సాక్షి, చెన్నై : హై ఫ్రోఫైల్ స్కాంగా అభివర్ణింపబడ్డ 2జీ స్పెక్ట్రమ్ కేసులో రాజా, కనిమొళిని నిర్దోషులుగా తేల్చాక డీఎంకేలో నెలకొన్ని సంబరం అంతా ఇంతా కాదు. పార్టీ కార్యకర్తల కోలాహలంతో తమిళనాడులో నిన్న అంతా పండగ వాతావరణం కనిపించింది. ఈ ఏడేళ్లు తాము ఎంతో నరకం అనుభవించామని తీర్పు అనంతం ఆ ఇద్దరూ చెప్పటం చూశాం. ఇక రాజా అయితే తన భావోద్వేగాలను ఓ లేఖ రూపంలో డీఎంకే వ్యవస్థాపకుడు అయిన కరుణానిధికి తెలియజేశాడు.
‘‘విధేయతతో చరిత్రాత్మక తీర్పును మీ పాదాల వద్ద ఉంచుతున్నా.. మీరే నా సంరక్షకుడు’’ అని కరుణను ఉద్దేశించి రాజా అందులో పేర్కొన్నాడు. ‘‘ఆరోపణలు ఎదుర్కున్న సమయంలో మీరు నాకు ఇచ్చిన మనోధైర్యం అంతా ఇంతా కాదు. ఇంతకాలం అదే నన్ను కవచంలా రక్షిస్తూ వస్తోంది. మీ బదులు కోసం ఎదురు చూస్తున్నా’’ అంటూ లేఖలో తెలియజేశాడు. ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను డీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిందని.. కానీ, దానికి కొందరు అవినీతి మరకలను అంటించేశారని.. ఈ కుట్రలో కొందరు డీఎంకే నేతలు కూడా భాగస్వాములు అయ్యాయరని ఆయన లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం.
కాగా, సరైన సాక్ష్యాలు సీబీఐ సమర్పించకపోవటంతోనే తాము నిందితులను నిర్దోషులుగా విడిచిపెడుతున్నట్లు పటియాలా హౌజ్ కోర్టు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాల్ చేసేందుకు సీబీఐ సిద్ధమైపోయింది.
Comments
Please login to add a commentAdd a comment