
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు కోవర్టు బొల్లినేని గాంధీ, సతీశ్‌లపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఆదివారం ఆయన ట్వీట్ చేస్తూ..‘‘మనీ లాండరింగ్ దళారి సానా సతీశ్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీలో చంద్రబాబు కోవర్టు బొల్లినేని గాంధీ, సతీశ్ దుబాయిలోని ఒక హోటల్‌లో రహస్యంగా కలిశారని విచారణలో తేలినట్లు మీడియాలో వచ్చింది. ఇందులో బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా స్టోరీలు వెలుగు చూస్తాయి’’ అంటూ పోస్ట్ చేశారు. మరోవైపు నారాయణ శ్రీచైతన్య కాలేజీలపై కూడా ఆయన మండిపడ్డారు.
‘‘నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై కేసులు నమోదు చేయాలని గౌరవ హైకోర్టు ఆదేశించడం హర్షణీయం. కిందటేడాది 79 మంది విద్యార్థులు వత్తిడి వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డట్టు దాఖలైన పిల్‌పై కోర్టు స్పందించింది. మృత్యు లోగిళ్లుగా మారిన ఈ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి’’ అని ట్విట్‌లో పేర్కొన్నారు.
మనీ లాండరింగ్ దళారి సానా సతీశ్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది. edeeddఈడీలో చంద్రబాబు కోవర్టు బొల్లినేని గాంధీ, సతీశ్ దుబాయిలోని ఒక హోటల్‌లో రహస్యంగా కలిశారని విచారణలో తేలినట్లు మీడియాలో వచ్చింది. ఇందులో బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా స్టోరీలు వెలుగు చూస్తాయి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 4, 2019
Comments
Please login to add a commentAdd a comment