సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఝలక్ తగిలింది. ఫెడరల్ కూటమి ప్రతిపాదన మద్ధతు విషయంలో అప్పుడే ఓ పార్టీ వెనక్కి తగ్గింది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయబోతున్నట్లు ప్రకటించారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ‘ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించాం. వచ్చే ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలో పోరాడేందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేశారు’ అని తెలిపారు.
కాగా, థర్డ్ ఫ్రంట్ విషయంలో కేసీఆర్‌తో తాను మాట్లాడానని.. రాష్ట్రాల్లో ఉన్న బలమైన నాయకులు కలిస్తే జాతీయ స్థాయిలోని పార్టీలను ఎదుర్కోవచ్చని హేమంత్ సోరెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్‌పై పొగడ్తలు గుప్పించిన సోరెన్.. 48 గంటలు గడవకముందే కూటమిపై వెనక్కి తగ్గటం విశేషం.
Rahul Gandhi has given us his word that the upcoming Lok Sabha & Vidhan Sabha elections will be fought under the leadership of Jharkhand Mukti Morcha (JMM): Hemant Soren, Former Jharkhand CM. pic.twitter.com/hClR9cVSgD
— ANI (@ANI) 6 March 2018
Comments
Please login to add a commentAdd a comment