
సాక్షి, చెన్నై : దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కాంస్య విగ్రహాన్ని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆదివారంనాడు ఆవిష్కరించారు. అన్నా అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాయంలో జరిగిన కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రముఖ జాతీయ నాయకులు పాల్గొన్నారు. డీఎంకే అధ్యక్షుడు, కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, సీతారాం ఏచూరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైగోలతో పాటు తదితర జాతీయ, రాష్ట్ర నేతలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment