
చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తన ముని మనవడిని ముద్దాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కరుణానిధి చిన్న కుమారుడు తమిళరసు. అతడి కుమారుడు అరుళ్‌నిధి కుమారుడైన మగిళన్‌కు కరుణానిధి ముద్దుపెడుతునట్లు ఈ వీడియోలో ఉంది. కాగా, కరుణానిధి ఆరోగ్యంలో పురోగతి కనిపిస్తోంది. ప్రత్యేక సహాయకురాలు నిత్య ఆయన బాగోగులు చూసుకుంటున్నారు. ఆయనకు ప్రస్తుతం ద్రవాహారాన్నే అందిస్తున్నారు. ఆయనను దయాళు అమ్మాల్, రాజాత్తి అమ్మాల్ రోజూ పరామర్శిస్తున్నారు. కుమార్తె సెల్వి దగ్గరుండి కరుణానిధిని చూసుకుంటున్నారు. కుమారులు స్టాలిన్, తమిళరసు, కుమార్తె కనిమొళి, సహాయకులు రోజూ కరుణను కలిసి మాట్లాడుతున్నారు. కాగా గత కొంతకాలంగా కరుణానిధి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment