నిజామాబాద్: కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పోటీచేస్తే ఓడిపోతారన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఇక్కడినుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోందన్నారు. హాథ్ సే హాథ్ జోడో, గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఉగ్రవాయిలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను నిలువరించడానికి కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ నినాదం తెరపైకి వచ్చిందన్నారు. సీఎంను పోటీకి ఆహ్వానించానని గంప గోవర్ధన్ అనడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు. గజ్వేల్‌లోని గ్రామాలను నీట ముంచి, ప్రస్తుతం కామారెడ్డిని ముంచడానికి వస్తున్నారా అని సీఎంను ప్రశ్నించారు.
కామారెడ్డినుంచి కేసీఆర్, కేటీఆర్, కవితలలో ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, అమ్ముల ముకుందం, గోనె శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, నౌసిలాల్, చిన్నమల్లారెడ్డి సర్పంచ్ ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment