Karunanidhi Health Latest News | Karunanidhi Health Bulletin Today Evening - Sakshi
Sakshi News home page

Aug 7 2018 5:07 PM | Updated on Aug 7 2018 6:41 PM

karunanidhi Health Buliten - Sakshi

కావేరి ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం

కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో తమిళనాడు అంతటా హైఅలర్ట్‌ ప్రకటించారు.

సాక్షి, చెన్నై: డీఎంకే చీఫ్, రాజకీయ కురువృద్ధుడు ఎం.కరుణానిధి (94) ఆరోగ్యం మరింత విషమించడంతో కావేరి ఆసుపత్రి వద్ద ఉద్విగ్న, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కావేరి ఆసుపత్రితో పాటు రాజారత్నం స్టేడియంలో పోలీసులను భారీగా మొహరించారు. ఆస్పత్రి పరిసరాలతో పాటు చెన్నైలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో డీఎంకే కార్యకర్తలు, అభిమానుల రోదనలు మిన్నంటాయి.

వృద్ధాప్యం కారణంగా ఆయన శరీరంలోని అంతర్గత అవయవాలు చికిత్సకు స్పందించే స్థితిలో లేనట్లు సమాచారం. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ డీఎంకే నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. కరుణానిధి కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఈరోజు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి తన తండ్రి ఆరోగ్య వివరాలు వివరించారు. మరోవైపు తమిళనాడు డీజీపీ రాష్ట్రం అంతటా హైఅలర్ట్‌ ప్రకటించారు. జిల్లాల్లో ఉన్న పోలీసు అధికారులు అంతా చెన్నైకి రావాలని, సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న తమ ఎంపీలు, నాయకులు చెన్నైకి రావాల్సిందిగా డీఎంకే పార్టీ కార్యాలయం ఆదేశించింది.

తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల
కరుణానిధి ఆరోగ్యంపై తాజా హెల్త్‌ బులిటన్‌ను మంగళవారం సాయంత్రం కావేరి ఆసుపత్రి డాక్టర్లు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. కొన్ని గంటలుగా అవయవాలు చికిత్సకు సహకరించడంలేదని తెలిపారు. చికిత్స అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement