inturi Rajagopal
-
‘ఎన్ని కుట్రలు చేసినా న్యాయమే గెలిచింది’
సాక్షి, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని వైఎస్ఆర్ సీపీ నేత సామినేని ఉదయభాను అన్నారు. మున్సిపల్ ఛైర్మన్‌గా వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఇంటూరి రాజగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికను వాయిదా వేసేందుకు టీడీపీ ఎన్నో కుట్రలు చేసిందని, ప్రలోభాలకు లొంగనివారికి, బెదిరింపులకు గురి చేసిందన్నారు. వైఎస్ఆర్ సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉందని, అయితే టీడీపీ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ ఆ పార్టీ కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించినప్పటికీ... వైఎస్ఆర్ సీపీ సభ్యులు క్రమశిక్షణతో సహనంగా వ్యవహరించారన్నారు. -
జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ గా రాజగోపాల్
-
జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ గా రాజగోపాల్
సాక్షి, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్‌లో మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 27 మంది కౌన్సిలర్లలో వైఎస్ఆర్సీపీకి 16, టీడీపీకి 10, ఇతరులు ఒకటి ఉన్నారు. చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. అయితే ఎన్నిక వాయిదాకు ససేమిరా అనడంతో టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కోరం ఉండటంతో ఇంటూరి రాజగోపాల్ ప్రమాణం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో ఛైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడిన విషయం తెలిసిందే. ఓ వైపు ప్రలోభాలు, మరోవైపు బెదిరింపులకు టీడీపీ పాల్పడినా...వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. మున్సిపల్ ఛైర్మన్‌గా రాజగోపాల్ ప్రమాణ స్వీకారం -
అమెరికన్ పార్సిల్లో పిచ్చికాగితాలు !
ఐ-ఫోన్‌కు బదులు ఖాళీ పెట్టె జగ్గయ్యపేట : అమెరికా నుంచి వచ్చిన ఒక రిజిస్టర్ ఎయిర్ మెయిల్ పార్సిల్లో ఐ ఫోన్‌కు బదులు పిచ్చి కాగితాలు వచ్చిన సంఘటన పేట పట్టణంలో గురువారం రాత్రి చోటు చేసుకోవడంతో బాధితుడు ఆరో వార్డు కౌన్సిలర్ ఇంటూరి రాజగోపాల్ (చిన్నా) అవాక్కయ్యారు. వివరాలలోకి వెళితే చిన్నా బంధువు అమెరికాలో ఉంటున్నారు. గతనెల 23న బంధువు కట్టా శ్రీనివాసరావు రూ.60 వేలు విలువ కలిగిన ఐ ఫోన్ (ఎఫ్-5) ను అమెరికా నుంచి జగ్గయ్యపేటకు రిజిస్టర్ ఎయిర్‌మెయిల్ ద్వారా చిన్నాకు పంపారు. గురువారం రాత్రి జగ్గయ్యపేట పోస్టాఫీసు ద్వారా పార్సిల్ చిన్నా ఇంటికి వచ్చింది. దాన్ని తెరచి ఓపెన్ చేసి చూడగా అందులో ఫోన్‌కు బదులుగా పోన్బాక్సులో పిచ్చి కాగితాలు ఉండటంతో అవాక్కయ్యారు. వెంటనే బంధువుకు ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని పేట సబ్ పోస్టు మాస్టర్‌కు తెలియజేసి, పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా ఫోన్ మిస్సింగ్ పోస్టాఫీసులో జరిగిందా లేక కస్టమ్స్ అధికారుల వైఫల్యమా తేలాల్సి ఉంది.