Sana Satish
-
Big Question: రాజ్యసభకు అవినీతి తిమింగలం.. నారా లోకేష్ భారీ స్కెచ్
-
‘సానా’కు శానా చేస్తున్నారు
సాక్షి, అమరావతి: మనీ లాండరింగ్, హవాలా కేసులు సహా సీబీఐనే వివాదంలోకి లాగిన చరిత్ర ఉన్న సానా సతీష్‌కు సీఎం చంద్రబాబు రాజ్యసభ సీటు ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాబీయింగ్, అవినీతి వ్యవహారాలతో అంటకాగే వ్యక్తికి కీలక పదవి ఇవ్వడం సరికాదంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో, వ్యక్తిగత సంభాషణల్లో విరుచుకుపడుతున్నారు. పార్టీ కోసం సుదీర్ఘ కాలం నుంచి పని చేసిన వారిని పట్టించుకోకుండా కొత్తగా పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయిస్తున్న సానా సతీష్‌కు ఉన్నత పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు పదవి ఇస్తున్నారని కొన్ని రోజుల క్రితమే తెలియడంతో చాలా మంది ముఖ్య నేతలు చంద్రబాబును కలిసి తమ అసంతృప్తి వెలిబుచ్చారు. ఎంతో మంది సీనియర్లు ఉండగా, తీవ్ర స్థాయి ఆరోపణలున్న వ్యక్తిని పరిగణనలోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తమ లాంటి సీనియర్ల పరిస్థితి ఏమిటని.. క్యాడర్‌కు, నాయకులకు ఏం సమాధానం చెప్పాలని అడిగినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో, అంతకు ముందు.. పార్టీకి భారీగా నిధులు ఇచ్చిన వారికి ఇప్పుడు న్యాయం చేయక తప్పదని ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం. లోకేశ్ పాదయాత్రలో సతీష్ లాంటి నేతలు చాలా ఉపయోగపడ్డారని, వారు డబ్బు ఖర్చు చేశారు కాబట్టే అధికారంలోకి వచ్చాక ప్రతిఫలం ఇస్తున్నామని స్పష్టం చేసినట్లు.. అంతటితో ఆగకుండా పార్టీలో కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. చంద్రబాబు స్పందించిన తీరుతో సీనియర్ నాయకుల్లో ఇంకా ఆగ్రహం పెరిగిపోయింది. పార్టీ చంద్రబాబు చేతుల్లో లేదని, లోకేశ్ కోటరీ చేతుల్లో ఉందని చర్చించుకుంటున్నారు. లోకేశ్ కోటరీలో అత్యంత కీలకంగా ఉంటూ బదిలీలు, కాంట్రాక్టులు సహా అన్ని వ్యవహారాలను సానా సతీష్ చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో ఆయన పేరును రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు ప్రకటించక తప్పలేదంటున్నారు.విస్తుగొలిపే తీవ్ర ఆరోపణలు ⇒ సానా సతీష్‌పై మనీ లాండరింగ్ అభియోగాలుండడంతో సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ కేసులకు సంబంధించి 2019 జూలైలో ఆయన్ను ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపింది. ⇒ మనీ లాండరింగ్, హవాలా కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మీట్ వ్యాపారి మొయిన్ ఖురేషీతో సతీష్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు తేలింది. ఖురేషీతో కలిసి అక్రమ వ్యాపారాలు కూడా చేసినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే తనపై ఉన్న మనీ లాండరింగ్ కేసుల నుంచి తప్పించుకునేందు ఖురేషీ ద్వారా సీబీఐ అధికారులకు సతీష్ లంచం ఇచ్చినట్లు స్పష్టమైంది. ⇒ అదే సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా పని చేసిన రాకేష్ ఆస్థానా, మరో సీబీఐ అధికారి అలోక్ వర్మ మధ్య చిచ్చుపెట్టి.. ఏకంగా సీబీఐనే వివాదంలోకి లాగిన చరిత్ర సతీష్‌ది. తనను కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు స్పష్టమవడంతో ఈడీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.⇒ తనపై ఉన్న ఆరోపణలను కొట్టేయాలంటూ ఈ ఏడాది జులైలో సానా సతీష్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా దాన్ని కోర్టు కొట్టివేసింది. ఇలా తీవ్ర స్థాయి ఆరోపణలున్న వ్యక్తిని విచారించాల్సిందేనని స్పష్టం చేసింది.సబ్ ఇంజినీర్ నుంచి కోట్లకు పడగలెత్తి..⇒ కాకినాడకు చెందిన సానా సతీష్ మొదట్లో విద్యుత్ శాఖలో సబ్ ఇంజినీర్‌గా పని చేశారు. ఉద్యోగం వదిలేశాక అక్రమ వ్యాపారాలతో కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్, హవాలా కేసులు నమోదయ్యాయి. అలాంటి వ్యక్తి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ⇒ అక్రమంగా సంపాదించిన డబ్బును ఖర్చు చేసి వారికి బాగా దగ్గరయ్యారు. లోకేశ్ పాదయాత్ర ఖర్చును చాలా వరకు సతీష్ భరించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో భారీగా డబ్బు సమకూర్చినట్లు తెలిసింది. చాలా వ్యవహారాల్లో లోకేశ్ వెన్నంటే ఉండి అన్నీ సమకూర్చినట్లు చెబుతున్నారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా అవతరించారు. ⇒ మంత్రి పదవులు, ఉన్నతాధికారుల పోస్టింగ్‌లు, బదిలీలు, కాంట్రాక్టులు ఇతర అనేక వ్యవహారాల్లో ఆయన ప్రమేయం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పదవి ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా కాకలు తీరిన సీనియర్ నేతలను కాదని రాజ్యసభ సీటునే తన్నుకుపోయారు. -
లోకేష్ సన్నిహితుడు ‘సానా’ మామూలు ముదురు కాదు!
సాక్షి, గుంటూరు: నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్‌పై తీవ్ర ఆరోపణలే ఉన్నాయి. హవాలా మనీలాండరింగ్ కేసులో సానా సతీష్ సీబీఐ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. సీబీఐ అధికారులకు లంచం ఇచ్చినట్లు, హవాలా వ్యాపారి ఖురేషీతో కలిసి సానా సతీష్ అక్రమ వ్యాపారాలు చేసినట్లు సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.ఖురేషీ చెందిన వ్యాపార సంస్థలో సానా సతీష్ భారీగా వాటాలు కొనుగోలు చేసినట్టు గుర్తించింది. సీబీఐ డైరెక్టర్లుగా పనిచేసినా రాకేష్ ఆస్తానా, ఆలోక్‌వర్మ మధ్య వైరంలో సానా సతీష్ కీలక పాత్ర పోషించారు. తనను కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు సానా సతీష్ చెప్పారు.2019 జులై 26న సానా సతీష్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. తనపై ఉన్న ఆరోపణలను కొట్టేయాలంటూ జులైలో సానా సతీష్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. సీబీఐ, ఈడీ ఆరోపణలపై సానా సతీష్‌ను విచారించాల్సిందేని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. విద్యుత్ శాఖలో చిన్న ఉద్యోగిగా ప్రారంభమై వేల కోట్ల వ్యాపారాలకు అధిపతిగా సానా సతీష్ ఎదిగారు. సానా సతీష్ రాజకీయ నేతలకు బీనామీగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.ఇదీ చదవండి: కూటమి @ ఫ్యామిలీ ప్యాక్కాగా, కూటమిలో రాజ్యసభ కుంపటి రగులుతోంది. అన్న నాగబాబుకి రాజ్యసభ ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుబట్టగా, తన అనుచరుడు సానా సతీష్ కోసం నారా లోకేష్ భీష్మించారు. లోకేష్ చెప్పిన సానా సతీష్ కే రాజ్యసభ సీటును చంద్రబాబు ప్రకటించారు. నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు పత్రికా ప్రకటన చేశారు. మాట తప్పుతారన్న అనుమానంతో చంద్రబాబు చేత పవన్ కల్యాణ్ పత్రికా ప్రకటన ఇప్పించినట్లు తెలిసింది.రాజ్యసభకు నాగబాబు వెళితే ఢిల్లీలో బలం పెరుగుతుందని టీడీపీ అడ్డుకుంటోంది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్‌లను ప్రకటించిన చంద్రబాబు.. మత్స్యకార మోపిదేవికి షాక్ ఇచ్చారు. చంద్రబాబు దెబ్బకి మత్స్యకారులు రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోయారు. చంద్రబాబు రాజకీయంతో రాజ్యసభలో బీసీల సంఖ్య తగ్గింది. -
బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా..
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు కోవర్టు బొల్లినేని గాంధీ, సతీశ్‌లపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఆదివారం ఆయన ట్వీట్ చేస్తూ..‘‘మనీ లాండరింగ్ దళారి సానా సతీశ్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీలో చంద్రబాబు కోవర్టు బొల్లినేని గాంధీ, సతీశ్ దుబాయిలోని ఒక హోటల్లో రహస్యంగా కలిశారని విచారణలో తేలినట్లు మీడియాలో వచ్చింది. ఇందులో బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా స్టోరీలు వెలుగు చూస్తాయి’’ అంటూ పోస్ట్ చేశారు. మరోవైపు నారాయణ శ్రీచైతన్య కాలేజీలపై కూడా ఆయన మండిపడ్డారు. ‘‘నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై కేసులు నమోదు చేయాలని గౌరవ హైకోర్టు ఆదేశించడం హర్షణీయం. కిందటేడాది 79 మంది విద్యార్థులు వత్తిడి వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డట్టు దాఖలైన పిల్‌పై కోర్టు స్పందించింది. మృత్యు లోగిళ్లుగా మారిన ఈ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి’’ అని ట్విట్లో పేర్కొన్నారు. మనీ లాండరింగ్ దళారి సానా సతీశ్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది. edeeddఈడీలో చంద్రబాబు కోవర్టు బొల్లినేని గాంధీ, సతీశ్ దుబాయిలోని ఒక హోటల్లో రహస్యంగా కలిశారని విచారణలో తేలినట్లు మీడియాలో వచ్చింది. ఇందులో బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా స్టోరీలు వెలుగు చూస్తాయి. — Vijayasai Reddy V (@VSReddy_MP) August 4, 2019 -
సానా సతీష్ ఈడీ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న హైదరాబాద్ పారిశ్రామికవేత్త సానా సతీష్‌బాబు కీలక విషయాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో ఉన్న లింకులపై సానా సతీష్ సమాచారం ఇచ్చారు. సానా సతీష్‌తో సంబంధం ఉన్న ప్రముఖులకు ఈడీ నోటీసులు అందించింది. వీరిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, నగల వ్యాపారి సుఖేష్ గుప్తా, ప్రముఖ స్కూల్ డైరెక్టర్ రమేష్, వ్యాపార వేత్త చాముండిలకు ఉన్నారు. (చదవండి : అక్రమాస్తుల కేసు: సాన సతీష్‌బాబు అరెస్ట్) మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సతీష్ నిందితుడిగా ఉన్నారు. 2013లో వజ్రాల వ్యాపారీ సుఖేష్ బెయిల్‌కోసం మాంసం వ్యాపారీ మొయిన్ ఖురేషీకి సానా రూ. కోటీ 50లక్షలు ఇచ్చారని కేసు నమోదయింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో సానా లావాదేవీలు నడిపినట్లు ఈడీ విచారణలో తేలింది. అంతే కాకుండా సుఖేష్ బెయిల్ కోసం షబ్బీర్ అలీ, ఖురేషీ, సానా సీబీఐ కార్యాలయానికి వెళ్లారని విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో వారికి ఈడీ నోటీసులు అందించింది. సుఖేష్ గుప్తా కోసం లైజనింగ్ చేసిన ప్రముఖ స్కూల్ డైరెక్టర్ రమేష్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా తనకు ఎలాంటి నోటీలులు అందలేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. -
సానా సతీష్‌కు మరో వారం కస్టడీ
-
ఈడీ కస్టడీలో కీలక విషయాలు వెల్లడించిన సానా సత్తీష్
-
కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ..!
సాక్షి, అమరావతి : రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు అమాయకపు రైతుల పొట్టకొట్టారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కొద్ది రోజులు ఆగితే అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుందని ట్విటర్ వేదికగా హెచ్చరించారు. ‘ కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ? అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుంది. ఇన్సైడర్ ట్రేడింగుతో అమాయక రైతుల పొట్టకొట్టి మీరూ, మీ బినామీలు లాగేసుకున్న వేల ఎకరాల స్టోరీలన్నీ సీరియల్‌గా బయటకొస్తాయి. మీరు నిప్పులో తుప్పులో ప్రజలే చెబుతారు. కాండ్రించి ఉమ్ముతారు’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. సానా సతీశ్‌తో.. చంద్రబాబు సంబంధాలపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలి మనీలాండరింగ్ దళారి సానా సతీశ్‌తో చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ ప్రముఖల సంబంధాలపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. చిరుద్యోగం చేసుకునే వ్యక్తి.. అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే పెట్టే స్థాయికి ఎదగడం వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలుసని ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. ‘‘మనీలాండరింగ్ దళారి సానా సతీశ్‌తో.. చంద్రబాబు, టీడీపీ ప్రముఖుల సంబంధాలపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలి. చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి... అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే పెట్టే స్థాయికి... ఎదగడం వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలుసు’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాపులకు ద్రోహం చేసిందెవరో మీ అంతరాత్మను ఆడగండి నెహ్రు.. పదవి, ప్యాకేజీ కోసం జ్యోతుల నెహ్రూ కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అసాధ్యమని తెలిసినా 5శాతం రిజర్వేషన్ ప్రకటించినందుకు బాబును నెహ్రూ పొగిడారని విమర్శించారు. ‘కాపులకు ద్రోహం చేసిందెవరో మీ అంతరాత్మను అడగండి జ్యోతుల నెహ్రూ గారూ. పదవి, ప్యాకేజీ కోసం మీరు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? అసాధ్యమని తెలిసీ 5 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే బాబును పొగిడింది మీరే కదా? ఇప్పుడు ఎవరు ఉసిగొల్పితే విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలుసు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
అక్రమాస్తుల కేసు: సాన సతీష్ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: మాంసం వ్యాపారి మెయిన్ ఖురేషీ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్‌కు చెందిన సతీష్‌బాబు సానను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నియంత్రణ చట్టం ప్రకారం ఇతడిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. సెంట్రల్ ఢిల్లీలోని కార్యాలయంలో సతీష్‌ను రాత్రంతా ప్రశ్నించారు. మధ్యాహ్నం తర్వాత ఆయన్ని ఢిల్లీలోని పటియాలా కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా సతీష్‌బాబుపై సీబీఐ కేసు నమోదయిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున అక్రమాస్తులను కూడబెట్టిన ఖురేషీ కేసులో సతీష్ సాక్షిగా ఉన్నారు. ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నేతలకు ఆయన బినామీగా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలోనే ఆయన వ్యక్తిగత ఆస్తులపై పలుమార్లు ఈడీ సోదాలు కూడా జరిపింది. విద్యుత్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేసిన సతీష్‌కు.. వేలకోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్న దానిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణలో అనేక విషయాలను వెల్లడించిన సతీష్‌పై మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. -
ఆ ముగ్గురు ఎక్కడ?
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో సంచలనం రేపిన రాష్ట్రంలోని మూడు ప్రధాన ఘటనల్లో కీలక పాత్రధారులైన ముగ్గురు కొద్ది రోజులుగా కన్పించకపోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దీంతో ‘ఆపరేషన్ గరుడ’ అంటూ భవిష్య వాణి వినిపించిన సినీనటుడు శివాజీ, ఐటీ దాడులపాలైన సీఎం రమేష్, సీబీఐ హిట్ లిస్ట్‌లో ఉన్న సాన సతీష్‌ల కదలికలపై నిఘా మొదలైంది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరుగుతుందని ముందే చెప్పిన శివాజీని అదుపులోకి తీసుకుని విచారిస్తే గరుడ పురాణం వెనుక అసలు విషయాలు వెలుగు చూస్తాయనే వాదన బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజుల క్రితం అమెరికాకు వెళ్లారు. ఆదివారం రాత్రి ఒక మీడియా ఛానల్‌కు అమెరికా నుంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. చంద్రబాబు కనుసన్నల్లోనే నిర్వహిస్తున్న ఆపరేషన్ గరుడలో కుట్రదారుడైన నటుడు శివాజీని అరెస్టు చేసి, విచారించాలంటూ విజయవాడకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, పి.గౌతంరెడ్డి తదితరులు సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇతర నాయకులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం సమాచారాన్ని శివాజీకి ముందస్తుగా ఎవరు అందించారో బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. అమెరికా నుంచి కడపకు.. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌పై కడప, హైదరాబాద్‌లలో ఇటీవల పెద్ద ఎత్తున ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ఆయన కన్పించకపోవడంతో రాష్ట్రంలో ఆసక్తికర చర్చసాతున్న తరుణంలో ఆదివారం రాత్రి ఆయన కడపకు చేరుకున్నారు. మంగళవారం సీఎం చంద్రబాబు నిర్వహించనున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొనేందుకే సీఎం రమేష్ వచ్చారని చెబుతున్నారు. కాగా, సీబీఐ హిట్‌లిస్ట్‌లో ఉన్న సాన సతీశ్ ఎక్కడ ఉన్నారనేదానిపై చర్చ జరుగుతోంది. కాకినాడలోని సతీశ్ గెస్ట్‌హౌస్, ఆయన అనుచరుల ఇళ్లలో సీబీఐ అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు. దీంతో సీబీఐ నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సతీష్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. -
పోలీసు రక్షణ కల్పించండి: సాన సతీశ్
న్యూఢిల్లీ: సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు కారణమైన ఫిర్యాదు చేసిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సాన సతీశ్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు పోలీసు రక్షణ కల్పించాలని, విచారణకు రావాలని సీబీఐ జారీ చేసిన నోటీసులపై స్టే విధించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో ఓ నిందితుడైన సతీశ్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఈ అక్టోబర్ 15న అస్థానాపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందని, అందువల్ల తనకు పోలీసు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సతీశ్ కోరారు. ఎప్పుడు కోరితే అప్పుడు వచ్చి విచారణకు సహకరిస్తానని మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్‌కు లేఖ రాసిన విషయాన్ని సతీశ్ వెల్లడించారు. సీబీఐ చీఫ్ అలోక్‌వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణను ముగించేందుకు సీవీసీకి 2 వారాల గడవిచ్చి, పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్‌ను సుప్రీంకోర్టు నియమించిన విషయం తెలిసిందే. -
ఆ ‘గరుడపక్షి’ని ఆడించేదెవరు?
‘ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాప్రయత్నంపైన ప్రత్యేక దర్యాప్తు అనవసరమ’ని చంద్రబాబు ప్రకటించడం దాని వెనుక దాగిన అసలు రహస్యాన్ని దాచడానికి చేస్తున్న అజ్ఞాత వ్యూహంగా భావించక తప్పదు. వివిధ భంగిమలలో, పలురకాల చూచిరాతలతో పది పదకొండు పేజీలతో లేఖ రాసి, దాన్ని నిందితుని జేబులో కుక్కి తప్పుకున్న వారెవరో అసలు ‘గండికోట’ రహస్యం. దాన్ని ఛేదించి వాస్తవాలు రాబట్టేదాకా చంద్రబాబు ఆనందంగా పదే పదే ఉచ్చరిస్తున్న ఆ ‘గరుడపక్షి’ ఎవడో, అతని ఆ మిత్రుడు సినీ పరిశ్రమ తోసిరాజన్న ఛత్రపతికాని ఆ ముసుగు వీరుడు ‘శివాజీ’ ఎవరో అతనితో ఉన్న బాదరాయణ సంబంధం లోతుపాతులన్నీ బయటికి రావాల్సిందే. ఏదేశ చరిత్ర చూసినా సమస్తమూ నరజాతి చరిత్రగా పైకి కనిపించినా పరస్పర పీడనా దోసిళ్లతోనే, అధికార దాహంతో ప్రతి పక్షాన్ని చంపుకోవడంతోనే నిండిఉందని ఒక్క శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’లో కాదు, పురాణ సాహిత్యం పేర్కొన్న క్రీస్తుపూర్వపు మగధ రాజ్య చరిత్రలో ఒక ఆసక్తికర ఘట్టం కూడా తిరుగులేని సాక్ష్యం పలుకుతోంది. బహుశా ఆ చరిత్ర మరొకసారి పునరావృత్తమవుతోందని ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఆధ్వర్యంలో సాగు తున్న భ్రష్టుపట్టిన టీడీపీ పాలన నిరూపిస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 75 ఏళ్ల నాడే ఎందుకన్నాడో గానీ మన దేశంలో కొన్ని రాజకీయ పక్షాలకు దేశంలో అసంఖ్యాకులైన దళిత, మహాజనులు, మైనారిటీల జీవితాలే బహు చులకనగా కనిపిస్తోందన్నారు. కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దళితుడిగా పుట్టాలని ఎవరూ కోరుకోరని వ్యంగ్యంగా మాట్లాడుతూ దళితుల్ని తూలనాడారు. అందుకు దళిత సంఘాలన్నీ ఆయన్ని దుమ్మెత్తిపోయవలసిన పరిస్థితి వచ్చిందనీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈమాట ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే చరిత్ర ఎలా పునరావృత్తమవుతుందో మరోసారి చెప్పడానికే. క్రీస్తుపూర్వం మగధ సామ్రాజ్యానికి నంది వర్ధనుడు, ఆ తర్వాత మహానందనుడు అనే చక్రవర్తులు ఇద్దరు రాజులుగా ఉండేవారు. కానీ ఈ ఇరువురు శూద్రులు కావడం వల్ల శూద్రులైన నంద వంశం పొడగిట్టని మౌర్య చక్రవర్తులకు కొమ్ముకాసిన కుటిల నీతిపరుడు, మౌర్యుల పురోహితుడైన చాణక్యుడికి కన్నెర్రగా ఉండి శూద్రజాతికి చెందిన నందవశం నిర్మూలనే కంకణం కట్టుకున్నాడు. సరుకులేని అభినవ చాణక్యుడిగా చంద్రబాబు కూడా ఒక దళితుడినే వినియోగించి తన కుట్రలకు ఆసరాగా పావుచెక్కలా వాడుకుంటున్నాడని లోకం కోడై కూస్తోంది. శతాబ్దాలనాటి చాణక్యనీతికి, ఈనాటి అపర చాణక్యుని నీతికి మధ్య తేడా కన్నా సామీప్యతే ఎక్కువని బోధపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక పెద్ద ప్రతిపక్ష నాయకుడిగా అనుపమానమైన ప్రజాదరణ మధ్య ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా దూసుకువెళుతూ ఆ వేల కిలోమీటర్ల యాత్ర ఇక కొద్ది రోజుల్లోనే విజయవంతంగా ముగుస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జీవనాడిగా, రాష్ట్ర భవిష్యత్ దీపశిఖగా ఉన్న చిరంజీవి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన (లేదా జరిపించిన) హత్యాప్రయత్నం, ‘అభిమాని’ ముసుగులో విశాఖ విమానాశ్రయంలో చొప్పించిన ఆధునిక ‘జుడాస్’ చర్య! ఈ అమానుష రాజకీయ కుట్ర బహిర్గతం కాకుండా పోలీస్ యంత్రాంగం ఒక స్థాయిలో జరిపి, సమర్పించిన రిమాండ్ రిపోర్టులో మాత్రం జగన్‌పై జరిగింది హత్యాప్రయత్నమేనని, ఆయన్ని అంతం చేయడానికే కత్తితో ఆయనపై దాడి జరిగిందని స్పష్టం చేశారు. కానీ ఆ రిమాండ్ రిపోర్టులో రాజకీయ కుట్రదారులెవరో మాత్రం ఎలాంటి వివరణ లేకపోవడం, ‘‘కొత్తదాసరికి పంగనామాలెక్కువ’’ అన్నట్లుగా టీడీపీకి అనుకూలంగా పొత్తుల కోసం ‘డూడూబసవన్నలు’గా మారిన కాంగ్రెస్ సహా ‘ఐక్య సంఘటన’ దుస్తులు ధరించిన కొన్ని ప్రతిపక్షాల నాయకులు సహా, మినహాయింపులు లేకుండా ఈ ఘాతుకాన్ని, కుట్రను ఖండించారు. ఆ నాయకులు జగన్‌ని పరామర్శించారు. ఒకనాడు అలిపిరి సలపరానికి గురైన చంద్రన్నను ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి పరామర్శించి, త్వరలో కోలుకోవాలని కోరుకున్నారు కూడా. కానీ నేడు పాలకుడిగా ఉన్న చంద్రబాబు కానీ, బాధ్య తగల ‘దేశం’ నాయకులు కానీ ఏకైక పెద్ద ప్రతి పక్షంగా ఉన్న పార్టీ నాయకుడు జగన్‌ని కనీసం పరామర్శించే సంస్కారాన్ని కూడా పాటించలేకపోయారు. పైగా జగన్‌ని వాడు ఇంటికి పోయాడుగా అని కనీస వాక్శుద్ధి కూడా లేకుండా ముఖ్యమంత్రి వెటకరించడం హేయం. పోలీసుల రిమాండ్ రిపోర్టులో.. ఇది జగన్‌ని అంతమొందించడానికే జరిగిన హత్యాప్రయత్నమేనని స్పష్టం చేస్తున్నా, ఆ ప్రయ త్నాన్ని ఓ ‘చిన్నగాయం’గా కావాలని ‘చీరుకున్న’ గాయం గానూ, తలచుకుంటే టీడీపీ కార్యకర్తలూ, టీడీపీ వ్యక్తులూ జగన్‌ను కైమా, కైమా చేసేవాళ్లని’ మరికొందరు ‘దేశం’ నాయకులు, మంత్రులూ అమానుషంగా ప్రకటనలు చేయడం దుస్సహం. పైగా ‘ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాప్ర యత్నం పైన ప్రత్యేక దర్యాప్తు అనవసరమ’ని చంద్ర బాబు ప్రకటించడం హత్యాప్రయత్నం వెనుక దాగిన అసలు రహస్యాన్ని దాచడానికి చేస్తున్న అజ్ఞాత వ్యూహంగా భావించక తప్పదు. వివిధ భంగిమలలో, పలురకాల చూచిరాతలతో పది పదకొండు పేజీలతో లేఖ రాసి, దాన్ని నిందితుని జేబులో కుక్కి తప్పుకున్న వారెవరన్నదే అసలు ‘గండికోట’ రహస్యం. దాన్ని ఛేదించి వాస్తవాలు రాబట్టేదాకా చంద్రబాబు ఆనందంగా పదే పదే ఉచ్చరిస్తున్న ఆ ‘గరుడపక్షి’ ఎవడో, సినీ పరిశ్రమ తోసిరాజన్న ఛత్రపతికాని ఆ ముసుగు వీరుడు ‘శివాజీ’ ఎవరో అతనితో ఉన్న బాదరాయణ సంబంధం లోతుపాతులన్నీ బయటికి రావాల్సిందే. అలిపిరి దుర్ఘటనను ఊహించి, ముందు హెచ్చరిక చేయలేని ఆ ‘గండ భేరుండ పక్షి’ శివాజీకి ఆ శక్తిని కల్పించింది, నీడ నిచ్చిందీ ఎవరో తేలాలి. అసలా ‘పక్షి’ కనపడ్డేం? కొన్ని మాసాలనాడే ‘బాబు ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అదే సమయంలో జగన్‌పై హత్యాప్రయత్నం జరుగుతుందన్న ఆ శివాజీ మరోవైపున ఆంధ్రప్రదేశ్‌లో అలజడులు రెచ్చగొట్టేందుకు బీజేపీ నేతలు ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టి, ‘ఐటీ’ దాడులకు, హత్యలకు తెరలేపనున్నారని వీడియోల్లో కనపడి అకస్మాత్తుగా తప్పుకుపోయిన ఆ ‘అపర శివాజీ’ బాబు చేయి, బీజేపీ నేతల చేతులకు దొరక్కుండా ఎక్కడికిపోయి తలదాచుకు న్నాడు?! ‘ఆపరేషన్ గరుడ’ పదాన్ని శివాజీ ఆశీస్సులతోనే టీడీపీ మీడియా గుంపు ప్రచారంలో పెట్టిందా? పదే పదే చంద్రన్న వర్ణిస్తూ వల్లిస్తున్న శివాజీ ‘గరుడ’ రూపంలో ‘గండిపేట’ కార్యాలయంలో తలదాచుకుంటున్నాడా, జూబ్లీహిల్స్‌లోని నేలమాళిగలోనా? హాస్యనటుడిగా ఉన్నట్టుండి రహస్య జీవితంలోకి జారుకున్న ఆ గరుడపక్షిని పట్టుకోవడం మాల్యా, చౌక్సీ, నీరద్మోదీల ఉనికికి మించినంత కష్టమా? తెలుగుదేశం పార్టీ నిర్మాత ఎన్టీఆర్‌ను క్రమంగా పాలకునిగా తప్పించి, ఆ స్థానాన్ని ఆక్రమిం చేందుకు అల్లుడి హోదాలోనే, పార్టీ కార్యదర్శి రూపంలోనే సాగించిన నాటకాలను తెలుగు ప్రజలు కళ్లారా చూశారు. అందులో తొలి నాటకం మల్లెల బాజ్జీ ద్వారా పూర్తి చేయగా, మలి నాటకంలో ‘ఎన్కౌంటర్’ పత్రిక సంపాదకుడు దశరథరామ్ హత్యతో ముగిసింది. ఆ తరువాత చిన్నవీ, పెద్దవీ రకరకాల అంకాలుగా ముగిశాయి, కొత్త అంకాలకు తెర లేపడానికి ముందు సీఎంగా ఎన్టీఆర్‌పై ‘దేశం’లోని తన తైనాతీలను బాబు ఉసిగొల్పి ఎన్టీఆర్పైన చెప్పులు వేయించాడు. ఫలితంగా ‘దేశం’ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనస్తాపంతో తనువు చాలించాల్సి వచ్చింది. తన ‘వెన్నుపోటు’ చరిత్రను అనుక్షణం గమనిస్తున్న దేశ ప్రతిపక్షాలు నేడు ఆంధ్రప్రదేశ్‌లో తన చేష్టల వల్ల, ఇన్నాళ్లుగా అనుసరిస్తున్న ‘ఉల్టా పల్టా’ రాజ కీయాలవల్ల తన పట్ల ఆమోదం చూపవని బాబుకి తెలుసు. తాజాగా, జగన్‌పై జరిగిన హత్యా ప్రయత్నంతో ఆ ‘అపవాదు; తన పార్టీకి రాకుండా చేసుకునేందుకే బాబు ఢిల్లీ యాత్ర తలపెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్‌లోని తాజా పరిణామాల దృష్ట్యా ప్రతి పక్షాల నాయకులు బాబుతో శాలువాలు కప్పించుకోవడం మినహా, తనను మించిన కాంగ్రెస్‌తోనే బాబు చేతులు కలిపి ఐక్యసంఘటన ఏర్పాటుకు ప్రయత్నించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మాట నిలకడ లేని బాబుతో చేతులు కలపడం ఏ రోజుకైనా ప్రమాదమేనన్న అనుభవం కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని ఇతర ప్రతిపక్షాలకూ లేకపోలేదు. జాతీయ స్థాయిలో తన ఐక్యసంఘటన ఏర్పాటుయత్నం విఫలం కాక తప్పదని, తన ఇంట్లో కాలుతున్న చేతుల్ని కాపాడుకునేందుకు మాత్రమే బాబు చేసే ప్రయత్నమని జాతీయ ప్రతిపక్షాలకు తెలుసు. ఒకసారి జాతీయ ఐక్యసంఘటన ప్రయత్నాల్నీ, ప్రభుత్వాల్నీ ముంచేసిన బాబును మరోసారి ఆదరిస్తాయనుకోవటం భ్రమ. కాబట్టి, ఈ దుస్థితిలో దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని రక్షించగల్గింది నిలువెల్లా ‘మశూచి’ మచ్చలతో నిండిన తె.దే.పా.ను మినహాయించి బుద్ధి, జ్ఞానంగల ప్రతిపక్షాల (వామపక్షాలు సహా)తో ఐక్యసంఘటన ముందుకు సాగడమే. అందుకు ముందుగా నెరవేర్చుకోదగిన షరతు– మానవ ద్వేషులైన ‘శాడిస్టు’లు నాయక స్థానంలో ఉన్న పార్టీలను, ఆ శాడిస్టు రాజకీయవేత్తలు అంట కాగుతున్న శివాజీ లాంటి అజ్ఞాత గరుడపక్షులనూ వదిలించుకోవడమూ! ఇంతకీ ప్రస్తుతం దేశ విపక్షాలపై ఢిల్లీలో వాలిన బాబుగారి శివాజీ గరుడపక్షి ప్రస్తుత ఉనికి ఎక్కడ? ప్రస్తుతం ఆ గరుడ శివాజీతోనే అమెరికా చేరిందట, అంటే శివాజీ ఒక మాల్యాలా, ఒక నీరద్మోదీలా, ఒక చౌక్సీలా దేశ పాలకుల కళ్లుకప్పి అమెరికాకు ఉడాయించాడు. సీఎం రమేష్ సింగపూర్‌కు వెళ్లినట్టు వెళ్లి ఒమన్‌కు జారుకున్నాడు. విద్యుచ్చక్తి శాఖలో ఓ చిన్న ఉద్యోగి హోదాలో ఉండి కోటికి పడగలెత్తిన సానా సతీష్ (తూర్పుగోదావరి) సీబీఐ కేసులో ఇరుక్కుని అడ్రస్ లేకుండా ఎటో పోయాడు. మరి ఇక చంద్రబాబు ప్రయాణించే మార్గం ఎన్ని తీరాలకో చూడాలి. అధి కారాంతమందు చూడవలె నా అయ్య సౌభా గ్యముల్!! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
సానా సతీష్ ఇళ్లలో సోదాలు
కాకినాడ(తూర్పు గోదావరి జిల్లా): సీబీఐని కుదిపేసిన కేసులో నిందితుడిగా ఉన్న సానా సతీష్ ఇళ్లలో సీబీఐ బృందం సోదాలు నిర్వహించింది. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందింది. ఓ కేసులో సీబీఐ అత్యున్నత అధికారిగా ఉన్న రాకేష్ ఆస్తానా మధ్యవర్తి ద్వారా రూ.5 కోట్లు లంచం అడిగారంటూ చేసిన ఆరోపణ సీబీఐలో కలకలం రేపింది. ఇదే వ్యవహారంలో ఓ సీబీఐ డీఎస్పీ అరెస్ట్ కావడంతో అందరి దృష్టి ఈ వ్యవహారంపై పడింది. దేశంలోనే సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో సానా సతీష్ కీలక వ్యక్తి అన్న సమాచారం ఈ ప్రాంతవాసుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఓ టీడీపీ ఎంపీతో ఆయనకున్నసాన్నిహిత్యంపై ఇప్పుడు చర్చకు దారితీసింది. జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన అంశంలోనూ సానా సతీష్ క్రియాశీలకంగా వ్యవహరించాడని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఇచ్చే తాయిలాలు, నగదు లావాదేవీలను ఆయనే దగ్గరుండి జరిపించాడని చెబుతున్నారు. సీబీఐని కుదిపేసిన సానా సతీష్ ఇక్కడివాడే -
సీబీఐని కుదిపేసిన సానా సతీష్ ఇక్కడివాడే
సాక్షి, కాకినాడ: ఇరవైయేళ్ల క్రితం అతనో సాధారణ చిరుద్యోగి. తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద విద్యుత్‌శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేరాడు. కొంతకాలానికే ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి వ్యాపార రంగంలో అడుగుపెట్టి...చిరుద్యోగి నుంచి బడా వ్యాపారిగా, పొలిటికల్ లాబీయింగ్‌లో దిట్టగా గుర్తింపు పొందాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బినామీగా ఉన్న ఓ ఎంపీకి అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నాడు. ఆయనే సీబీఐలో తీవ్ర సంక్షోభానికి తెరలేపిన సానా సతీష్. తూర్పు గోదావరిజిల్లా కాకినాడకు చెందిన ఆయన పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సుమారు పదిహేనేళ్ల క్రితమే సబ్ ఇంజినీర్‌గా, ఏఈగా పనిచేస్తూ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా వ్యవహరించాడు. ఆ తరువాత ఉన్నత స్థాయిలో ఏర్పడిన పరిచయాలతో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడ ప్రఖ్యాత క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ వంటి ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలతో ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ మ్యూజియం కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు. పెరిగిన పరిచయాలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లకు పడగలెత్తి 25కుపైగా కంపెనీల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఓ కేసులో సీబీఐ అత్యున్నత అధికారిగా ఉన్న రాకేష్ ఆస్తానా మధ్యవర్తి ద్వారా రూ.5 కోట్లు లంచం అడిగారంటూ చేసిన ఆరోపణ ఇప్పుడు సీబీఐని ఓ కుదుపు కుదిపింది. ఇదే వ్యవహారంలో ఓ సీబీఐ డీఎస్పీ అరెస్టు కావడంతో అందరి దృష్టి ఈ వ్యవహారంపై పడింది. దేశంలోనే సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో సానా సతీష్ కీలక వ్యక్తి అన్న సమాచారం ఈ ప్రాంతవాసుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఓ టీడీపీ ఎంపీతో ఆయనకున్న సాన్నిహిత్యంపై ఇప్పుడు చర్చకు దారితీసింది. సీబీఐ వ్యవహారంలో సదరు ఎంపీ పాత్ర ఉందన్న సమాచారంపై ఈ ప్రాంతవాసులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన అంశంలోనూ సానా సతీష్ క్రియాశీలకంగా వ్యవహరించాడని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. పార్టీ మారేందుకు ఇచ్చే తాయిలాలు, నగదు లావాదేవీలను డాయనే దగ్గరుండి జరిపించాడని చెబుతున్నారు.