స్టార్స్ ఎట్రాక్షన్
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ రోజున తారలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్, లోకనాయకుడు కమలహాసన్ అందరి కన్నా ముందుగా ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. ఇక, ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు మంచి చేయాలన్న ఆకాంక్షను తారలు వ్యక్తం చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నటీ నటులు ఉదయాన్నే తమ తమ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బా రులు తీరారు.
కొందరు అయితే, క్యూలో నిలబడి తామూ సాధారణ వ్యక్తులమే అని చాటుకున్నారు. మరి కొందరికి అభిమానుల తాకిడి పెరగడంతో నేరుగా పోలింగ్ బూతుల్లోకి దూ సుకెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజ నీ కాంత్ స్టెల్లా మేరిస్ కళాశాల పోలింగ్ కేంద్రానికి ఉదయం ఏడు గంటలకే వచ్చేశారు.ఆయన రాకతో అక్కడ హడావుడి, మీడియా హంగా మా బయలు దేరింది.
ఏడు గంటల పది నిమిషాలకు తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన శర వేగంగా తన వాహనం ఎక్కేశారు. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక సంకేతాన్ని ఇచ్చే కథానాయకుడు ఈ సారి మీడియా గుచ్చి గుచ్చి ప్ర శ్నించినా తన దైన శైలిలో చిరునవ్వులు చింది స్తూ , చివరగా ఎవరు అధికారంలోకి వస్తారో తనకు తెలియదంటూ ముందుకు సాగారు. ఆళ్వార్ పేటలోని పోలింగ్ కేంద్రానికి ఏడున్నర గంటలకు నటి గౌతమి, తన కుమార్తె అక్షరతో కలిసి లోక నాయకుడు కమల హాసన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మనం అనుకున్నది జరగవంటూ ఎవరు అధికారంలోకి వస్తా రో అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అంద రూ ఓటు హక్కును వినియోగించుకుంటే, ప్రజా స్వామ్యానికి ఆయుష్షు మరింతగా పెరిగి నట్టు అని, మంచి వాళ్లు అధికారంలోకి రావాలంటూ ముందుకు సాగారు. వేళచ్చేరిలోని పోలింగ్ కేంద్రంలో తన సతీమణి,నటి షాలినీ తో కలిసి నటుడు అజిత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే ఆయన క్యూలో నిలబడి మరి తానూ సామాన్యుడినే అని చాటుకున్నారు. నీలాంకరైలోని పోలింగ్ కేంద్రంలో ఇళయదళపతి విజయ్ రాగానే, అభిమానుల తాకిడి పెరిగింది. పోలీసు భద్రత నడుమ ఆయన లోనికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీ నగర్ హిందీ ప్రచారసభ ఆవరణలోని పోలింగ్ కేంద్రంలో నటుడు కార్తీ, ఆయన తండ్రి శివకుమార్ ఓటు వేశారు.
శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎవరు అధికారంలో కి వచ్చినా సరే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలని విన్నవించారు. అన్నదాతల సంక్షేమార్థం చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా కార్తీ విన్నవించారు. వలసరవాక్కంలోని నటు డు శివ కార్తికేయన్, సైదాపేటలో నటి మీనా, అన్నానగర్‌లో నటుడు విశాల్, ఆర్య, టి నగర్‌లో నటుడు టి రాజేందర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వలసర వాక్కంలో నటి రంభ, దర్శకుడు హరి, ఆళ్వార్ పేటలోనటుడు సిద్ధార్థ్, నటి త్రిష, టీనగర్‌లో దర్శకులు భారతీ రాజా, శంకర్, ఇక, నటి రాధిక, కుటుంబ సమేతంగా నటుడు ప్రభు, స్నేహ, ప్రసన్న దంపతులు,హాస్యనటుడు వివేక్, రచయిత వైరముత్తు, నటుడు ఎస్వీ శేఖర్, లత రజనీ కాంత్, సౌందర్య రజనీ కాంత్, ఐశ్వర్య రాజేష్, లారెన్స్‌లతో పాటుగా చెన్నై నగరంలో ఉన్న నటీ నటులు , సహాయ నటులు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక, మదురైలో జోరు వాన కురుస్తున్నా గొడుగు చేత బట్టినటుడు శశికుమార్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాలిగ్రామంలో ఓటు వేసినానంతరం రంభ మీడియాతో మాట్లాడుతూ మంచి వాళ్లు అధికారంలోకి రావాలని, ప్రజలకు మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు. హాస్యనటుడు వడి వేలు మాట్లాడుతూ, మీడియా ప్రశ్నల న్నింటికీ దాట వేత ధోరణి అనుసరించారు. ఎవరు అధికారంలోకి వస్తారో అన్నది గందరగోళమేనని, ప్రజలకు మంచి చేసే వాళ్లెవరో ప్రజలకు తెలుసునని, అందరూ ఓటు వేద్దామని ముగించారు.