డీఎంకే చీఫ్, తమిళ రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి(94) ఆరోగ్య పరిస్థితి ఆదివారం రాత్రి విషమంగా మారింది. పల్స్, బీపీ, శరీర ఉష్ణోగ్రత పడిపోవడంతో (ట్రాన్సియెంట్ సెట్‌బ్యాక్) వైద్యులు తక్షణమే చికిత్సనందించారు. కాసేపటికే మళ్లీ కరుణ మామూలు పరిస్థితికి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన పెరిగింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆళ్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రికి చేరుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం పళనిస్వామి, డీఎంకే సహా వివిధపార్టీల ముఖ్యనేతలు ఆసుపత్రి చేరుకుని కరుణ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆయన కోలుకుంటున్నారని.. అయితే నిరంతర వైద్య పర్యవేక్షణలోనే ఉన్నారని తెలిసింది.
నిలకడగానే కరుణానిధి ఆరోగ్యం
Published Mon, Jul 30 2018 6:54 AM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement