
కాకినాడ(తూర్పు గోదావరి జిల్లా): సీబీఐని కుదిపేసిన కేసులో నిందితుడిగా ఉన్న సానా సతీష్ ఇళ్లలో సీబీఐ బృందం సోదాలు నిర్వహించింది. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందింది. ఓ కేసులో సీబీఐ అత్యున్నత అధికారిగా ఉన్న రాకేష్ ఆస్తానా మధ్యవర్తి ద్వారా రూ.5 కోట్లు లంచం అడిగారంటూ చేసిన ఆరోపణ సీబీఐలో కలకలం రేపింది. ఇదే వ్యవహారంలో ఓ సీబీఐ డీఎస్పీ అరెస్ట్ కావడంతో అందరి దృష్టి ఈ వ్యవహారంపై పడింది.
దేశంలోనే సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో సానా సతీష్ కీలక వ్యక్తి అన్న సమాచారం ఈ ప్రాంతవాసుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఓ టీడీపీ ఎంపీతో ఆయనకున్నసాన్నిహిత్యంపై ఇప్పుడు చర్చకు దారితీసింది. జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన అంశంలోనూ సానా సతీష్ క్రియాశీలకంగా వ్యవహరించాడని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఇచ్చే తాయిలాలు, నగదు లావాదేవీలను ఆయనే దగ్గరుండి జరిపించాడని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment