కరుణానిధికి మరోసారి అస్వస్థత
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబసభ్యులు కావేరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆస్పత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. గత 15 రోజుల్లో కరుణానిధి రెండవ సారి అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 1వ తేదీన డీహైడ్రేషన్, అలర్జీ సంబంధిత అనారోగ్య కారణాలతో కరుణానిధి కావేరి ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే.