
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్లు ఆపడమే సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చే కొత్త ఏడాది కానుక అని శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఎన్నికల్లో 121 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఒక్క ఆసరా పింఛన్లనే సక్రమంగా అమలు చేసిందన్నారు.
గత మూడు నెలలుగా నిలిపివేసిన ఆసరా పింఛన్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 121 హామీల్లో ముఖ్యమైన 43 హామీల గురించి సీఎం కేసీఆర్‌కు త్వరలోనే లేఖ రాస్తున్నట్లు తెలిపారు.