
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నోరు అదుపులో ఉంచుకోవాలని, లేకుంటే ప్రజలే బట్టలూడదీసి కొడతారని కాంగ్రెస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. గురువారం సీఎల్పీలో ఆయన మాట్లాడుతూ...మరోసారి పిట్టల దొరలా మాట్లాడిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పకుండానే మీడియా సమావేశాన్ని ముగించారన్నారు. ప్రతి గ్రామానికి మంచి నీళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతానని మాట్లాడి, ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాడో ప్రజలు గుర్తించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి తథ్యమని, ఆయన కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.