
రాంచీ: గిరిజనుల ఆరాధ్య దైవం బిర్సా ముండా ముని మనవడు మంగళ్ ముండా కన్ను మూశారు. ఆయన వయస్సు 45 ఏళ్లు. ఈ నెల 25న ఖుంటి జిల్లాలో వాహనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడిన మంగళ్ తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా ఖుంటిలోని సదర్ ఆస్పత్రిలో చికిత్స చేశారు. తలకు తీవ్ర గాయాలై రక్తం గడ్డకట్టడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తు న్నారు.
శుక్రవారం ఆయన కార్డియో వాస్క్యులర్ ఫెయిల్యూర్‌తో తుదిశ్వాస విడిచారని రిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆయన్ను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేశామని రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ హిరేన్ చెప్పారు. సీఎం హేమంత్ సోరెన్ రిమ్స్‌కు వెళ్లి మంగళ్ ముండా కుటుంబసభ్యులను ఓదా ర్చారు. మంగళ్ ముండా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment