
సాక్షి,మాచారెడ్డి: గిరిపుత్రుల భూముల జోలికి వస్తే కేసీఆర్‌కు పుట్టగతులుండవని మండలి విపక్షనేత, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ హెచ్చరించారు. గిరిజనుల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మాచారెడ్డి మండలంలో ని సోమారంపేట, బంజపల్లి, రత్నగిరిపల్లి, రాజ్‌ఖాన్‌పేట గ్రామాల్లో సోమవారం నిర్వహిం చిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలోనే పేద గిరిజనులకు భూములు ఇచ్చి పట్టాలు ఇస్తే, ఇప్పుడు ఆ భూ ములను బలవంతంగా అటవీశాఖ అధికారులే లాక్కోవడానికి నీ జాగీరు కాదని కేసీఆర్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
నా కంఠంలో ప్రాణముండగా గిరిజనుల నుంచి ఒకసెంటు భూమి కూడా పోనివ్వనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గిరిజనుల భూములకు కాంగ్రెస్ పార్టీ రక్షణ కవచంలా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవేళ్ల నుంచి తాగునీరు తీసుకువచ్చి ఇక్కడ వ్యవసాయ భూములకు నీరందించామన్నారు. గంప గోవర్ధన్ ప్రాణహిత చేవెళ్లను, గోదావరి జలాలను అడ్డుకుంటున్నాడని విమర్శించారు. నేతలు పొన్నాల లక్ష్మారెడ్డి, పంపరి శ్రీనివాస్, అధికం నర్సాగౌడ్, రమేశ్‌గౌడ్, రెడ్డిపేట నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment