తండ్రి ఆశయాల కోసమే జగన్ పోరాటం
పెనుగంచిప్రోలు, న్యూస్‌లైన్ : దివంగత మహానేత వైఎస్సార్ ఆశయాల సాధన కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి కొనియాడారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం జగ్గయ్యపేట అసెంబ్లీ అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభానుతో కలిసి మండలంలోని శనగపాడు, వెంగనాయకునిపాలెం, వెంకటాపురం కె.పొన్నవరం, కొళ్లికూళ్ల, సుబ్బాయిగూడెం గ్రామాల్లో పర్యటించారు. వారికి ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు.
అడుగడుగునా పూలవర్షం కురిపించి, హారతులు పట్టారు. కాబోయే సీఎం జగన్‌కు జై అంటూ యువకులు నినాదాలుచేశారు. ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలోనే జరి గిందని, ఆల్ ఫ్రీ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని బాబు పూర్తిగా దిగజార్చాడని విమర్శించారు. వైఎస్ పుణ్యమా అని పులిచింతల ప్రాజెక్టు పూర్తయిందని, రాష్ట్రంలో 47 చిన్నతరహా పరిశ్రమలు పూర్తయి రైతులకు ఎంతో మేలు కలుగుతోందని వివరించారు. కరెంట్ కోసం ధర్నాలు చేస్తే రైతులను పోలీసులతో కాల్పించి చంపించిన ఘనత బాబుకే దక్కుతుందని ఎద్దేవాచేశారు.
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి సామానేని ఉదయభానును అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మండలంలో శనగపాడు నుంచి సుబ్బాయి గూడెం వరకు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఉదయభాను హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకాలతో రైతులకు పూర్తిగా సాగునీటి కష్టాలు తీరుస్తామని పేర్కొన్నారు.
ఎస్సార్ సీపీలో చేరిన ఏఎంసీ చైర్మన్
జగ్గయ్యపేట : స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్ కుందవరపు కొండయ్య, మండలంలోని అనుమంచిపల్లి సర్పంచి పాతకోటి రాధ ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. చిల్లకల్లు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, కేంద్రపాలక మండలి సభ్యురాలు నందమూరి లక్ష్మీపార్వతి సమక్షంలో కొండయ్య, రాధ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ కొద్దిరోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒంటెత్తు పోకడల వల్ల ఆ పార్టీ ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎదురుచూస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొద్దిరోజుల్లో వస్తుందన్నారు.
కొండయ్య ఆధ్వర్యంలో అనుమంచి పల్లి శివాలయం చైర్మన్ అమ్మిన శ్రీనివాసరావు, తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి దేవస్థాన పాలకవర్గ సభ్యుడు పానుగంటి మధు, సొసైటీ సభ్యుడు బాదే నాగేశ్వరరావు, చేపలచెర్వు (అనుమంచిపల్లి) చైర్మన్ కాకారపు వీరాస్వామి, వార్డు సభ్యులు ఆరికంటి తిరుపతి రావు, రహీమ్, తాళ్లూరి కరుణ, 200 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, నాయకులు ఇంటూరి రాజగోపాల్ (చిన్నా), పట్టణ పార్టీ కన్వీనర్ బెంబవరపు కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
గండ్రాయి నుంచి 45 కుటుంబాల చేరిక
మండలంలోని గండ్రాయి నాయకులు వైకుం ఠపు అమరబాబు, కేవీ ఆధ్వర్యంలో 45 కుటుం బాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉదయభాను సమక్షంలో ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ నాయకులు మాడుగుల వెంకటేశ్వరరావు, ముండ్లపాటి పవన్, పాల్వంచ రమేష్, పుల్లంశెట్టి వర, సన్నీ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపార్వతి, ఉదయభాను సమక్షంలో న్యాయవాది దాసరి బాపిరాజు, 13, 16వ వార్డులకు చెందిన టీడీపీ నాయకులు వడ్డేపల్లి బ్రహ్మం, కర్నాటి శ్రీనివాసరావు, నాగన్న వైఎస్సార్ సీపీలో చేరారు.