
సాక్షి, హైదరాబాద్ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న హైదరాబాద్ పారిశ్రామికవేత్త సానా సతీష్‌బాబు కీలక విషయాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో ఉన్న లింకులపై సానా సతీష్ సమాచారం ఇచ్చారు. సానా సతీష్‌తో సంబంధం ఉన్న ప్రముఖులకు ఈడీ నోటీసులు అందించింది. వీరిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, నగల వ్యాపారి సుఖేష్ గుప్తా, ప్రముఖ స్కూల్ డైరెక్టర్ రమేష్, వ్యాపార వేత్త చాముండిలకు ఉన్నారు.
(చదవండి : అక్రమాస్తుల కేసు: సాన సతీష్‌బాబు అరెస్ట్)
మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సతీష్ నిందితుడిగా ఉన్నారు. 2013లో వజ్రాల వ్యాపారీ సుఖేష్ బెయిల్‌కోసం మాంసం వ్యాపారీ మొయిన్ ఖురేషీకి సానా రూ. కోటీ 50లక్షలు ఇచ్చారని కేసు నమోదయింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో సానా లావాదేవీలు నడిపినట్లు ఈడీ విచారణలో తేలింది. అంతే కాకుండా సుఖేష్ బెయిల్ కోసం షబ్బీర్ అలీ, ఖురేషీ, సానా సీబీఐ కార్యాలయానికి వెళ్లారని విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో వారికి ఈడీ నోటీసులు అందించింది. సుఖేష్ గుప్తా కోసం లైజనింగ్ చేసిన ప్రముఖ స్కూల్ డైరెక్టర్ రమేష్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా తనకు ఎలాంటి నోటీలులు అందలేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment