
సాక్షి, హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్‌లో కలిసి వచ్చే విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డితో చర్చలు జరపాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలను కేసీఆర్ ఆదేశించారు. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించేందుకు వస్తామని వైఎస్ జగన్‌ను టీఆర్‌ఎస్ బృందం కోరింది. టీఆర్‌ఎస్ విజ్ఞప్తిపై స్పందించిన వైఎస్ జగన్ నేడు(బుధవారం) లంచ్‌కు రావాలని కేటీఆర్ బృందాన్ని ఆహ్వానించారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌తో కేటీఆర్ బృందం చర్చలు జరుపుతుంది.
కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఫ్రంట్ ఏర్పాటుపై ఇప్పటికే పశ్చిమ్‌బంగా సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్ చర్చలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment