కరుణానిధి విగ్రహం ముందు వివాహం చేసుకుంటున్న చంద్రకాంత్, బిరిందియాదేవి
చెన్నై, సేలం: దివంగత ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి జయంతిని పురస్కరించుకుని ఆ పార్టీ నేత ఒకరు బుధవారం ఆయన విగ్రహం ముందు వివాహం చేసుకున్నారు. చెన్నై తర్వాత కరుణానిధి విగ్రహం ఈరోడ్‌లో సౌత్‌జోన్‌లోని మనల్‌మేడులో మాత్రమే ఉంది. కరుణానిధి 97వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఇక్కడ కరుణానిధి విగ్రహానికి ఈరోడ్ డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి ముత్తు స్వామి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సుబ్బలక్ష్మి, అందియూర్ సెల్వరాజ్ ఇద్దరు వచ్చి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. సేలం జిల్లా సంగగిరికి చెందిన రాఘరాయన్ కుట్టై ప్రాంతానికి చెందిన చంద్రకాంత్ (29), సంగగిరి సమీపంలో అత్తమ్మాపేటలో ఉంటున్న బిరిందియాదేవి (26) విగ్రహం ఎదుట పూలమాలలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలుచల్లి కలైంజర్ ఆశీస్సులు పొందారు.
చంద్రకాంత్ మాట్లాడుతూ.. తమ అభిమాననేత నేత కలైంజర్ సాక్షిగా ప్రేమించిన యువతిని కల్యాణం చేసుకోవడం గర్వంగా భావిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment