తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో చెన్నైలో సోమవారం భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై గంటపాటు సమగ్రంగా చర్చించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి కలుద్దామని కోరారు. స్టాలిన్ తమ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించినట్టు టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు చెప్పారు. ఇక స్టాలిన్, కేసీఆర్ భేటీ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆందోళన చెందినట్టు తెలుస్తోంది.