సాక్షి, అమరావతి : జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్‌కు సంబంధించి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు మధ్య జరిగిన భేటీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంది మాగధులు, టీడీపీ మంత్రులు– ఆయన ప్రయోజనాల పరిరక్షణకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎల్లో మీడియా రెండు రోజులుగా గగ్గోలు పెడుతుండడం చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును, హరికృష్ణ శవం సాక్షిగా టీఆర్‌ఎస్‌తో పొత్తుకోసం ప్రయత్నించానని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అటు అసెంబ్లీలోనూ, ఇటు తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ప్రకటించినా ఏ మాత్రమూ తప్పు బట్టని ఎల్లో మీడియా నేడు రాద్ధాంతం చేస్తున్నది. కేవలం నాలుగు నెలల ముందు టీఆర్‌ఎస్‌తోనూ పొత్తుకు ప్రయత్నించి దానికి రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు అని సూత్రీకరించిన చంద్రబాబు... టీడీపీతో పొత్తుకు టీఆర్‌ఎస్ ససేమిరా అనడంతో ఇపుడు యూటర్న్ తీసుకుని టీఆర్‌ఎస్ నాయకులు భేటీ జరపడంపైనే బురదజల్లే కార్యక్రమం చేయడం విశేషం.
తనతోనూ, తన పార్టీతోనూ పొత్తుకు ఓకే అని ఉంటే టీఆర్‌ఎస్ మంచి పార్టీ. కలవక పోతే వాళ్లను వేరే వాళ్లకు ఆపాదించడం చంద్రబాబు అవకాశవాద రాజకీయానికి పరాకాష్ట. ఏ ఎండకా గొడుగు పడుతూ ... పచ్చి అవకాశవాదంతో ప్రజా ప్రయోజనాల కన్నా తన రాజకీయ ప్రయోజనాలే మిన్నగా రాజకీయాలు నడిపే చంద్రబాబుకు ఫెడరల్ ఫ్రంట్ ఇంతగా ఎందుకు వణుకు పుట్టిస్తున్నదనేది బోధపడటం లేదని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. విభజన తరువాత నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తమకూ ఆమోదయోగ్యమే కాక పూర్తి మద్దతు నిస్తామని చొరవతో టీఆర్‌ఎస్ ముందుకు వచ్చింది. మన రాష్ట్రంలోని 25 మంది ఎంపీలకు తోడుగా మరో 17 మంది ఎంపీలు హోదాకు మద్దతు నివ్వాలని ఇంత పారదర్శకంగా ఇరు వర్గాలూ ముందుకొచ్చినా ఏదో జరిగి పోయిందన్నట్లుగా టీడీపీ వర్గాలు, తందానా అన్నట్లుగా ఓ వర్గం (ఎల్లో) మీడియా రాష్ట్రానికి ద్రోహమే జరిగి పోయిందని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
అవకాశవాద రాజకీయం బాబు నైజం..
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి బలమూ లేదు. పొత్తుపెట్టుకుని పోరాడాలన్న ఆసక్తీ లేదు. అయినా కూడా ‘పొత్తు’ పొడిచిందని, ఏపీకి ద్రోహం జరిగిందని, ‘ముసుగులో గుద్దులాట’ అనే పతాక శీర్షికలతో ఎల్లో మీడియా విషం చిమ్మడం ఏ తరహా పత్రికా విలువలో అర్థం కావడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీతో ఆయన పొత్తుపెట్టుకుంటారు.. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టకుండా మోసం చేసినా ఆ పార్టీతో పొత్తుపెట్టుకుంటారు.. అసలు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. పొత్తు కుదుర్చుకుందామని కేటీఆర్ వద్ద చంద్రబాబు ప్రస్తావించారు. హరికృష్ణ మృతి చెందినపుడు ఆయన భౌతికకాయం సాక్షిగా ఆయన ఈ ప్రతిపాదన చేశారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టారు. ఇదే అంశాన్ని కేటీఆర్ కూడా ధృవీకరించారు. తాము నో అన్నామని ఆయన చెప్పారు... టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించానని, వారు కలిసి రాక పోవడంతో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నామని టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబే చెప్పారు. చంద్రబాబు తానే స్వయంగా ఒప్పుకున్న అంశం ఎంత మాత్రం ఎల్లో మీడియాకు తప్పుగా అనిపించలేదు. అలాగే ఏపీ ప్రజలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఈ మీడియా భావించ లేదు కూడా. ఒకవేళ ఆరోజు పొత్తుకు టీఆర్‌ఎస్ ఒప్పుకుని ఉంటే రాష్ట్రప్రయోజనాల కోసం ఈ పొత్తు పెట్టుకున్నానని చంద్రబాబు తన వందిమాగధులతో ప్రచారం చేయించేవారు. ఆయన కనుసన్నల్లోని ఎల్లో మీడియా ఆ విషయాన్ని బాకాలూది ప్రచారం చేసేది. చంద్రబాబు ఏం చేసినా మంచిదేనన్నట్లుగా ఈ ప్రచారం సాగుతోంది.
చంద్రబాబు మోసపూరిత వైఖరి, దిగజారుడు రాజకీయాల నైజం తెలిసే ఆనాడు కేసీఆర్ పొత్తుకు నో చెప్పారు. కేసీఆర్ నో చెప్పిన విషయాన్ని స్వయంగా మీడియా సమావేశంలోనూ, అసెంబ్లీలోనూ, తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగానూ చంద్రబాబు చెప్పుకున్నారు కూడా. పొత్తుపెట్టుకోవడానికి తాను ప్రయత్నించానని చంద్రబాబు చెప్పారు.. అదే విషయాన్ని కేటీఆర్ కూడా చెప్పారు. చంద్రబాబు ప్రయత్నించారని, తాము నో అన్నామని కేటీఆర్ చెప్పారు. మరి జగన్ విషయంలో జరిగిందేమిటి? జగన్ అపాయింట్‌మెంట్ కోరి.. జగన్ నివాసానికి వచ్చి ఆయనతో మాట్లాడడానికి టీఆర్‌ఎస్ నాయకులు ఉత్సాహం చూపించారు. అదీ ఆయన విశ్వసనీయత. చంద్రబాబు విశ్వసనీయత లేని వ్యక్తి. మోసం, అబద్దాలు ఆయన ట్రేడ్ మార్క్ కాబట్టే ఆయనతో పొత్తుకు నో చెప్పారు. జగన్ విశ్వసనీయత గలిగిన వ్యక్తి కాబట్టే ఆయనతో చర్చించడానికి వచ్చారు. మాట్లాడారు. అసలు టీఆర్‌ఎస్‌కు ఏపీలో ఏ మాత్రం బలం లేదు. ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తులుండవని జగన్‌మోహన్‌రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు కూడా.
స్వాగతించాల్సింది పోయి బురదజల్లుతారా..
ఫెడరల్ ఫ్రంట్ అనేది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై కలసికట్టుగా పోరాడాలనుకునే వివిధ ప్రాంతీయ పార్టీలన్నీ ఒక వేదికపైకి వచ్చే అవగాహనా కార్యక్రమం. రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తున్నపుడు దానిని అడ్డుకోవడమే ఆ అవగాహన. ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఈ పార్టీలు పోరాడతాయి. రేపు అందులోకి అఖిలేష్ రావచ్చు. మాయావతి రావచ్చు. స్టాలిన్ కూడా రావచ్చు. రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షించే వారెవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చు. అసలు ఇలాంటి అన్యాయాన్ని మనం స్వయంగా అనుభవించాం. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీకే దిక్కులేదు. మన రాష్ట్రానికి జరిగిన ఈ అన్యాయాన్ని మనం కళ్లారా చూశాం. అలాంటి నేపథ్యంలో కేంద్రం అన్యాయం చేసినపుడు రాష్ట్రాలు సమైక్యంగా పోరాడాలి అనే భావనకు ఏ పార్టీ అయినా మద్దతు తెలపవచ్చు.
మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని ఎవరైనా ముందుకొస్తే స్వాగతించడంలో తప్పేముంది? మన 25 మంది ఎంపీలకు తోడు మరో 17 మంది ఎంపీలను మద్దతుగా ఇస్తామంటే వద్దనాల్సిన పనేముంది? 42 మంది ఒకే వేదికపైకి వచ్చి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామంటే వద్దనాల్సిన అవసరమేముంది? అంటే అసలు మీకు ప్రత్యేక హోదా సాధించే ఉద్దేశం లేదా? ముందుండి పోరాడాల్సిన చంద్రబాబు ఐదేళ్లు మోసం చేశారు.. మన పోరాటానికి మద్దతిస్తామంటే దానిని కూడా స్వాగతించకపోవడం దుర్మార్గం కాదా? ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లుగా పోరాడుతున్నారు. ఆ సందర్భంగా హోదా ఎవరు ఇస్తే వారికే మా మద్దతు అని పలు సందర్భాలలో ప్రకటించడమే కాకుండా హోదా కోసం ఎవరితోనైనా కలవడానికి సిద్ధమని పలు సందర్భాలలో ప్రకటించారు కూడా. అందుకే హోదా విషయంలో కేసీఆర్ ప్రకటనను ఆయన స్వాగతించారు. వారు ఇచ్చే మద్దతుతో మరింత అదే హరికృష్ణ భౌతిక కాయం దగ్గర చంద్రబాబు ప్రతిపాదనకు టీఆర్‌ఎస్ ఒప్పుకుని ఉంటే ఆ పొత్తు చారిత్రాత్మకం అని ప్రచారం చేసేవారు. ఈ పొత్తు తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం అని ఎల్లోమీడియా ప్రచారం చేసేది. అది జరగకపోయేసరికి ఈ దిగజారుడు రాజకీయం చేస్తున్నారు.
అధికారం కోసం అన్ని అడ్డదారులా బాబూ..?
ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్నది జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే. ప్రత్యేక హోదాకు ఎవరు మద్దతిచ్చినా స్వాగతిస్తామని ఆయన ప్రకటించారు. ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే మద్దతిస్తామని కూడా జగన్ చెబుతున్నారు. తాము ప్రత్యేక హోదాకు మద్దతిస్తామని పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించేవారైతే దీనిని స్వాగతించాలి కదా? మరి అలా చేయకుండా ఎల్లో మీడియాలో ఈ దిక్కుమాలిన ప్రచారం ఏమిటి? ఇదే చంద్రబాబు నైజం. నాలుగునెలల క్రితం తెలంగాణ ఎన్నికల్లో లబ్ది కోసం తెలుగువారి ప్రయోజనాల పేరుతో టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించారు. అది జరగకపోయేసరికి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్న విషయాన్ని గాలికొదిలేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని మంటగలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పార్టీ కాంగ్రెస్ అని అంతకుముందు విమర్శించారు. సోనియాను ఇటలీ దయ్యం అని, కాంగ్రెస్‌కు పాతరేద్దాం అని తిట్టిపోశారు. రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తారని నిలదీశారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో అదే పార్టీతో పొత్తుపెట్టుకున్నారు.
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన నుంచి పార్టీని, ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కున్న చంద్రబాబు ఎన్నికల సమయంలో అదే ఎన్టీఆర్ ఫొటోకు దండలేస్తారు. ఆయన పేరుతో ఓట్లగుతారు. ప్రత్యేక హోదా విషయంలోనూ అంతే.. ఎన్నికలకు ముందు హోదా సంజీవని అని చంద్రబాబు అన్నారు. పదేళ్లు సరిపోదు.. పదిహేనేళ్లు ఇవ్వాలి అని అన్నారు. ఎన్నికలు ముగిశాక హోదా ఏమైనా సంజీవనా అని ఎద్దేవా చేశారు. హోదా అంటే జైలుకే అనడమే కాక పీడీ యాక్టుతోనూ బెదిరించారు. హోదా కన్నా ప్యాకేజీయే మేలని అన్నారు. అందరికన్నా మనమే ఎక్కువ సాధించాం అని ప్రకటించారు. ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుండడంతో మరలా ప్లేటు ఫిరాయించి ఎన్నికలకు ఆరునెలల ముందు ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగి కేంద్రంలో పదవులు అనుభవించిన చంద్రబాబు ఇపుడు కేంద్రానికి వ్యతిరేకంగా ధర్మపోరాటదీక్షలు చేస్తున్నారు. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడం చంద్రబాబు నైజం అని విమర్శకులంటున్నారు.
స్వాగతించాల్సింది పోయి బురదజల్లుతారా..
ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక అవగాహన మాత్రమే. రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తున్నపుడు దానిని అడ్డుకోవడమే ఆ అవగాహన. ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఈ పార్టీలు పోరాడతాయి. రేపు అందులోకి అఖిలేష్ రావచ్చు. మాయావతి రావచ్చు. స్టాలిన్ కూడా రావచ్చు. రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షించే వారెవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చు. అసలు ఇలాంటి అన్యాయాన్ని మనం స్వయంగా అనుభవించాం. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీకే దిక్కులేదు. మన రాష్ట్రానికి జరిగిన ఈ అన్యాయాన్ని మనం కళ్లారా చూశాం. అలాంటి నేపథ్యంలో కేంద్రం అన్యాయం చేసినపుడు రాష్ట్రాలు సమైక్యంగా పోరాడాలి అనే భావనకు ఏ పార్టీ అయినా మద్దతు తెలపవచ్చు.
మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని ముందుకొస్తే స్వాగతించడంలో తప్పేముంది? మన 25 మంది ఎంపీలకు తోడు మరో 17 మంది ఎంపీలను మద్దతుగా ఇస్తామంటే వద్దనాల్సిన పనేముంది? 42 మంది ఒకే వేదికపైకి వచ్చి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామంటే వద్దనాల్సిన అవసరమేముంది? అంటే అసలు మీకు ప్రత్యేక హోదా సాధించే ఉద్దేశం లేదా? ముందుండి పోరాడాల్సిన చంద్రబాబు ఐదేళ్లు మోసం చేశారు.. మన పోరాటానికి మద్దతిస్తామంటే దానిని కూడా స్వాగతించకపోవడం దుర్మార్గం కాదా? మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేస్తే స్వాగతించాల్సింది పోయి మీతో పొత్తుకు సై అనలేదు కాబట్టి బురదజల్లే కార్యక్రమం చేస్తారా? అదే హరికృష్ణ శవం దగ్గర చంద్రబాబు ప్రతిపాదనకు టీఆర్‌ఎస్ ఒప్పుకుని ఉంటే ఆ పొత్తు చారిత్రాత్మకం అని ప్రచారం చేసేవారు. ఈ పొత్తు తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం అని ఎల్లోమీడియా ప్రచారం చేసేది. అది జరగకపోయేసరికి ఈ దిగజారుడు రాజకీయం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment