‘ఎన్ని కుట్రలు చేసినా న్యాయమే గెలిచింది’ | finally win justice for Jaggaiah pet municipal chairman elections | Sakshi
Sakshi News home page

‘ఎన్ని కుట్రలు చేసినా న్యాయమే గెలిచింది’

Published Sat, Oct 28 2017 1:49 PM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM

 finally win justice for Jaggaiah pet municipal chairman elections

సాక్షి, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని వైఎస్‌ఆర్‌ సీపీ నేత సామినేని ఉదయభాను అన్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌గా వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు ఇంటూరి రాజగోపాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికను వాయిదా వేసేందుకు టీడీపీ ఎన్నో కుట్రలు చేసిందని, ప్రలోభాలకు లొంగనివారికి, బెదిరింపులకు గురి చేసిందన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉందని, అయితే టీడీపీ సభ్యులను కిడ్నాప్‌ చేశారంటూ ఆ పార్టీ కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించినప్పటికీ... వైఎస్‌ఆర్‌ సీపీ సభ్యులు క్రమశిక్షణతో సహనంగా వ్యవహరించారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement