Karunanidhi health
-
తమిళనాడులో హైటెన్షన్
సాక్షి, చెన్నై: డీఎంకే చీఫ్, రాజకీయ కురువృద్ధుడు ఎం.కరుణానిధి (94) ఆరోగ్యం మరింత విషమించడంతో కావేరి ఆసుపత్రి వద్ద ఉద్విగ్న, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కావేరి ఆసుపత్రితో పాటు రాజారత్నం స్టేడియంలో పోలీసులను భారీగా మొహరించారు. ఆస్పత్రి పరిసరాలతో పాటు చెన్నైలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో డీఎంకే కార్యకర్తలు, అభిమానుల రోదనలు మిన్నంటాయి. వృద్ధాప్యం కారణంగా ఆయన శరీరంలోని అంతర్గత అవయవాలు చికిత్సకు స్పందించే స్థితిలో లేనట్లు సమాచారం. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ డీఎంకే నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. కరుణానిధి కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఈరోజు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి తన తండ్రి ఆరోగ్య వివరాలు వివరించారు. మరోవైపు తమిళనాడు డీజీపీ రాష్ట్రం అంతటా హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లాల్లో ఉన్న పోలీసు అధికారులు అంతా చెన్నైకి రావాలని, సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న తమ ఎంపీలు, నాయకులు చెన్నైకి రావాల్సిందిగా డీఎంకే పార్టీ కార్యాలయం ఆదేశించింది. తాజా హెల్త్ బులెటిన్ విడుదల కరుణానిధి ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటన్‌ను మంగళవారం సాయంత్రం కావేరి ఆసుపత్రి డాక్టర్లు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. కొన్ని గంటలుగా అవయవాలు చికిత్సకు సహకరించడంలేదని తెలిపారు. చికిత్స అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. -
కరుణానిధిని పరామర్శించిన వైసీపీ నాయకులు
సాక్షి, చెన్నై : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరామర్శించారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సీనియర్ నేత బొత్స సత్యనారయణ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలతో పాటు వైఎస్ అనిల్ రెడ్డి సోమవారం సాయంత్రం కరుణానిధిని ఆసుపత్రిలో కలిసారు. కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. కరుణానిధికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వయంగా హాజరు కాలేని పరిస్థితి ఉండటంతో పార్టీ సినీయర్ నాయకులతో ఆయన కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వృద్ధాప్య రుగ్మతలతో సతమతం అవుతున్న కరుణానిధి ఆరోగ్యం క్షీణించడంతో గతనెల 28న కావేరీ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. గొంతుకు అమర్చిన కృత్రిమశ్వాస గొట్టాన్ని మార్చిన కారణంగా ఆయన ఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఆనాటి నుంచి స్పృహలేని స్థితిలో ఉండిన కరుణానిధి క్రమేణా కోలుకున్నారు. అయితే సోమవారం పరిస్థితి విషమించినట్లు వయోభారం వల్ల కరుణానిధి చికిత్సకు స్పందించేందుకు సమయం పడుతోందని కావేరి ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. కీలక అవయవాలు చికిత్సకు తగినంతగా సహకరించడం లేదని, ప్రత్యేక వైద్య బృందం ఆయనకు వైద్యచికిత్స అందిస్తోందని, రాబోయే 24 గంటలు చాలా కీలకమని తెలిపారు. -
మరింత మెరుగ్గా కరుణానిధి ఆరోగ్యం
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతోంది. ఆయన వీల్‌చైర్‌లో కూర్చున్న సమాచారం డీఎంకే వర్గాల్లో మరింత ఆనందాన్ని రేకెత్తించింది. తమ అధినేత సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తమ ముందుకు వచ్చి తీరుతారని కరుణ సేనల్లో ధీమా నెలకొంది. ఇక, కేరళ సీఎం పినరాయ్ విజయన్ గురువారం కరుణను పరామర్శించేందుకు చెన్నైకు వచ్చారు. వయోభారం, అనారోగ్యం, ఇన్ఫెక్షన్ సమస్యతో కరుణానిధి ఆళ్వార్ పేటలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్యులు ఇచ్చిన చికిత్సలు ఫలితాన్ని ఇస్తున్నాయి. పరిస్థితి ఆందోళనకరం అన్న సమాచారంతో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొన్నా, తదుపరి వైద్య చికిత్సలతో కరుణానిధి క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం రోజురోజుకూ మెరుగు పడుతోంది. దీంతో డీఎంకే వర్గాలు ఆనందం వ్యక్తంచేస్తున్నాయి. గురువారం కరుణానిధిని వైద్యులు వీల్ చైర్లో కూర్చొబెట్టిన సమాచారం డీఎంకే వర్గాలకు మరో శుభవార్తగా మారింది. దీంతో తమ అధినేత సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మళ్లీ తమ ముందుకు వచ్చి తీరుతారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఆస్పత్రి వద్దకు ఏడోరోజు చేరుకున్న డీఎంకే వర్గాలు కరుణ వర్థిల్లాలన్న నినాదాల్ని హోరెత్తించారు. ఆస్పత్రి వద్ద పూజలు చేశారు. మైనారిటీ సోదరులు ప్రత్యేక పాత్యహా నిర్వహించారు. కరుణ ఆరోగ్యం వంతుడిగా అందరి ముందుకు రావాలని ప్రార్థించారు. లండన్ వైద్యుడి రాక కరుణానిధిని లండన్‌కు చెందిన ఇన్ఫెక్షన్, అంటువ్యాధుల నివారణ నిపుణులు ఒకరు పరిశీలించారు. డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి జగద్రక్షకన్ లండన్ వైద్యుడిని కావేరి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ కరుణానిధికి అందిస్తున్న వైద్య చికిత్సల్ని ఆయన పరిశీలించారు. వైద్యులతో మాట్లాడారు. ప్రస్తుతం కరుణానిధికి అందిస్తున్న వైద్య చికిత్సలు సంతృప్తికరంగా ఉన్నట్టు ఆ వైద్యుడు పేర్కొన్నారు. వయోభారం, ఆరోగ్య సమస్యలకు తగ్గట్టుగానే చికిత్సలు ఉన్నాయని, దీనిని కొనసాగించడం ద్వారా ఆరోగ్యం మరింత మెరుగు పడుతుందని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ దృష్టికి ఆ వైద్యుడు తీసుకొచ్చారు. ఈ పోరాటంలోనూ గెలుపు తథ్యం కరుణానిధిని పరామర్శించేందుకు కేరళ సీఎం పినరాయ్ విజయన్, సీపీఎం నేత జి.రామకృష్ణన్ ఆస్పత్రి వద్దకు ఉదయం వచ్చారు. స్టాలిన్, కనిమొళిలతో విజయన్ భేటీ అయ్యారు. కరుణ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పినరాయ్ విజయన్ మీడియాతో మాట్లాడారు. కరుణానిధి తన జీవితకాలంలో ఎన్నో పోరాటాల్ని ఎదుర్కొన్నారని, వాటన్నింటిలో విజయకేతనం ఎగురవేశారన్నారు. ప్రస్తుతం ఈ పోరాటంలోనూ ఆయన తప్పకుండా గెలిచి తీరుతారని, ప్రజల ముందుకు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా వచ్చి తీరుతారని ధీమా వ్యక్తంచేశారు. ఇక, కరుణానిధిని పరామర్శించేందుకు మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణన్ గాంధి, సినీ నటుడు శివకార్తికేయన్, ముత్తు కాలై, కింగ్ కాంగ్, బొండ వాసు తదితరులు ఆస్పత్రి వచ్చారు. -
కరుణకు హీరో విజయ్ పరామర్శ
చెన్నై: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని తమిళ స్టార్హీరో విజయ్ బుధవారం పరామర్శించారు. కావేరీ ఆస్పత్రికి వెళ్లిన విజయ్.. కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆరా తీశారు. కరుణానిధికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సూపర్ స్టార్ రజనీకాంత్‌లు కరుణానిధిని పరామర్శించిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి కొద్దిరోజులుగా కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు బులెటిన్ విడుదల చేయడంతో నాలుగు రోజులుగా దేశవాప్తంగా ఉత్కంఠ రేగింది. వృద్ధాప్య రుగ్మతలతో సతమతం అవుతున్న కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించడంతో గతనెల 28న ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. గొంతుకు అమర్చిన కృత్రిమశ్వాస గొట్టాన్ని మార్చిన కారణంగా ఆయన ఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఆనాటి నుంచి స్పృహలేని స్థితిలో ఉండిన కరుణానిధి క్రమేణా కోలుకుంటున్నారు. కరుణ ఆరోగ్యం మెరుగుపడినా మరికొంతకాలం ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని కావేరి ఆస్పత్రి బులెటిన్‌లో పేర్కొంది. చదవండి: కరుణకు రాహుల్, రజనీ పరామర్శ -
కరుణానిధిని పరామర్శించిన రాహుల్, రజనీ
-
కరుణకు రాహుల్, రజనీ పరామర్శ
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్యం మంగళవారం మరింత మెరుగుపడింది. నాలుగు రోజులుగా దేశవాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన కరుణ కాసేపు కళ్లు తెరిచారు. కుమారుడు స్టాలిన్ పలకరింపునకు స్పందించారు. వృద్ధాప్య రుగ్మతలతో సతమతం అవుతున్న కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించడంతో గతనెల 28న ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. గొంతుకు అమర్చిన కృత్రిమశ్వాస గొట్టాన్ని మార్చిన కారణంగా ఆయన ఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఆనాటి నుంచి స్పృహలేని స్థితిలో ఉండిన కరుణానిధి క్రమేణా కోలుకుంటున్నారు. ఇదిలాఉండగా, కరుణను పరామర్శించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం కావేరీ ఆస్పత్రికి వచ్చారు. కరుణ కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి రాహుల్‌ను కరుణ వద్దకు తీసుకెళ్లారు. ఈ సమయంలో స్టాలిన్.. కరుణ చెవివద్ద ‘రాహుల్ వచ్చారు’ అని చెప్పగా కళ్లు తెరిచి తలతిప్పి చూశారు. అలాగే, నటుడు రజనీకాంత్‌తోపా టు పలువురు తమిళ చిత్రరంగ ప్రముఖులు కావేరి ఆస్పత్రి వచ్చి కరుణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరుణ ఆరోగ్యం మరింత మెరుగుపడినా మరికొంతకాలం ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని కావేరి ఆస్పత్రి బులెటిన్‌లో పేర్కొంది. -
నిలకడగానే కరుణానిధి ఆరోగ్యం
-
కరుణానిధి పరిస్థితి విషమం!
సాక్షి, చెన్నై: డీఎంకే చీఫ్, తమిళ రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి(94) ఆరోగ్య పరిస్థితి ఆదివారం రాత్రి విషమంగా మారింది. పల్స్, బీపీ, శరీర ఉష్ణోగ్రత పడిపోవడంతో (ట్రాన్సియెంట్ సెట్‌బ్యాక్) వైద్యులు తక్షణమే చికిత్సనందించారు. కాసేపటికే మళ్లీ కరుణ మామూలు పరిస్థితికి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన పెరిగింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆళ్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రికి చేరుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం పళనిస్వామి, డీఎంకే సహా వివిధపార్టీల ముఖ్యనేతలు ఆసుపత్రి చేరుకుని కరుణ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆయన కోలుకుంటున్నారని.. అయితే నిరంతర వైద్య పర్యవేక్షణలోనే ఉన్నారని తెలిసింది. ఆసుపత్రి వద్ద హైడ్రామా.. ఆదివారం మధ్యాహ్నం కరుణ ఆసుపత్రిలో ఉన్న ఫొటో విడుదలతో ఆయన బాగానే ఉన్నారని కార్యకర్తలు భావించారు. అయితే ఉన్నట్లుండి రాత్రి 9 గంటల సమయంలో ఆరోగ్యం విషమించినట్లు వార్తలు రావడంతో కలకలం రేగింది. చెన్నై ఆళ్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రికి వీవీఐపీల తాకిడి పెరగడంతో అభిమానుల్లో కలవరం మొదలై భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. కరుణ ఆరోగ్యం బాగానే ఉందని.. కార్యకర్తలంతా ఇళ్లకు వెళ్లాలని డీఎంకే నేత రాజా కోరారు. వీరిని బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కార్యకర్తలు నిరాకరించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వచ్చి సమాచారం ఇస్తేనే నమ్ముతామని డిమాండ్ చేస్తూ మొండికేసి కూర్చున్నారు. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. దీంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఇది స్వల్ప లాఠీచార్జ్‌కు దారితీసింది. చివరకు రాత్రి 11 గంటల సమయంలో స్టాలిన్, అళగిరితో పాటు ఇతర కుటుంబ సభ్యులు, డీఎంకే ముఖ్య నాయకులు ఇళ్లకు వెళ్లడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత సద్దుమణిగింది. పార్టీ శ్రేణులు అక్కడి నుంచి కదిలాయి. కాగా, తాజా పరిస్థితులతో చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అటు, డీఎంకే కార్యాలయం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పరామర్శించిన వెంకయ్య తదితరులు ఆదివారం సాయంత్రం చెన్నై చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్.. ఆసుపత్రిలో వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కరుణానిధి కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ వార్తలతో చెన్నై సహా తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. భారీ సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు కావేరీ ఆసుపత్రి వద్దకు చేరుకుని కరుణానిధి ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. డీఎంకే ముఖ్యనేతలంతా అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు, సేలం పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం ఈ పళనిస్వామి.. తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని చెన్నై పయనమయ్యారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆయన ఆసుపత్రిలో కరుణ కుటుంబసభ్యులను పరామర్శించారు. అటు, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ముఖ్యనేత పి. చిదంబరం కూడా హుటాహుటిన కావేరీ ఆసుపత్రికి చేరుకున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, తృణమూల్ నేత డెరిక్ ఓబ్రెయిన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర రాజన్, ఎండీఎంకే నేత వైగో తదితరులు కరుణ కుటుంబసభ్యులను పరామర్శించారు. ‘ఆసుపత్రిలో మాజీ తమిళనాడు సీఎం కరుణానిధిని కలిశాను. ఆయన కుటుంబసభ్యులను, డాక్టర్లను అడిగి కరుణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నారని వైద్యులు చెప్పారు. ఆయ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని వెంకయ్య ట్వీట్ చేశారు. హెల్త్ బులెటిన్‌లో ఓకే! కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొన్న పరిస్థితిలో ఆదివారం సాయంత్రం ఆయన ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఓ చిత్రాన్ని విడుదల చేశారు. ఇందులో కరుణ వెంటిలేటర్‌పై లేకపోవడం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారనే సంకేతాలివ్వడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సాయంత్రం నుంచి ఆసుపత్రికి వీఐపీల తాకిడి పెరగడంతో మళ్లీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దీంతో వీరంతా భారీ సంఖ్యలో ఆసుపత్రికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో కావేరీ ఆసుపత్రి వైద్యులు హెల్త్‌బులెటిన్ విడుదల చేశారు. కరుణను వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని.. పల్స్, బీపీ, టెంపరేచర్ వంటివి కొద్దిసేపు తగ్గినట్లు అనిపించినా.. వెంటనే సాధారణ స్థితికి వచ్చాయని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కరుణానిధి ఆస్పత్రిలో ఉన్న సమాచారం తట్టుకోలేక మరో ఇద్దరు డీఎంకే కార్యకర్తల గుండెలు ఆగాయి. చెన్నై ఎన్నూర్ అన్నై శివగామినగర్‌కు చెందిన డీఎంకే కార్యకర్త రాజు(60) మనో వేదనతో ఇంట్లో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
నాన్న బాగానే ఉన్నారు: కనిమొళి
సాక్షి, చెన్నై: నగరంలోని కావేరీ ఆస్పత్రి వద్ద మీడియా ప్రతినిధులు, డీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. డీఎంకే అధినేత ఎంకే కరుణానిధి తీవ్ర అస్వస్థతతో ఇదే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత రాత్రి పరిస్థితి విషమించటంతో 94 ఏళ్ల కరుణానిధిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఉదయం ఆయన కుమార్తె కనిమొళి ఆస్పత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం నాన్న ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. బీపీ కంట్రోల్లోకి వచ్చింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతంగా తిరిగొస్తారు. మరికాసేపట్లో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని చెప్పారు’ అని కనిమొళి అన్నారు. ‘కరుణానిధి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నాం. వైద్యులతో చర్చించి మెరుగైన చికిత్సలు అందిచాలని కోరాం. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు’ అని తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్ తెలిపారు. పరామర్శల వెల్లువ... కాగా, కావేరి ఆస్పత్రికి వెళ్లిన తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్.. మాజీ సీఎం కరుణానిధిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, తనయుడు స్టాలిన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆర్కే నగర్ ఎమ్మెల్యే దినకరన్, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, సీనియర్ నటుడు ప్రభు, పాండిచ్చేరి మాజీ సీఎం రంగస్వామి తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. మరోవైపు సీఎం పళనిస్వామి కూడా వైద్యులను ఫోన్ చేసి పరిస్థితి ఆరా తీశారు. అసరమైతే ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన కోరారు. గుండెపోటుతో... కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు ధైర్యం చెబుతున్నప్పటికీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం ఇంకా ఆందోళన చెందుతూనే ఉన్నారు. కరుణానిధి అస్వస్థత వార్త తట్టుకోలేక డీఎంకే కార్యకర్త ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. మృతుడిని తిరువారూర్ ముత్తుపేటకు చెందిన తమీమ్‌గా గుర్తించారు. -
కరుణానిధి ఆరోగ్యం వరింత విషమం