సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి అంత్యక్రియలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మెరీనా బీచ్‌లో అన్నాదురై స్మారకం పక్కనే కరుణ అంత్యక్రియలు జరిపాలని డీఎంకే పట్టుపడుతుండా, మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు అనుమతివ్వబోమని పళవి ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసింది. దీనిపై డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అర్ధరాత్రి డీఎంకే పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి వివాదాన్ని ఏటూ తేల్చకుండా ఉదయం ఎనిమిది గంటలకు వాయిదా వేశారు. హైకోర్టు తీర్పుపై డీఎంకే శ్రేణులు, తమిళనాడు ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచుస్తున్నారు.
కరుణానిధి ప్రస్తుత సీఎం కానందునే అంత్యక్రియలకు నిరాకరిస్తున్నారని, ఆయన చేసిన సేవలను మర్చిపోయారా అని డీఎంకే మండిపడుతోంది. కరుణానిధి అంత్యక్రియలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రం ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment