Birsa Munda
-
ప్రమాదంలో గాయపడి బిర్సా ముండా మునిమనవడు మృతి
రాంచీ: గిరిజనుల ఆరాధ్య దైవం బిర్సా ముండా ముని మనవడు మంగళ్ ముండా కన్ను మూశారు. ఆయన వయస్సు 45 ఏళ్లు. ఈ నెల 25న ఖుంటి జిల్లాలో వాహనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడిన మంగళ్ తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా ఖుంటిలోని సదర్ ఆస్పత్రిలో చికిత్స చేశారు. తలకు తీవ్ర గాయాలై రక్తం గడ్డకట్టడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తు న్నారు. శుక్రవారం ఆయన కార్డియో వాస్క్యులర్ ఫెయిల్యూర్‌తో తుదిశ్వాస విడిచారని రిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆయన్ను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేశామని రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ హిరేన్ చెప్పారు. సీఎం హేమంత్ సోరెన్ రిమ్స్‌కు వెళ్లి మంగళ్ ముండా కుటుంబసభ్యులను ఓదా ర్చారు. మంగళ్ ముండా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. -
జన్ జాతీయ గౌరవ్ దివస్.. విస్మృత పోరాట యోధుడి జయంతి
గత రెండేళ్ల క్రితం నుంచి నవంబర్ 15 నాడు బిర్సా ముండా జయంతిని ‘జన్ జాతీయ గౌరవ్ దివస్’గా పాటిస్తున్నాం. ఇన్నేళ్లకైనా విస్మృత పోరాట యోధుణ్ణి స్మరించుకోవడం ఆనందదాయకం. ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వీరుడు బిర్సా ముండా. నాటి బెంగాల్ ప్రావిన్స్‌లోని బిహార్ (నేటి జార్ఖండ్)లో ఆదివాసీల రాజ్యాన్ని తేవటానికి సమరశంఖం పూరించాడు. ఆయన తన ఆదివాసీ ప్రజలకు ‘రాణి రాజ్యానికి అంతం పలుకుదాం–మన రాజ్యాన్ని స్థాపిద్దాం’ అనే నినాదం ఇచ్చాడు. ఈ నినాదం ప్రజలను తిరుగుబాటు వైపుకు నడిపించింది.ముండా తెగకు చెందిన సుగుణ, కార్మిహాలు దంపతులకు 1875 నవంబర్ 15న ఛోటానాగపూర్ సమీప చెల్కడ ప్రాంతంలోని బాబా గ్రామంలో ఆయన జన్మించాడు. ప్రాథమిక విద్యను కొద్దికాలం అభ్యసించిన తర్వాత ఒక జర్మన్ మిషనరీ స్కూల్లో చేరాడు. ఆ పాఠశాలలో చేరాలంటే క్రైస్తవుడై ఉండాలన్న నిబంధన ఉండడం వల్ల ఆయన మత మార్పిడి చేసుకున్నాడు. అయితే కొన్నేళ్లలోనే స్కూల్ నుంచి బయటికి వచ్చి క్రైస్తవాన్ని త్యజించి తన సొంత ఆదివాసీ ఆచారాలనే ఆచరించడం ప్రారంభించాడు. ఆదివాసీలందరినీ స్థానిక విశ్వాసాలనే అనుసరించమని బోధించాడు. తాను తన జాతీయులను ఉద్ధరించడానికి అవతరించినట్లు ప్రకటించాడు. ఆయన బోధనలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.ముండా ప్రజలు ఆయన్ని దేవునిగా భావించి ‘భగవాన్’ అని పిలవడం ప్రారంభించారు. అయితే బిర్సా ముండాను అనుసరించనివారు ఊచకోతకు గురవుతారనే గాలివార్త ప్రచారంలోకి రావడంతో ఆయన్ని బ్రిటిష్‌వాళ్లు ఛోటానాగపూర్ ప్రాంతంలో 1895 ఆగస్టులో అరెస్ట్ చేసి రెండేళ్లకు పైగా జైల్లో ఉంచారు. దీంతో ఆయన విడుదల కోరుతూ జాతీయోద్యమకారులు పెద్దఎత్తున బ్రిటిషర్లపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం ఎట్టకేలకు 1897 నవంబర్‌లో బిర్సాని విడుదల చేసింది.ఆ రోజుల్లో బ్రిటిష్‌వాళ్లు, వాళ్ల తాబేదార్లు ఆదివాసీల సాగు భూములపై పన్నులు విధిస్తూ... వాటిని కట్టకపోతే ఆ భూములను జమీందారీ భూములుగా మార్చేవారు. దీంతో చాలా మంది ప్రజలు అస్సాంలోని తేయాకు తోటల్లో కూలి పనుల కోసం వలస వెళ్లేవారు. దీన్ని గమనించిన బిర్సా... వన జీవులందరినీ సమావేశపరిచి, బ్రిటిష్‌వాళ్లకు కప్పాలు కట్టవద్దనీ, వాళ్లను తరిమి కొట్టాలనీ పిలుపునిచ్చాడు. అనుచరులతో కలిసి బాణాలు ధరించి 1899 డిసెంబర్లో భారీ ‘ఉల్’ గులాన్’ (తిరుగుబాటు ర్యాలీ) నిర్వహించాడు.చదవండి: ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?ఈ చర్యలను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్ని 1900 ఫిబ్రవరి 3న బంధించి రాంచీ జైలుకు తరలించింది. కేసు విచారణలో ఉన్న కాలంలో జూన్ 9న జైల్లోనే ఆయన తుది శ్వాస విడిచాడు. చివరికి 1908లో బిటిష్ ప్రభుత్వం ఆదివాసీల భూములను ఆదివాసీలు కానివారికి బదిలీ చేయడాన్ని నిషేధిస్తూ ‘ది ఛోటానాగపూర్ టెనెన్సీ యాక్ట్’ను తీసుకువచ్చింది. అనంతర కాలంలో బిర్సా స్ఫూర్తితో ముండా, ఒరియాన్, సంతాల్ తెగలు తమ హక్కులను సాధించుకున్నాయి.– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ (2024, నవంబర్ 15న బిర్సాముండా 150వ జయంతి ప్రారంభం) -
ఆదివాసీ సమాజాన్ని ఆరాధిస్తున్నాం
పాట్నా: దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది గిరిజన యోధులు పోరాటం సాగించారని, క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఒక కుటుంబం కొట్టేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్షేపించారు. గిరిజన నాయకుల పోరాటాలు, త్యాగాలను కాంగ్రెస్ చిన్నచూపు చూసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కుట్రల వల్ల అడవి బిడ్డలకు పేరు ప్రతిష్టలు దక్కలేదని, వారు అనామకులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన పోరాట వీరుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా శుక్రవారం బిహార్‌లోని జమూయిలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గిరిజన సంక్షేమానికి సంబంధించి రూ.6,640 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. ‘పీఎం జన్ మన్ యోజన’కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. ఆదివాసీ సమాజాన్ని తాము ఆరాధిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా గిరిజన జాతికి తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని సంకలి్పంచామని తెలిపారు. ఇందులో భాగంగా బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా ప్రకటించి, వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... నిజం సమాధికి కుట్రలు ‘‘శతాబ్దాలుగా దేశ సాంస్కృతిక చరిత్ర, ఘనమైన వారసత్వాన్ని పరిరక్షించడంలో గిరిజనుల పాత్ర వెలకట్టలేనిది. శ్రీరాముడు ఒక రాజకుమారుడి నుంచి భగవంతుడిగా మారడానికి గిరిపుత్రులు సహకరించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు. ఎన్నో త్యాగాలు చేశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ, గత ప్రభుత్వాలు ఈ నిజాన్ని సమాధి చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయతి్నంచాయి. కొందరి కుట్రల కారణంగా స్వాతంత్య్ర ఉద్యమ క్రెడిట్ మొత్తం ఒక పార్టీకి, ఒక కుటుంబానికి(నెహ్రూ) దక్కింది. దీనివల్ల బిర్సా ముండా, తిల్కా మాంజీ(18వ శతాబ్దపు సంథాల్ నాయకుడు) పేర్లు మరుగునపడ్డాయి. కొందరు ప్రచారం చేస్తున్నట్లు కేవలం ఒక్క కుటుంబం పోరాటం వల్లే దేశానికి స్వాతంత్య్రం వస్తే మరి బిర్సా ముండా ఎందుకోసం పోరాటం చేసినట్లు?’’ అని మోదీ ప్రశ్నించారు.రూ.24,000 కోట్లతో జన్ మన్ యోజన ఈరోజు ‘పీఎం జన్ మన్ యోజన’ ప్రారంభించుకుంటున్నాం. గిరిజనుల్లో అత్యంత వెనుకబడ్డ వర్గాల సంక్షేమం కోసం రూ.24,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాం. పథకం అమల్లోకి రావడం వెనుక రాష్ట్రపతి ముర్ము చొరవ ఉంది. ఈ క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. గిరిజనుల జీవన విధానం ప్రకృతికి దగ్గరగా, పర్యావరణ హితంగా ఉంటుంది. ఆధునిక యుగంలో వారి జీవన విధానం అందరికీ అనుసరణీయం.ఇది కూడా చదవండి: Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు -
Birsa Munda Jayanti: చిన్న వయసులో ఆదివాసీ యోధునిగా ఎదిగి..
నాడు బ్రిటీషర్ల అరాచకాలను ఎదిరించిన ఆదివాసీ యోధుడు బిర్సా ముండా జయంతి నేడు. తన పోరాట పటిమతో ఆంగ్లేయులకు చెమటలు పట్టించిన బిర్సా ముండా చిన్నవయసులోనే కన్నుమూసినా, పది కాలాల పాటు అందరూ గుర్తు పెట్టుకునేలా బ్రిటీషర్లతో పోరాటం సాగించాడు. ఆనాటి బ్రిటీష్ దాష్టీకాల్ని ఎండగట్టాడు. ఆదివాసీలను సమీకరించి, వారిని చైతన్యవంతులను చేశాడు. ఆదివాసీల సమూహాన్ని ఏర్పాటు చేసి, అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా బిర్సా ముండా పేరొందాడు.అటవీ ప్రాంతంలోని గిరిజనుల భూముల హక్కులను పరిరక్షించే చట్టాలను ప్రవేశ పెట్టాలంటూ బిర్సా ముండా పోరాటం సాగించాడు. కేవలం 25 ఏళ్లు మాత్రమే జీవించిన ఈ ఆదివాసీ యోధుడు గిరిజన నాయకునిగా, స్వాతంత్ర సమర యోధునిగా గుర్తింపు పొందాడు. బీహార్, జార్ఖండ్ చుట్టు పక్కల నివసించిన ఈయన జాతీయ ఉద్యమంపై ఎనలేని ప్రభావం చూపాడు. బిర్సా ముండా పుట్టిన రోజున 2000లో ఆయనకు తగిన గౌరవాన్ని అందజేస్తూ కేంద్ర ప్రభుత్వం జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.1875, నవంబర్ 15న జన్మించిన బిర్సా ముండా 1900 జూన్ 9న ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ బిర్సాముండా 1886 నుండి 1890 వరకూ మిషనరీకి, ఆంగ్లేయుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. గిరిజనులకు తగిన శిక్షణ ఇచ్చి, వారిని బ్రిటీషర్లపై పోరాడే యోధులుగా తీర్చిదిద్దాడు. 1900, మార్చి 3న బిర్సా ముండా జామ్ కోపాయ్ అడవిలో నిద్రిస్తున్న సమయంలో బ్రిటీష్ సైనికులు అతనిని అరెస్ట్ చేశారు. బిర్సాముండాను జైలులో పెట్టిన కొద్ది రోజులకే కన్నుమూశాడు. ఇది కూడా చదవండి: మొసళ్ళతో మాట్లాడేవాడు.. -
'బిర్సా ముండా' జీవితంపై పా. రంజిత్ సినిమా ప్రకటన
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన తంగలాన్ రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈమేరకు చిత్ర యూనిట్ కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సినిమా తాజాగా హిందీ వర్షన్‌తో బాలీవుడ్లో విడుదలకానుంది. ఈ సందర్భం డైరెక్టర్ పా.రంజిత్ తన కొత్త సినిమా గురించి వెల్లడించారు. ఈసారి హిందీలో స్ట్రెయిట్ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశానని, దానికి 'బిర్సా ముండా' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు పా.రంజిత్ అధికారికంగా ప్రకటించారు.పా.రంజిత్‌ది చిత్రపరిశ్రమలో ప్రత్యేక బాణి. సామాజిక అంశాలనే కథావస్తువులుగా తీసుకొని వాటికి అందరూ మెచ్చేలా కమర్షియల్ పంథాలో సినిమా తీస్తారు. అందుకే ఆయన చిత్రాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన తెరకెక్కించనున్న బిర్సా ముండా చిత్రం కూడా అదే కోవకు చెందినదిగా చెప్పవచ్చు. అయితే, ఇందులో నటించబోయే నటీనటుల పేర్లు ఆయన వెల్లడించలేదు.ఎవరీ బిర్సా ముండాఆదివాసీ నాయకుడు బిర్సా ముండా (1875–1900) జీవిత చరిత్ర చాలా ఎమోషనల్‌గా ముగుస్తుంది. బిర్సా ముండా 19వ శతాబ్దపు జార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటిష్, స్వదేశీ భూస్వాములచే బానిసలుగా ఉన్న గిరిజన ప్రజల కోసం పోరాడారు. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయనొక జానపద నాయకుడు. ముండా జాతికి చెందిన బిర్సా 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు. తద్వారా భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడిగా బిర్సా ముండా గుర్తింపు పొందారు. ఆయన గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారు. -
Janjatiya Gaurav Divas: గిరిజనుల రుణం తీర్చుకుంటా..
కుంతీ: సమాజంలో అణగారిన వర్గమైన గిరిజనులకు న్యాయం చేకూర్చడానికి తమ ప్రభుత్వం ‘మిషన్ మోడ్’లో పని చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గిరిపుత్రులకు తాను రుణపడి ఉన్నానని, ఆ రుణ తీర్చుకుంటానని తెలిపారు. గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని కుంతీ జిల్లాలో బుధవారం నిర్వహించిన ‘జన జాతీయ గౌరవ్ దివస్’లో మోదీ పాల్గొన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని గిరిజనుల సంక్షేమం కోసం రూ.24,000 వేల కోట్లతో అమలు చేసే ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ను ప్రారంభించారు. పలు ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కుంతీలోని ఫుట్‌బాల్ మైదానంలో బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. దేశ అభివృద్ధికి మహిళలు, రైతులు, యువత, మధ్యతరగతి–పేదలు అనే నాలుగు వర్గాలను బలోపేతం చేయడం చాలా కీలకమని ఉద్ఘాటించారు. బిర్సా ముండా జన్మించిన గడ్డకు గిరిజనుల రుణం తీర్చుకోవడానికి వచ్చానని అన్నారు. పౌరులపై అన్ని రకాల వివక్షను తొలగించినప్పుడే అసలైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని చెప్పారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్లు భావించాలని స్పష్టం చేశారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా.. అడవులు, మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధికి దూరంగా నివసిస్తున్న గిరిజనుల కోసం ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ను ప్రారంభించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ పథకం కింద ఆయా ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కలి్పంచనున్నట్లు వివరించారు. రోడ్లు, టెలికాం వ్యవస్థ, విద్యుత్, గృహనిర్మాణం, సురక్షిత తాగు నీరు, పారిశుధ్య వసతులు, విద్యా, వైద్యం, జీవనోపాధి పథకాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా 22,000 గ్రామాల్లో అభివృద్ధికి దూరంగా నివసిస్తున్న 75 గిరిజన జాతులను ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. గిరిపుత్రుల బాగు కోసం గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని విమర్శించారు. వారి అభివృద్ధే ధ్యేయంగా ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ పథకం కింద రూ.24,000 కోట్లు ఖర్చు చేయబోతున్నామని ప్రకటించారు. బిర్సా ముండాకు నివాళులు.. కుంతీ జిల్లాలోని ఉలీహతులో ప్రముఖ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జన్మ స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సందర్శించారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. బిర్సా ముండా జన్మించి నేలపై మట్టిని తీసుకొని మోదీ తిలకంగా ధరించారు. ఆయన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. ఉలీహతులో స్థానికులు మోదీకి సాదర స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా గిరిజనులతో కలిసి మోదీ నృత్యం చేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభం కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల కింద లబ్ధి పొందనివారికి ఆయా పథకాల గురించి ఈ యాత్ర ద్వారా వివరిస్తారు. దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఏడాది జనవరి 25 వరకూ ఈ యాత్ర కొనసాగుతుంది. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి విడుదల పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 15 విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.18,000 కోట్ల నిధులను ఆన్లైన్ ద్వారా జమ చేశారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పీఎం–కిసాన్ సమ్మాన్ నిధిని ప్రధాని మోదీ విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
బిర్సా ముండా ఎవరు? ప్రధాని మోదీ ఆయన జన్మస్థలికి ఎందుకు వెళుతున్నారు?
నేడు అమర వీరుడు బిర్సా ముండా జయంతి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (బుధవారం) జార్ఖండ్‌లోని బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతుకు వెళ్తున్నారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో గల ఉలిహతును దేశ ప్రధాని సందర్శించడం ఇదే మొదటిసారి. ఉలిహతులో బిర్సా ముండాకు నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా రూ. 24 వేల కోట్ల విలువైన ట్రైబల్ మిషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ నేడు ముందుగా రాంచీలోని లార్డ్ బిర్సా ముండా మెమోరియల్ పార్క్, ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియాన్ని సందర్శించనున్నారు. అనంతరం బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతు గ్రామానికి చేరుకుని, అక్కడ బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. బిర్సా ముండా గిరిజనుల పాలిట హీరోగా నిలిచారు. గిరిజనులు అతనిని దేవుడిలా భావిస్తారు. బిర్సా ముండా 1875 నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఉలిహతులో జన్మించారు. గిరిజన మత సహస్రాబ్ది ఉద్యమానికి నాయకత్వం వహించారు. అలాగే గిరిజన సమాజంలో ప్రబలంగా ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రచారాన్ని చేపట్టారు. భూస్వాముల ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. 1894లో బిర్సా ముండా ఆదాయ మాఫీ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని ముండా తిరుగుబాటు లేదా ఉల్గులన్ అని పిలుస్తారు. 1895లో బ్రిటీష్ వారు బిర్సా ముండాను అరెస్టు చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత బిర్సా ముండా బ్రిటిష్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా గిరిజన సమాజాన్ని ఏకీకృతం చేశారు. 1899, డిసెంబరు 24న బిర్సా ముండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఈ నేపధ్యంలో బ్రిటీష్ వారు 1900, మార్చి 3న అతనిని అరెస్టు చేశారు. బిర్సాముండా 1900, జూన్ 9న రాంచీ జైలులో మరణించారు. ఆ సమయానికి బిర్సా ముండా వయసు కేవలం 25 సంవత్సరాలు. ఇది కూడా చదవండి: ఏడు దాటినా వీడని పొగమంచు.. దిక్కుతోచని ఢిల్లీ జనం! -
Mann ki Baat: పటేల్ జయంతి నాడు... మేరా యువ భారత్
న్యూఢిల్లీ: జాతి నిర్మాణ కార్యకలాపాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా మేరా యువ భారత్ పేరుతో జాతీయ స్థాయి వేదికను అందుబాటులోకి తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సర్దార్ వల్లభ్ బాయి పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆ సందర్భంగా మేరా యువ భారత్ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. MYBharat.Gov.in సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని యువతకు సూచించారు. దీన్ని యువ శక్తిని జాతి నిర్మాణానికి, ప్రగతికి వినియోగపరిచేందుకు తలపెట్టిన అద్భుత కార్యక్రమంగా మోదీ అభివర్ణించారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి మాట్లాడారు. అక్టోబర్ 31 దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కూడానని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. నవంబర్ 15న ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు కూడా మోదీ నివాళులర్పించారు. విదేశీ పాలనను ఒప్పుకోని ధీర నాయకునిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. తిల్కా మహరాజ్, సిద్ధూ, కాన్హు, తాంతియా భీల్ వంటి వీర గిరిజన నాయకులు దేశ చరిత్రలో అడుగడుగునా కనిపిస్తారన్నారు. గిరిజన సమాజానికి దేశం ఎంతగానో రుణపడిందన్నారు. స్థానికతకు మరింతగా పెద్ద పీట వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున ఖాదీ వస్తువుల అమ్మకం రికార్డులు సృష్టించిందని గుర్తు చేశారు. ఢిల్లీలో అమృత్ వాటిక రెండున్నరేళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అక్టోబర్ 31న ఘనంగా ముగియనుందని మోదీ చెప్పారు. ‘‘దీనికి గుర్తుగా ఢిల్లీలో అమృత్ వాటిక నిర్మించనున్నాం. ఇందుకోసం అమృత్ కలశ్ యాత్రల పేరుతో దేశవ్యాప్తంగా మట్టిని సేకరించి పంపుతుండటం హర్షణీయం’’అన్నారు. వ్యర్థాల నుంచి సంపద అన్నది మన నూతన నినాదమని మోదీ అన్నారు. గుజరాత్ల అంబా జీ మందిర్‌లో వ్యర్థౠల నుంచి రూపొందించిన పలు కళాకృతులు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. దీన్ని దేశవాసులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బెర్లిన్‌లో తాజాగా ముగిసిన ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్‌లో భారత్ 75 స్వర్ణాలతో పాటు ఏకంగా 200 పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. గిరిజన వీరుల ప్రస్తావన ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో గిరిజన వీరుల గురించి ప్రస్తావించారు. గిరిజన యుద్ధ వీరుల చరిత్రను ప్రశంసించారు. తెలంగాణలోని నిర్మల్, ఉట్నూరు, చెన్నూరు, అసిఫాబాద్ ప్రాంతాలను పరిపాలించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేంగా పోరాడి ఉరికొయ్యకు ప్రాణాలరి్పంచిన రాంజీ గోండు, ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ప్రాంతానికి చెందిన వీర్ గుండాధుర్, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రథమ స్వాతంత్య్ర సమర యోధుడు భీమా నాయక్‌ల వీర చరిత్రను కొనియాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన తిల్కా మాంఝీ, సమానత్వం కోసం పోరాడిన సిద్ధో–కన్హూ, స్వాతంత్య్ర యోధుడు తాంతియా భీల్‌లు ఈ గడ్డపై పుట్టినందుకు గరి్వస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గిరిజన ప్రజల్లో అల్లూరి సీతారామరాజు నింపిన స్ఫూర్తిని దేశం ఇప్పటికీ గుర్తుంచుకుందని పేర్కొన్నారు. గిరిజన సమాజానికి స్ఫూర్తినిచి్చన రాణి దుర్గావతి 500వ జయంతిని దేశం జరుపుకొంటోందని, గిరిజన సమాజానికి స్ఫూర్తినిచ్చిన వారి గురించి యువత తెలుసుకొని వారి నుంచి స్ఫూర్తి పొందాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
Gujarat assembly elections 2022: కాంగ్రెస్‌కు గిరిజనులంటే గౌరవం లేదు: మోదీ
నెత్రంగోడా: కాంగ్రెస్ పార్టీకి గిరిజనులంటే ఏమాత్రం గౌరవం లేదని ప్రధాని మోదీ ఆరోపించారు. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని సైతం ఆ పార్టీ బలపరచలేదని పేర్కొన్నారు. ‘బిర్సా ముండా, గోవింద్ గురు వంటి గిరిజన నేతలను కాంగ్రెస్ పట్టించుకోలేదు. ముర్ముకు మద్దతివ్వాలని రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఆ పార్టీని చేతులు జోడించి వేడుకున్నా కాదన్నారు. గిరిజన పుత్రికను రాష్ట్రపతిని చేసేందుకు సర్వశక్తులూ ధారపోయాల్సి వచ్చింది’ అన్నారు. గుజరాత్‌లోని ఖేడా, భరుచ్ జిల్లాల్లో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్లు నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఉండేదన్నారు. దేశంలో భారీ ఉగ్రదాడుల సమయంలో మౌనంగా ఉండటం ద్వారా కాంగ్రెస్, సారూప్య పార్టీలు తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నాయని ఆరోపించారు. ‘కాంగ్రెస్ మారలేదు. దేశాన్ని కాపాడుకోవాలంటే అలాంటి పార్టీలను దూరంగా ఉంచాలి’అని ప్రధాని పేర్కొన్నారు. -
Birsa Munda: ఆదివాసీల ఆరాధ్యదైవం
ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పోరాడిన యువకిశోరం బిర్సా ముండా. ఆయనను తన జాతి ప్రజలు దేవునిగా కొలిచారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా ఉలిహత్ గ్రామంలో 1875 నవం బర్ 15న సుగుణ ముండా, కర్మిహాట్ దంపతులకు బిర్సా ముండా జన్మించాడు. ‘సాల్గా’ గ్రామంలో మేనమామ వద్ద ఉంటూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. అనంతం చయిబాసాలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. బిర్సా ముండా పేరు బిర్సా డేవిడ్ గా మారింది. అందులో చదువుకుంటూనే పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్ పాలకులు అధిక పన్నులు వసూలు చేసేవారు. పన్ను చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. ఎదురు తిరిగిన వారిని నానా బాధలు పెట్టేవారు. బ్రిటిష్‌వాళ్ల బాధలు పడ లేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటలలోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగి చ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి బిర్సా తెల్ల దొరలపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ పాఠశాల ఆయనను బహిష్కరించింది. దీన్ని సవాలుగా తీసుకున్న బిర్సా వారి ఎదుటే నుదుట నామం పెట్టి, జంధ్యం ధరించి, ఇకపై క్రైస్తవంలోకి ఒక్క ఆదివాసీని కూడా మారకుండా చూస్తానని ప్రతిన బూనాడు. బ్రిటిషర్ల వల్ల ముండా, సంథాల్, ఓరియన్, కోల్ జాతి తెగలు ఎప్పటికైనా ప్రమా దంలో పడే అవకాశం ఉందని భావించిన బిర్సా ప్రత్యేకంగా ‘బిర్సాయిత్’ మతాన్ని స్థాపించాడు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక అంశాలు బోధించే వాడు. ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాడు. ప్రకృతి వైద్యంతో ఎంతోమంది ఆదివాసీలను కాపాడాడు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు బిర్సా ముండాను ధర్తీలబా(దేవుడు)గా కొలిచేవారు. తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్లో ఉల్ గులాన్ (తిరుగుబాటు) పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. అందులో 7,000 మంది పాల్గొన్నారు. బిర్సా ఆచూకీ తెలపాలని ఆదివాసీలను నిర్బంధిస్తూ వారిపై దాడులకు దిగేవారు బ్రిటిష్‌వాళ్లు. వీటిని సహించని ఆయన అనుచరులు 1900 జనవరి 5న ఎట్కేడీ ప్రాంతంలో ఇద్దరు పోలీసులను చంపేశారు. దీనితో రగిలిపోయిన పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించి చివరికి 1900 ఫిబ్రవరి 3న జంకోపాయి అటవీ ప్రాంతంలో అరెస్టు చేసి రాంచీ జైలుకు తరలించారు. ఎప్పటికైనా తమకు ప్రమాదకారిగా మారతాడని భావించిన ప్రభుత్వం బిర్సా ముండాను 1900 జూన్ 9న విష ప్రయోగంతో చంపేసింది. బయటకు మాత్రం మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేసింది. ఇప్పటికీ ఆయన్ని జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివాసీలు ‘భగవాన్ బిర్సా ముండా’గా పూజిస్తున్నారు. చనిపోయేటప్పుడు బిర్సాకు కేవలం 25 ఏళ్లు మాత్రమే. ఆయన ఉద్యమ ఫలితంగానే 1908లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఛోటా నాగపూర్ కౌలుదారుల హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. (క్లిక్ చేయండి: నిజంగా భక్తులేనా? పైకి మాత్రమేనా?) – చింత ఎల్లస్వామి ఏబీవీపీ రాష్ట్ర పూర్వ సంయుక్త కార్యదర్శి (నవంబర్ 15న బిర్సా ముండా జయంతి) -
విషజ్వరమా? విష ప్రయోగమా?
గిరిజనోద్యమాలలో బిహార్‌లోని ఛోటానాగ్పూర్, రాంచీ పరిసరాలలో ముండా తెగ గిరిజనులు నిర్వహించిన పోరాటానికి నాయకత్వం వహించిన యోధుడే.. బీర్సా ముండా. భూమి మీద తన తెగ ప్రజలు, ఇతర గిరిజన తెగల సోదరులు కోల్పోయిన హక్కు ఆయనను ఒక పెద్ద ఉద్యమానికి పురికొల్పింది. వలస పాలన, దాని చట్టాలు అడవులలో వ్యవసాయక విధానాన్ని భూస్వామిక వ్యవస్థలో భాగం చేసింది. దీనికి వ్యతిరేకంగానే అక్కడ ఉద్యమం వచ్చింది. బీర్సా జన్మించడానికి (1875) ఒక్క సంవత్సరం ముందే ముండా, ఒరాన్ గిరిజన తెగలు తమ భూములను పూర్తిగా కోల్పోయి, థికాదారుల పొలాలలో కూలీలుగా పనిచేస్తూ బతికే స్థితికి చేరుకున్నారు. 1875 నాటికి 150 అటవీ గ్రామాల మీద పూర్తి ఆధిపత్యం సాధించారు. ఫలితంగా వలస పాలకులకు, వీరికి మధ్య ఘర్షణ ఉద్ధృతం అయింది. 1900 మార్చి 3న బీర్సా అడవిలో ఆదమరచి నిద్రపోతూ ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు 460 మంది మీద తీవ్రమైన కేసులు నమోదు చేశారు. విచారణలో ఉండగానే ఆరుగురు మరణించారు. ఇదంతా రాంచీ జైలులో జరిగింది. అక్కడే 1990 జూన్ 9 న బీర్సా హఠాత్తుగా కన్నుమూశాడు. అధికారులు మాత్రం అతడు విష జ్వరంతో మరణించాడని చెప్పారు. కానీ విషప్రయోగం వల్లనే చనిపోయాడని సాటి ఖైదీల వాదన. ఈ ఉద్యమానికే చరిత్రలో ఉల్గులాన్ అని పేరు.