
సాక్షి, కరీంనగర్ : దేశంలో ఏ సర్వే చూసినా కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం లేదని, ఎన్డీఏకు 150 నుంచి 160, కాంగ్రెస్‌కు 100-110 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించుకోవాలని, ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో నిర్ణయించేవాళ్లం కావాలన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కీలకం కానున్నదని తెలిపారు.
తెలంగాణలో 16 ఎంపీలను టీఆర్ఎస్ సాధిస్తే భావసారుప్యతగల పార్టీలతో మరో 70 నుంచి 100 ఎంపీల మద్దతు తమకు ఉంటుందని చెప్పారు. అప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా లభిస్తుందని, వేల కోట్ల నిధులు వస్తాయని పేర్కొన్నారు. అభ్యర్థులను కేసీఆర్ నిర్ణయిస్తారని, అభ్యర్థి ఎవరైనా టీఆర్ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment