
సాక్షి, చెన్నై: డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని ప్రముఖ నటుడు మోహన్‌బాబు ట్వీట్ చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంస్మరణ సభ ఆదివారం కోయంబత్తూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన విషయాన్ని మోహన్‌బాబు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
కరుణానిధి తనయుడు స్టాలిన్ ఆహ్వానం మేరకు తాను ఈ సంస్మరణ సభలో పాల్గొన్నానని, ఈ సభకు తనను ఆహ్వానించినందుకు సోదరుడు స్టాలిన్‌కు ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తూ.. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. స్టాలిన్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment