
సాక్షి, కామారెడ్డి : మహాకూటమి ప్రచారం సునామీలో టీఆర్‌ఎస్ పార్టీ కొట్టుకుపోతుందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. డిసెంబర్ 7న ఎలక్షన్స్ ఖరారు చేసిన ఎలక్షన్ కమిషన్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు. ఎలక్షన్స్‌ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు.