డీఎంకే, కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పందం | Congress to contest on 41 seats in Tamil Nadu Assembly polls | Sakshi
Sakshi News home page

డీఎంకే, కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పందం

Published Mon, Apr 4 2016 9:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

డీఎంకే, కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పందం - Sakshi

డీఎంకే, కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పందం

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు కలసి బరిలోకి దిగనున్నాయి. సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.

ఏఐసీసీ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం ఉదయం చెన్నైలో డీఎంకే చీఫ్‌ కరుణానిది నివాసానికి వెళ్లి సీట్ల పంపకాల విషయంపై చర్చించారు. సీట్ల విషయంలో కాంగ్రెస్ ఓ మెట్టు దిగగా, డీఎంకే బెట్టుసడలించింది. దీంతో కరుణతో ఆజాద్ చర్చలు ఫలించాయి. ఈ సమావేశంలో కరుణ కుమారుడు స్టాలిన్, తనయ కనిమొళి ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. తమిళనాడు ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే, డీఎంకే కూటమి, డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయ్కాంత్ సారథ్యంలోని పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ పోటీ చేస్తున్నాయి. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement