స్టాలిన్‌తో కేసీఆర్‌ సమావేశం | telangana CM kcr met MK Statin | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌తో కేసీఆర్‌ సమావేశం

Published Mon, May 13 2019 4:48 PM | Last Updated on Mon, May 13 2019 6:21 PM

telangana CM kcr met MK Statin - Sakshi

సాక్షి, చెన్నై : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సోమవారం డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌తో భేటీ అయ్యారు. తమిళనాడు పర్యటనలో ఉన్న కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి వెళ్లారు. స్టాలిన్‌ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను సాదరంగా స్వాగతం పలికి లోపలకు తీసుకువెళ్లారు. ఈ సమావేశంలో  డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌బాలు, టీఆర్‌ఎస్‌ నేతలు సంతోష్‌, వినోద్‌ పాల్గొన్నారు. కాగా ఫెడరల్‌ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్‌ ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన స్టాలిన్‌తో సమావేశం అయ్యారు. గతంలోనూ కరుణానిధితో కేసీఆర్‌ భేటీ అయ్యారు కూడా. ఇప్పటికే కేరళ సీఎం విజయన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కూడా కేసీఆర్‌ చర్చలు జరిపారు.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement