కరుణానిధికి నివాళి.. కేసీఆర్‌ పిడికిలి పైకెత్తి... | Telangana CM KCR Pays Tribute To Karunanidhi | Sakshi
Sakshi News home page

కరుణానిధికి నివాళులర్పించిన కేసీఆర్‌, కవిత

Published Wed, Aug 8 2018 3:53 PM | Last Updated on Wed, Aug 15 2018 9:14 PM

Telangana CM KCR Pays Tribute To Karunanidhi - Sakshi

కరుణానిధి పార్థీవదేహం వద్ద కేసీఆర్‌

సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థీవదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లిన కేసీఆర్‌ కరుణానిధి కుమారుడు స్టాలిన్‌, కూతురు కనిమొళితోపాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్‌తో పాటు ఆయన కూతురు, నిజామాబాద్‌ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కూడా ఉన్నారు. కరుణానిధికి నివాళులర్పించిన అనంతరం కేసీఆర్‌ పిడికిలి పైకెత్తి కరుణానిధి అమర్‌రహే అని నినదించారు.

కాగా సాయంత్రం 4 గంటలకు కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మరోవైపు కరుణానిధి అంత్యక్రియలు జరగనున్న మెరీనా బీచ్‌కు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. రాజాజీ హాల్‌లో జరిగిన తొక్కిసలాట అనంతరం మాట్లాడిన స్టాలిన్‌ కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement