
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి ప్రజాతీర్పుకు వెళ్లాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ చంద్రబాబు పిలుపును కృష్ణా జిల్లా లో టీడీపీ నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఆయన 19 గ్రామాలకు నాయకుడిగా మారిపోయారు. కరోనా కష్ట కాలంలో ప్రజలకు అందుబాటులో లేకుండా, పక్కరాష్ట్రానికి పారిపోయి జూమ్‌లో మాత్రమే దర్శనమిస్తున్నారంటూ’’ ఆయన ఎద్దేవా చేశారు. (చదవండి: ‘వారంతా చంద్రబాబు బినామీలే’)
చంద్రబాబు ఎన్ని ఉద్యమాలు చేసిన ప్రజలు నుంచి స్పందన లేదన్నారు. ‘‘కేంద్రం కూడా రాజధాని విషయంలో స్పష్టమైన విధానం చెప్పింది. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశంపై రాష్ట్రానిదే తుది నిర్ణయం అని స్పష్టం చేసిందని’’ ఆయన పేర్కొన్నారు. 14 నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయం అని, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు ఆయన్ని గుర్తించడం లేదని సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు.(చదవండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై సోము సెటైర్లు)
Comments
Please login to add a commentAdd a comment