారం అందింది. కరూర్ జిల్లా ఎస్పీ, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు చేశారు. అన్బునాథన్ ఇంట్లో అర్ధరాత్రి వరకు ఈ తనిఖీలు చేపట్టగా రూ.5 కోట్లు పట్టుబడ్డాయి. -
మాటల యుద్ధం
తమిళనాడు ఎన్నికలు మద్య నిషేధం చుట్టూ పరిభ్రమిస్తుండగా ప్రధాన ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధమే సాగుతోంది. ప్రచార వేదికలపై పరస్పర విమర్శలతో ప్రసంగాల పోరు సాగుతోంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్యం నిషేధం వాగ్దానాన్ని మెప్పించిన వారికే ప్రజలకు పట్టం కట్టనున్నారని ఈ రెండు పార్టీలూ విశ్వసిస్తున్న కారణంగా ప్రతి వేదికపైనా ప్రధాన అంశంగా మారింది. ఎన్నికల వాతావరణం ఆరంభానికి ముందే డీఎంకే అధినేత కరుణానిధి సంపూర్ణ మద్య నిషేధం వాగ్దానం చేసి ముందు వరుసలో నిలిచారు. ఎన్నికల ప్రచార తొలి సభలో అన్నాడీఎంకే అధినేత్రి సైతం అధికారంలోకి వస్తే దశలవారీ మద్య నిషేధం ఖాయమని వాగ్దానం చేశారు. అంతేగాక మద్యంపై నిషేధాన్ని ఎత్తివేసిన డీఎంకే నేడు మరలా నిషేధం మాట ఎత్తడం చోద్యమని సోమవారం రాత్రి కాంచీపురంలో నిర్వహించిన ఎన్నికల సభలో ఎద్దేవా చేశారు. కరుణానిధి వాగ్దానమే నిజమైతే మేనిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధం అనకుండా మద్య నిషేధం అని మాత్రమే అని ఎందుకు పేర్కొన్నారని జయ నిలదీశారు. సంపూర్ణ అనే పదాన్ని ఎందుకు చేర్చలేదు, అలాంటి పదం ఒకటి ఉందని కరుణానిధి మరిచిపోయారా అంటూ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం మద్య నిషేధం పైనే అని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసే ఉద్దేశమే ఆయనకు, ఆ పార్టీకి లేదని జయ వ్యాఖ్యానించారు. సంపూర్ణ మద్య నిషేధం కరుణానిధికి సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే దశలవారీ మద్య నిషేధం సాధించి చూపుతానని హామీ ఇచ్చారు. డీఎంకే కోశాధికారి స్టాలిన్ పెరంబలూరు జిల్లాలో మంగళవారం నిర్వహించిన ప్రచార సభల్లో జయలలిత వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు. కాంచీపురంలో జయలలిత చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగారు. నిషేధం అంటే సంపూర్ణ మద్య నిషేధం అంటే అన్న సంగతి జయలలితకు తెలియక పోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. మద్య నిషేధంపై చట్టాన్ని తీసుకువస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నాం, రాజాజీ ముఖ్యమంత్రిగా ఉండగా సైతం ‘తమిళనాడు మద్య నిషేధ చట్టం-1937’ అని తెచ్చారని గుర్తుచేశారు. తమిళనాడులో ప్రభుత్వం వస్తే ఒక్క బొట్టు మద్యం కూడా ఉండదని హామీ ఇచ్చారు. పీఎంకే ఎద్దేవా ప్రధాన ప్రత్యర్థుల పోరు ఇలా ఉండగా, మద్య నిషేధం తేవడంలో అన్నాడీఎంకే, డీఎంకే దొందూ దొందే అంటూ పీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ ఎద్దేవా చేస్తూ ప్రచారాలు సాగిస్తున్నారు. మద్య నిషేధంపై ఇప్పటికే ఐదుసార్లు వాగ్దానం చేసిన డీఎంకే ఆరోసారి సిద్ధమైందని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఇన్నాళ్లు మిన్నకుండి మరో ఐదేళ్లు అధికారాన్ని ఇస్తే మద్య నిషేధం తెస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. మద్య నిషేధం హామీలు ఇచ్చే ముందు తమ పార్టీల వారి లిక్కర్ ఫ్యాక్టరీలను ఎత్తివేయాలని హితవు పలికారు. పార్టీ నేతలతో మద్యం వ్యాపారం చేయిస్తూ నిషేధం మాటలు చెబితే ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్బుమణి పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం ప్రవాహంలా ఎన్నికల్లో పార్టీల మధ్య సాగుతున్న మాటల ప్రవాహం ప్రజలకు వినోదాన్ని కలిగిస్తోంది. -
అమ్మ దర్శనం దక్కేనా?
వాసన్‌కు మళ్లీ షాక్ రెండు రోజుల్లో నిర్ణయం మళ్లీ మారిన అన్నా డీఎంకే అభ్యర్థులు సాక్షి, చెన్నై : తమిళ మానిల కాం గ్రెస్ నేత జీకే వాసన్‌కు ఇక, అమ్మ దర్శనం దక్కేనా..? అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు గురువారం తామాకాలో చోటు చేసుకున్నాయి. రెండు రోజుల్లో కొత్త నిర్ణయాన్ని ప్రకటిం చేందుకు వాసన్ సిద్ధమవుతున్నారు. ఇక, అన్నాడీఎంకేలో మళ్లీ అభ్యర్థులు మా రారు. తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ నిర్ణయాలను నిర్భయంగా తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని పార్టీలు పొత్తు పదిలంతో సీట్ల పందేరాలు ముగించుకుని అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లో ఉన్నాయి. అయితే, వాసన్ ఇంత వరకు పొత్తు వ్యవహారాన్ని తేల్చలేదు. అన్నాడీఎంకేతో కలసి ఎన్నికల్ని ఎదుర్కోవాలన్న తపన వాసన్‌లో ఉండడం ఈ జాప్యానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే, అన్నాడీఎంకే ముందు ముప్పైకు పైగా సీట్లను ఉంచి వాసన్ చిక్కుల్లో పడ్డారు. అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఇచ్చే సీట్లతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఆ కూటమిలో ఉన్నది. అయితే, వాసన్ మెట్టు దిగకపోవడం, నాన్చుడు ధోరణి అనుసరించడంతో అమ్మ జయలలిత కన్నెర్ర చేశారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు. ఇది కాస్త వాసన్‌కు ముచ్చెమటలు పట్టించాయి. ఎట్టకేలకు వాసన్‌కు ఆహ్వానం రావడంతో అన్నాడీఎంకే సీట్ల పందేరం కమిటీతో బుధవారం కుస్తీలు పట్టారు. పది నుంచి పదిహేనులోపు సీట్లకు ఆ కమిటీ అంగీకరించిన సమాచారంతో తమిళ మానిల కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం తాండవం చేసింది. గురువారం పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కేందుకు వాసన్ సిద్ధం అయ్యారని వ్యాఖ్యలు గుప్పించారు. అయితే, ఆనందం ఆవిరి అయ్యాయని చెప్పవచ్చు. ఇందుకు తగ్గ పరిణామాలు తాజాగా చోటు చేసుకుని ఉన్నాయి. పోయెస్ గార్డెన్ నుంచి వచ్చిన ఎనిమిది సీట్లకు పరిమితం, రెండాకుల చిహ్నం మీదే పోటీ చేయాలన్న సూచనతో మళ్లీ వాసన్ ఢీలా పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఉదయాన్నే పోయెస్ గార్డెన్‌కు వాసన్ వెళ్లాల్సి ఉన్నా, అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో తదుపరి కార్యచరణ మీద పార్టీ వర్గాలతో కుస్తీలు పట్టే పనిలో పడ్డారు. అదే సమయంలో పొత్తు తేలుతుందన్న ఆశతో పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ వర్గాలు, మద్దతు దారులకు నిరాశే మిగిలినట్టు అయింది. అలాగే, వాసన్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలతో ఇక, తమకు అమ్మ దర్శనం కరువైనట్టే అన్నట్టుగా పరోక్ష సంకేతాలు ఇవ్వడం గమనార్హం. రెండుకాల చిహ్నం మీద బరిలోకి దిగే ప్రసక్తే లేదన్నట్టుగా పరోక్షంగా తన పార్టీ భవిష్యత్తు దృష్ట్యా, ఎవరికీ అనుకూలంగా నిర్ణయం ఉండదని, ఒకటి రెండు రోజుల్లో పొత్తుపై నిర్ణయాన్ని ప్రకటించేస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం. మళ్లీ మారిన అభ్యర్థులు : అన్నాడీఎంకేలో మళ్లీ అభ్యర్థులు మారారు. ఏ ముహూర్థాన అభ్యర్థుల జాబితాను జయలలిత ప్రకటించారో ఏమోగానీ, ఆయా నియోజక వర్గాల నుంచి వ్యతిరేకత పలువురు అభ్యర్థుల మీద బయలు దేరి ఉన్నాయి. ఆయా అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్నాయి. అలాగే, గురువారం కూడా పోయెస్ గార్డెన్లో ఈరోడ్ జిల్లా అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆత్మాహుతి యత్నాలకు పలువురు కార్యకర్తలు ఒడిగట్టారు. దీంతో అభ్యర్థుల మార్పు పర్వం మరింత వేగవంతం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే సమయంలో తాజాగా మరో ఇద్దరు అభ్యర్థులను మారుస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు పెన్నాగరం బరిలో ఉన్న వేలుమణిని తొలగించి కేపీ మునస్వామికి సీటు అప్పగించారు. అలాగే, వేపన్న హల్లి బరిలో ఉన్న కేపీ మునస్వామి పెన్నాగరంకు మారడంతో ఆ స్థానం బరిలో ఏవి మధు అలియాస్ హేమనాథన్ను అభ్యర్థిగా ప్రకటించారు. -
జయలలితపై హిజ్రా పోటీ
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జయలలితపై సామాజిక కార్యకర్త అయిన ఓ హిజ్రా పోటీకి సిద్ధమైంది. సినీ దర్శకుడు సీమన్‌కు చెందిన ‘నామ్ తమిళార్ కచ్చి(ఎన్టీకే)’ పార్టీ తరపున ఆర్కేనగర్లో తాను పోటీచేస్తున్నట్లు 33 ఏళ్ల జి.దేవి చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆర్కే నగర్ నియోజకవర్గం సమస్యల వలయంగా మారిందని దేవి ఆరోపించారు. ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గంలో ప్రజారోగ్యం, విద్యకు ప్రాధాన్యమిస్తానని చెప్పారు. సేలం జిల్లాలోని మగుదంచావడిలో పెరిగిన దేవి 12వ తరగతి వరకు చదువుకుంది. దేవి ప్రస్తుతం 200 మంది పేదవిద్యార్థుల చదువు కోసం తన వంతు సాయమందిస్తోంది. దాదాపు 60 మంది వృద్ధులు, అనాథల బాగోగులు తనే చూసుకుంటోంది. ‘ఎదురువారికి సాయం చేసేందుకు దేవుడు మనల్ని ఇలా ప్రత్యేకంగా సృష్టించాడు. నాకు పిల్లలు లేరు. అందుకే వీరందరికీ ఒక తల్లిగా బాధ్యత తీసుకున్నాను. జీవితాంతం సేవ చేస్తాను’ అని దేవి వ్యాఖ్యానించారు. -
డీఎంకే, కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పందం
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు కలసి బరిలోకి దిగనున్నాయి. సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఏఐసీసీ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం ఉదయం చెన్నైలో డీఎంకే చీఫ్ కరుణానిది నివాసానికి వెళ్లి సీట్ల పంపకాల విషయంపై చర్చించారు. సీట్ల విషయంలో కాంగ్రెస్ ఓ మెట్టు దిగగా, డీఎంకే బెట్టుసడలించింది. దీంతో కరుణతో ఆజాద్ చర్చలు ఫలించాయి. ఈ సమావేశంలో కరుణ కుమారుడు స్టాలిన్, తనయ కనిమొళి ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. తమిళనాడు ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే, డీఎంకే కూటమి, డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయ్‌కాంత్ సారథ్యంలోని పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ పోటీ చేస్తున్నాయి. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. -
65 సీట్లు ఇవ్వాల్సిందే!
సాక్షి, చెన్నై: డీఎంకేతో పొత్తు పదిలం కావడంతో సీట్ల పంపకానికి కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. అయితే, జీకే వాసన్ బయటకు వెళ్లడం, తమిళ మానిల కాంగ్రెస్‌ను పునరుద్ధరించడంతో కాంగ్రెస్ రాష్ట్రంలో బలహీనపడ్డ దృష్ట్యా, వారు కోరినన్ని సీట్లు ఇవ్వడానికి డీఎంకే సిద్ధంగా లేదన్న సంకేతాలు ఉన్నాయి. డీఎండీకే తమతో కలసివస్తే వారికి యాభై, కాంగ్రెస్‌కు ముప్పై వరకు ఇచ్చి, తాము 140 స్థానాల్లో పోటీచేసి, మిగిలిన చిన్న పార్టీలకు 14 సీట్లను సర్దుబాటు చేసే విధంగా తొలుత డీఎంకే వ్యూహ రచన చేసి ఉన్నట్టు సమాచారం. అయితే, డీఎండీకే కలసి రాని దృష్ట్యా, 190 స్థానాల్లో పోటీచేయడానికి తగ్గ వ్యూహ రచనలు, కసరత్తుల్ని డీఎంకే చేసి ఉన్నట్టు సమాచారాలు వెలువడుతున్నాయి. డీఎండీకే లేదు కాబట్టి తమకు సీట్ల సంఖ్య పెంచాలన్న నినాదాన్ని కాంగ్రెస్ తెర మీదకు తెచ్చింది. డీఎంకే మీద ఒత్తిడి తెచ్చి 65 సీట్లను రాబట్టుకునే వ్యూహంతో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తమ వ్యూహాలకు పదును పెట్టి , డిఎంకే మీద ఒత్తిడి తెచ్చి ఆ సీట్లను రాబట్టుకునేందుకు ఢిల్లీ నుంచి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రంగంలోకి దిగనున్నారు. శుక్రవారం ఉదయం ఆయన చైన్నైకు రానున్నారని, గోపాలపురంలో కరుణానిధిని కలిసే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్ర పార్టీ సూచనతో ఢిల్లీలో సిద్ధం చేసిన తమకు బలం ఉన్న స్థానాల చిట్టాను కరుణానిధికి అందించి, తదుపరి సీట్ల పంపకాన్ని సామరస్య పూర్వకంగా ముగించుకునే వ్యూహంతో ఆజాద్ ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నా యి. కాంగ్రెస్ ఒత్తిడికి డీఎంకే తగ్గేనా అన్నది వేచి చూడాల్సిందే. ఏళ్ల తరబడి డిఎంకే వెంటే ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ పదిహేను సీట్లు ఆశించగా, చివరకు ఐదుతో సర్దుకోవాల్సి వచ్చింది. ఇక, మనిదనేయమక్కల్ కట్చికి కేవలం మూడు సీట్లను రిజర్వు చేయడానికి కరుణానిధి నిర్ణయించినట్టు సమాచారాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు 65 ఇవ్వడం అనుమానమే. కాంగ్రెస్ పట్టుబట్టిన పక్షంలో గతంలో నిర్ణయించినట్టుగా ముప్పై సీట్లకు అదనంగా రెండు మూడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయే గానీ, తలకిందులుగా తపస్సు చేసినా కాంగ్రెస్ వ్యూహాలు కరుణ ముందు పనిచేయవంటూ డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక వేళ సీట్ల పందేరం వివాదంతో తమను కాంగ్రెస్ ఇరకాటంలో పెట్టే యత్నం చేస్తే, వారికి టాటా చెప్పి, పొత్తు వ్యవహారాల్లో తర్జన బర్జన పడుతున్న వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌ను ఆహ్వానించేందుకు సైతం వెనుకాడబోరని వ్యాఖ్యానిస్తుండడం ఆలోచించ దగ్గ విషయమే.