స్టాలిన్‌తో విజయ్
చెన్నై: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని తమిళ స్టార్‌హీరో విజయ్ బుధవారం పరామర్శించారు. కావేరీ ఆస్పత్రికి వెళ్లిన విజయ్.. కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆరా తీశారు. కరుణానిధికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సూపర్ స్టార్ రజనీకాంత్‌లు కరుణానిధిని పరామర్శించిన విషయం తెలిసిందే.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి కొద్దిరోజులుగా కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు బులెటిన్ విడుదల చేయడంతో నాలుగు రోజులుగా దేశవాప్తంగా ఉత్కంఠ రేగింది. వృద్ధాప్య రుగ్మతలతో సతమతం అవుతున్న కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించడంతో గతనెల 28న ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. గొంతుకు అమర్చిన కృత్రిమశ్వాస గొట్టాన్ని మార్చిన కారణంగా ఆయన ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఆనాటి నుంచి స్పృహలేని స్థితిలో ఉండిన కరుణానిధి క్రమేణా కోలుకుంటున్నారు. కరుణ ఆరోగ్యం మెరుగుపడినా మరికొంతకాలం ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని కావేరి ఆస్పత్రి బులెటిన్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment