
కె.చంద్రశేఖర్‌రావు, కరుణానిధి
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం చెన్నై వెళ్లనున్నారు. ఉదయం 11.15కు ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45కు హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. 1.30 సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. 2 గంటలకు తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్‌తో భేటీ కానున్నారు. అనంతరం హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. తర్వాత షెడ్యూల్ ప్రకారం పలు సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రికి చెన్నైలోనే బస చేస్తారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.30కు ప్రగతి భవన్ చేరుకుంటారు.