
సాక్షి, హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ కావడం ప్రారంభం మాత్రమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్, కేటీఆర్‌లు ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చలు జరిపారన్నారు. త్వరలో కేసీఆరే స్వయంగా వైఎస్ జగన్‌తో చర్చలు జరుపుతారని తెలిపారు.
రాష్ట్రాల హక్కు కోసం కేంద్రంతో పోరాడాటానికి ఒక వేదికగా ఫెడరల్ ఫ్రంట్ నిలుస్తుందని, ఇది ఒక్క టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీది మాత్రమే కాదన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఇందులో భాగమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్ పోటీ చేయదని, అభ్యర్థులను నిలపదన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో ఏ ప్రాంతీయ పార్టీలైతే భాగమవుతాయో.. వారికి మద్దతుగా ఫెడరల్ ఫ్రంట్ ప్రచారం నిర్వహిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేవారికే వైస్సార్‌సీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment