
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థీవదేహానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. బుధవారం మధ్యాహ్నం చెన్నై చేరుకున్న రాహుల్.. రాజాజీ హాల్‌కు వెళ్లారు. ఆయన కుమారుడు స్టాలిన్‌ను పరామర్శించారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా కరుణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కేరళ సీఎం పినరాయి విజయన్, గవర్నర్ పి సదాశివం, కాంగ్రెస్ నాయకులు గులాంనబీ అజాద్, వీరప్ప మెయిలీ కూడా రాజాజీ హాల్‌కు చేరుకుని కరుణ పార్థీవదేహానికి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment