భవానీపేటలో మాట్లాడుతున్న షబ్బీర్‌అలీ
సాక్షి,కామారెడ్డి: రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రస్తుతం 2 లక్షల కోట్ల అప్పు చూపిస్తున్నారని కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి షబ్బీర్‌అలీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని ఆరెపల్లి, పోతారం, భవానీపేట్, భవానీపేట్ తండాల్లో పర్యటించారు. ఆయా గ్రా మాల్లో పాదయాత్ర చేస్తు ఇంటింటా పాదయాత్ర నిర్వహించారు. మాచారెడ్డి మండలానికి తన హయాంలో 4వేల కరెంట్ స్తంభాలు ఇచ్చి కరెంట్ క ష్టాలు తీర్చానని ఆయన అన్నారు. గంపగోవర్ధన్ కనీసం ఆ కరెంట్ స్తంభాలకు వీధిలైట్లు కూడా బిగించలేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రతి గ్రామానికి రోడ్డు వేయించానని చెప్పారు.
గరీబోడిని చెప్పకుంటూ మూడంతస్తుల భవనా న్ని నిర్మించుకున్నాడన్నారు. కేసీఆర్ 300కోట్లతో ఇల్లు, రూ.3కోట్లతో బాత్‌రూం నిర్మించుకున్నారన్నారు. నాలుగేళ్ల పాలనలో పుట్టిన బిడ్డపై కూడా రూ.50అప్పు మోపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. సబ్సిడీ ట్రాక్టర్లనీ పార్టీ నాయకులకే ఇచ్చుకున్నారన్నారు. కేసీఆర్, మోడీ కలిసి 28శాతం జీఎస్‌టీ బీడీ కార్మికులకు పనిలేకుండా చేశారన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్ష లు ఇస్తామని, ఏక కాలంలో రూ.2లక్షల రుణాల ను మాఫీ చేస్తామన్నారు. అర్హులందరికి పింఛన్లు, రేషన్ దుకాణాల ద్వారా 7కిలోల సన్నబియ్యంతో పాటు 8 రకాల నిత్యావసర వస్తువులు అందజేస్తామన్నారు.2004లో మాదిరిగా తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే కామారెడ్డి నియోజకవర్గ ప్రజల రు ణం తీర్చుకుంటానని షబ్బీర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలశాఖ అధ్యక్షుడు పంపరి శ్రీనివాస్, నాయకులు గణేష్‌నాయక్, అధికం నర్సాగౌడ్, బ్ర హ్మానందారెడ్డి, రమేశ్‌గౌడ్, నవీన్‌రెడ్డి, లింగారెడ్డి, శ్రీనివాస్ మల్లారెడ్డి, రవిగౌడ్ ఉన్నారు.
పతి కోసం సతి ప్రచారం
సాక్షి,కామారెడ్డి: మండలంలోని లింగాపూర్‌లో మంగళవారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌అలీ సతీమణీ నఫీజ్ పర్వీన్, కుమారుడు ఇలియాస్‌లు ప్రచారం నిర్వహించారు.
షబ్బీర్‌అలీ సతీమణీ నఫీజ్ పర్వీన్
Comments
Please login to add a commentAdd a comment