కరుణానిధి (ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం నేడు దేశవ్యాప్తంగా సంతాపదినం ప్రకటించింది. కరుణానిధి మరణానికి సంతాప సూచికగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో బుధవారం జాతీయ జెండాను అవనతం చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు కరుణానిధికి నివాళిగా సంతాప దినాలను ప్రకటించాయి. కాగా నేడు తమిళనాడు రాష్ట్రా వ్యాప్తంగా న్యాయస్థానాలకు సెలవు ప్రకటించారు. ఆయన అంత్యక్రియల స్థల వివాదానికి సంబంధించిన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు నేడు విచారించనుంది. కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ జరపాలనే అంశంపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. మెరీనా బీచ్‌లో అన్నాదురై స్మారకం పక్కనే కరుణ అంత్యక్రియలు జరపాలని డీఎంకే పట్టుబడుతోంది.
మెరీనాలో అంత్యక్రియలకు అనుమతివ్వబోమని పళనిస్వామి ప్రభుత్వం స్పష్టం చేసిన చేసింది. దీంతో డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తాత్కాలిక న్యాయమూర్తి కులువాడి రమేష్ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ వివాదంపై విచారణ ప్రారంభించింది. అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగినా ఎటూ తేలలేదు. దీంతో విచారణ బుధవారం ఉదయం 8 గంటలకు వాయిదా పడింది. మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలు జరపాలంటూ సినీనటుడు రజనీకాంత్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు డిమాండ్ చేశారు. కాగా కరుణానిధి మృతికి సంతాపంగా తమిళనాడు ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment